ఓం స్వామియే శరణమయ్యప్ప
తాంబూలం
ఓం పూర్ణా పుష్కలాంబా సమేత శ్రీ ధర్మశాస్తాయై నమః . ఇదం తాంబూలం సమర్పయామి. అంటూ శ్రీ అయ్యప్పస్వామికి పూజలో తాంబూలం సమర్పిస్తాము.
తాంబూల ప్రాశస్త్యం : - మన తెలుగువారిండ్లలో తాంబూలము లేనిదే ఏ శుభకార్యము జరుగదు. మంగళ కార్యాలలో,ఉత్సవాలలో, దేవతాపూజలలో, వివాహాలలో తాంబూలం ముఖ్యపాత్ర వహిస్తుంది. పెళ్ళిళ్ళలో మొదటి కార్యక్రమంగా తాంబూలాలు పుచ్చుకుంటారు. ఇంటికి వచ్చిన అథిదులకు తాంబూలమునిచ్చి సత్కరిస్తుంటారు. కొన్ని విషయాలలో కొందరికి మనం " అగ్రతాంబూలము" నిచ్చి గౌరవిస్తుంటాము.
తాంబూల వివరణ : - తాంబూలములో కలిపే ద్రవ్యాలు 21 అని పెద్దలు పేర్కొన్నారు. ఒక్కొక ద్రవ్యానికి ఒక్కొక ప్రయోజనం వుంటుందని వైద్యశాస్త్రం చెబుతోంది.
తాంబూల ద్రవ్యాలు : - 1. నాగవల్లి దళం ( తమలపాకు), 2. పూగీఫలం ( వక్క , పోకచెక్క), 3. సున్నం,
4. పొగాకు(జర్దాలు మొదలైనవి), 5. ఖదిరసారం (కాచు), 6. కస్తూరి, 7. లతాకస్తూరి, 8. సువర్ణ దళం ( అతిపలుచని బంగారు రేకు), 9. రౌప్య దళం ( అతిపలుచని వెండిరేకు), 10. వాతాదు, 11. కంకోలం,
12. తృణ కేసరం, 13. జాతిపత్రి(జాపత్రి), 14. జాతిఫలం(జాజికాయ), 15. లవంగం, 16. శొంఠి,
17. ఆర్ద్రకం, 18. చందనం( శ్రీగంధం), 19. నారికేళం(కొబ్బరి తురుము), 20. త్వక్కు , 21. కర్పూరం (పచ్చకర్పూరం).
తాంబూల ప్రయోజనాలు : - తాంబూల సేవనం ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద శాస్త్రం చెబుతున్నది.
తాంబూల మంజరి అను గ్రంధములోని ఈ క్రింది శ్లోకాన్ని చూడండి.
శ్లో॥ తాంబూలం కటుతిక్త ముష్ణ ముధురం క్షారం కషాన్విత
వాతఘ్నం కఫనాశనం క్రిమిహరం దుర్గంధ నిర్మూలనం
వక్త్రస్యాభరణం విశుద్దకరణం కామాగ్ని సందీపనం
తాంబూలస్య సఖే! త్రయోదశ గుణాః స్వర్గే పితే దుర్లభాః ॥
తాంబూలమునకు శరీరము లోని వేడిని, మధురం (sugra) ను , వాతమును, కఫమును తగ్గించుట, నోటి
(పిప్పి పండ్ల ) లోని క్రిములను నశింప జేసి నోటి దుర్వాసనను పోగొట్టుట ,నోటిలోపల శరీరము లోపల
శుద్ధి ,పరచుట, నోటిని అలంకరించుట ( పెదవులను ఎర్రబరుచుట), కామమును ఉద్ధీపనము చేయుట
( కామోద్రేకము కలిగించుట) ఇత్యాది 13 గుణములు కలవని వైద్యశాస్త్రము చెబుతున్నది. ( ఇట్టి 13
గుణములు కలిగిన సఖా అనగా మిత్రుడు (తాంబూలం) మనకేగాని, స్వర్గములోనున్న మన పితరులకు దొరకడు(దు) కదా. అని రచయిత చమత్కరించాడు.)
అట్టి తాంబూలమును , తాంబూలములో వాడే 21 ద్రవ్యములలో మనకు ఇష్ఠములేనివి ( జర్దాలు వగైరా )
తప్ప మిగిలిన ద్రవ్యములతో వారం రోజులకు ఒకసారి వాడినచో ఆరోగ్యము చేకూరుననియు, అధికముగా
వాడిన అనారోగ్యము కలుగునని చెప్పబడుచున్నది.
