అయ్యప్పకు అక్షర మాలిక







మరాధిప నుత , అసుర సంహారక - ఆశ్రిత వత్సల అయ్యప్పా 
దిదేవసుత , ఆపద్భాందవ - ఆనంద దాయక అయ్యప్పా             1   


ష్టదైవమా , ఇహపర దాయక - ఇడుముల బాపర అయ్యప్పా 
శ్వర తనయా , ఈతిబాధలు - ఇపుడేతీర్చర అయ్యప్పా           2.  


భయ సంధ్యల , నిన్నే కొలిచెద - ఉడుతా భక్తితో అయ్యప్పా 
కందని , ఊహాతీత - వేదాంత వేద్యా అయ్యప్పా.                 3.  


షి పూజిత హే , ఋగ్వేద రూపా - నక్షత్ర రూపా అయ్యప్పా 
ఢిగ నిన్ను , నమ్మిన వారికి - కొదవే  లేదుగ అయ్యప్పా.         4   


లుబ్దుడ నైతిని, యింత కాలము - నిను కొలువక నేనయ్యప్పా 
నా , తనువూ మనసూ ఊరడిల్లె నీ - పదముల చెంతనె అయ్యప్పా   5.


రుమెలి వాసా , ఎరుకల వేషా - ఏమార్చకు  నను అయ్యప్పా 
కాంత వాసా , ఏమని పొగడుదు - నీదు మహిమలు అయ్యప్పా     6.  


శ్వర్య  దాయక , విశ్వ మోహనా - మోహినిసుత వో అయ్యప్పా 
ఐక్యము చేయర  , నీలో నన్ను - శరణం శరణం అయ్యప్పా           7.  


రులను చూచి , ఓర్వని గుణమును - దూరము చేయర అయ్యప్పా 
రిమి తోడను , సేవలు చేయగ - ఓర్పును నాకివు మయ్యప్పా.       8.  


రారా నీమహిమలు చూడగ - అచ్చెరువాయెర అయ్యప్పా 
ఔదల దాల్చుదు , నాదు గురువుల - మాటను ఎపుడు అయ్యప్పా     9.  


అంబిక బాలా , అనాధ రక్షక - అఖిలము నీవే అయ్యప్పా 
ఆః ( హా) యని మేమచ్చెరు వొందగ - మహిమలు జూపర అయ్యప్పా   10  


రిమల వాసా , కాంతి మలేశా - కరుణించుము మము అయ్యప్పా
ఖండితముగ నిను , నమ్మిన వారికి - కలుగును మోక్షము అయ్యప్పా. 11  


ణపతి సోదర , గండర గండా - శరణం శరణం అయ్యప్పా 
నమైనా నీ నామము తలచిన - తొలగును భయములు అయ్యప్పా.   12  


చంచలమైనా , నాదు మనసును - స్థిరముగ జేయర అయ్యప్పా 
ఛండాలునిలో , బ్రాహ్మణులోను - నీవే గదరా అయ్యప్పా                   13  


గమునెల్ల బ్రోచెడి స్వామీ - జగన్నాధవో అయ్యప్పా 
జాలమేలరా నాపై కరుణను - కురిపించుటకు అయ్యప్పా                   14  


క్కుటమారము చేయు వారికి - చిక్కవు గదరా అయ్యప్పా 
ణఠణ ఠణ ఠణ , వాద్యము మోగగ - సంతసింతువో అయ్యప్పా       15  

డంబముతో చరియించు వారికి - దక్కదు నీకృప అయ్యప్పా 
మరుకమ్ము ధరియించిన శివుడు - నీదు జనకుడుగ అయ్యప్పా       16  


ల్లీ తండ్రీ , గురువూ దైవము - సర్వము నీవే అయ్యప్పా 
తప్పక ఎప్పుడు నిన్నే కొలుతుము - శరణం శరణం అయ్యప్పా.       17  


దండిగవున్న వారుధనముతో - నిను కొనలేరు అయ్యప్పా 
నధాన్యములను కోరనుస్వామీ - నీ దయ  కోరితి నయ్యప్పా           18  


పంబా బాలా , పాప విమోచన - పావన చరితా అయ్యప్పా 
ణి నీడలొ పవ, ళించిన స్వామీ - శరణం శరణం అయ్యప్పా           19  


లాడ్యులైనా , నిన్ను బలముతో - గెలువగలేరు అయ్యప్పా 
క్తితో నిన్ను, కొలిచెడి వారి - కోర్కెలు తీర్తువు అయ్యప్పా.               20


దనాంతక సుత , మోహిని పుత్రా - మోహము బాపర అయ్యప్పా 
కుభేర , దిక్పాలక పూజిత - శరణం శరణం అయ్యప్పా         21  


మా నాధ సుత , రమ్యగుణాకర - అలంకార ప్రియ అయ్యప్పా 
ఘువుగ నిన్ను , పూజించినను - సంతసింతువో అయ్యప్పా           22  


శట్కారముల, కధిపతి నీవే -  శరణం శరణం అయ్యప్పా 
శంకర తనయా , షణ్ముఖ సోదర - మా శంకలు బాపర అయ్యప్పా   23  


షండుడైన, పాషండు డైన నీ - నామము తలచిన అయ్యప్పా 
రగున వారిని , కరుణించేటి - కరుణా మయుడవు అయ్యప్పా.       24  


రి హర పుత్రా , అయ్యప్ప స్వామీ - శరణం శరణం అయ్యప్పా 
హారతి గైకొని , ఆదరించారా  .. - శరణం శరణం అయ్యప్పా             25  


క్షణభంగురమౌ , తనువని తెలుసు - శాశ్వత మేదీ అయ్యప్పా 
క్షణక్షణమూ నిను, మరువక తలచెడి - శక్తి నొసంగుము  అయ్యప్పా.   26  


మా గురుదేవులు , మార్గదర్శకులు - మా  మంచివారగు అయ్యప్పా 
చంద్రమౌళి గురుస్వామిని బ్రోవర - దీవెన లిచ్చి అయ్యప్పా             27  


నీదు సేవలు , జేసెడు స్వాముల - నిజమగు భక్తుల నయ్యప్పా 
శంకరు , శరణం , నారసింహులను - కరుణతొ బ్రోవర అయ్యప్పా       28  


తీరుగ నిను , కొనియాడితి నే - నాగభూషణము నయ్యప్పా 
కృపా జలధి నీ కృపనూ నాపై - కురిపించుము నా అయ్యప్పా         29  


భక్తితోడ పాటను,పాడిన - విన్నవారికిని అయ్యప్పా 
సుఖసంతసమును ఆయురారోగ్య - సంపదలిచ్చును అయ్యప్పా         30  





No comments:

Post a Comment