కాని అయ్యప్పలు (మాలాధారణ చేసి దీక్షలో వున్నవారు) తాంబూలము సేవించ కూడదని చెప్పబడు
చున్నది. ఎందుకనగా తాంబూలములో ఎన్ని సుగుణములు వున్నా కామోద్రేకమును కలిగించు (దుర్ )
గుణమున్నది. దీక్షలో వున్నవారు నైష్ఠిక బ్రహ్మచర్యము ఆచరించవలెను. కనుకనే తమోగుణమును పెంచే ఉల్లి వెల్లుల్లి, క్రోధమును పెంచే అధిక కారము, మసాలాదినుసులు, మోహమును ( కామోద్రేకమును) పెంచే తాంబూలము దీక్షలో ఉన్నవారికి నిషేదములైనవి. స్వాములు దీక్షలో వున్నపుడు ఎన్నో దేవాలయాలకు
వెళుతుంటారు. అలాగే ఆంజనేయస్వామి దేవాలయాలకు వెళుతుంటారు. ఆసమయంలో ఆంజనేయ
స్వామికి తమలపాకులతో ఆకుపూజ జరుగుచున్న మనకు కూడా ఒక తమలపాకును ప్రసాదంగా యిస్తారు. అట్టి ఆకును ( బ్రహ్మదేవుడు తమలపాకులో మధ్యభాగమున లక్ష్మీదేవికి , తొడిమ మరియు
చివరిభాగమున జ్యేష్ఠాదేవికి స్థానము కల్పించాడట. కనుక) తొడిమ మరియు చివరి భాగమును మిగిలిన
భాగాన్ని ( కేవలం ఆకును మాత్రమే తీసుకొని) తినవలెనని చెప్పబడు చున్నది.
పైవిషయమునకు సారూప్యము గల ఒక ఉదాహరణ.
( శ్రీ ) లంకకు రాజైన రావణాసురుడు ( రావణబ్రహ్మ) చతుషష్ఠి ( 64 ) కళలలో ఆరితేరినవాడు. ప్రతిదినం ఉదయాన్నే సప్త సముద్రములలో స్నానమాడి , నవకోటి లింగములుకు పూజచేసే శివపూజా
దురంధరుడు. వెండికొండను ( హిమాలయ ప్రర్వతమును) తన బాహుబలముచే ఎత్తి , తన గానకళతో శివుని మెప్పించి శివానుగ్రహమును పొందిన శివ భక్తాగ్రేసరుడు. నవగ్రహములను తన సింహాసనమునకు
సోపానములుగ చేసుకొని సింహాసమునధిష్ఠించిన వీరాగ్రేసరుడు. అంతటి గొప్పవాడైన రావణబ్రహ్మ , తన చెల్లెలు శూర్పనఖకు జరిగిన పరాభవమునకు కోపముతో క్రోధ( గుణ)ము నాకు లోనై , ప్రతీకారముగా సీతను అపహరించి తెచ్చి , ఆమెపై వ్యామోహమును పెంచుకొని , కామ ( గుణ ) ము నకు లోనై , ధర్మచ్యుతుడై తాను రాముని చేతిలో మరణించడమే కాకుండా , తనవారి మరణమునకు కూడా కారణమైనాడు. కనుక
కామ,క్రోధములకు దీక్షాపరులు దూరంగా వుండాలని వివేకవంతులైన పెద్దలు చెబుతుంటారు.
చూసారా కామ క్రోధ గుణములను జయించలేక , ఆగుణములను ఆశ్రయించుట వలననే అంతటి గొప్ప రావణబ్రహ్మ మనకు ( ధర్మపరులకు ) దూరమైనాడు. తాంబూలము ఎన్ని సుగుణములున్నదైనా , కామోద్రేకమును పెంచు ఒక్క దుర్గుణము ఉన్నందున దీక్షాపరులకు దూరమైనది. ( నిషేదమైనది. )
స్వామిశరణం
సదా అయ్యప్ప సేవాభిలాషి
వోరుగంటి నాగభూషణం గురుస్వామి.
తాంబూలం
శ్లో॥ ఓం పూగీఫల సమాయుక్తాన్ - నాగవల్లీ దళైర్యుతం
కర్పూరచూర్ణ సమ్యుక్తాన్ - తాంబూలం ప్రతి గృహ్యతామ్॥

No comments:
Post a Comment