నింబవృక్షమ్ ( వేప చెట్టు)

                                                   
                                                         ఓం స్వామియే  శరణమయ్యప్ప
                                                         నింబవృక్షమ్ (  వేప చెట్టు)

                              సదా నింబవృక్షస్య - మూలాధి వాసాత్
                              సుధా త్రావిణం - త్రిక్త్య  మవ్య ప్రియంతం
                              తరుం కల్ప వృక్షాధికం - సాధయంతాం
                               నమా మీశ్వరం - సద్గురుం సాయి నాధం ॥

 ఎల్లప్పుడూ వేపచెట్టు ( నింబవృక్షం) మొదట్లో అనగా వేపచెట్టు  క్రింద కూర్చొని యుండువారు , తనను ఇష్ఠపడు వారికి , తాను ఇష్ఠ పడు వారికి అమృతమును త్రాగించు ( సుధను అనుగ్రహించు ) వారు, తనను గురించి సాధన చేయువారికి కల్పవృక్షము వారు అయిన సద్గురు సాయినాదునకు ( సాయిబాబా వారికి), నమస్కరించు చున్నాను.

సాయిబాబా వారు , వారు జీవించి యున్న కాలములో ఎక్కడ తిరిగి వచ్చినా ఒక వేపచెట్టు  మొదట్లో ( క్రింద) కూర్చొనే వారట. ఇచ్చట వేపచెట్టు అనగా షడ్రుచులలో చేదుగుణము. జీవితములో చేదు అనగా బాధలు, కష్ఠాలు మొదలైనవి.

సాయిబాబా వారు తనను నమ్మిన వారిని, తనను విశ్వాసముతో సేవించిన వారిని , వారి కష్ఠములను బాధలను తాను గ్రహించి ( తీర్చి) , వారికి తన అమృత  తుల్యమైన వాక్కులతో జ్ఞానబోధ  చేసే వారు .
తాను వారికి  కల్పవృక్షము వలె  సమస్తమును ( కోరిన కోర్కెలు) ప్రసాదించు వారైన సాయినాధునకు నమస్కరించు చున్నాను.

సమర్ధ సాయినాధ్ మహారాజ్ కీ జై , అని సాయిబాబా వారికి నమస్కరించెదము.

వేపచెట్టు  విశిష్ఠత : - మన హైందవ సంప్రదాయమున రావి(రాగి)చెట్టు  విష్ణుమూర్తి గాను, వేపచెట్టు  లక్ష్మీదేవి గాను భావించ   బడుచున్నది. ఇప్పటికి కూడా గ్రామాలలో రావిచెట్టు  వేపచెట్టు  దగ్గరలో ( కొద్ది గజముల దూరములో) ఉన్నచో వాటికి వివాహము( తంతు) చేసే ఆచారము వున్నది. వేపచెట్టు  తలుపులు, కిటికీలు, బల్లలు మొదలగు గృహోపకరణములు తయారు చేయుటకు కలపగాను, కొన్నిచోట్ల వంటచెరకుగాను ఉపయోగ పడు చున్నది. వేప ఆకు , వేప మండలు అమ్మతల్లి ( చిన్నతల్లి లేక స్మాల్ పాక్స్ ) సోకిన వారి ఇండ్లలో ద్వారమునకు కట్టుటకు , సోకినవారి పడకలో వేయుటకు ఉపయోగించెదరు. ఆకులను మెత్తగా నూరి నూనెతో కలిపి వారి శరీరముపై లేపనము చేసినచో పుండ్లు వ్రణములు  తగ్గిపోవును. వేప ఆకుతో కాచిన నీటితో ఆవిరి పట్టినచో జలుబు, ఫ్లూ తగ్గిపోవును. వేప ఆకుతో కాచిన నీటితో బాలింతలకు స్నానము చేయించెదరు. వేపపూత " ఉగాది పచ్చడి " లో ఉపయోగింతురు. వేప  గింజల నుండి తీసిన నూనెను ఔషదములలో ఉపయోగింతురు. margo స్నానపు saop లోను ఉపయోగించెదరు. కొన్ని రకముల క్రిమిసంహారక మందులలోను ఉపయోగించెదరు. వేపగింజల పిప్పిని పొలములలో ఎరువుగా వాడెదరు. వేప బెరడుతో చేసిన కషాయమును సేవించుట వలన జలుబు తగ్గిపోవును. లేత వేపపుల్లలను దంతధావనము నకు ఉపయోగింతురు. వేప వలన ఇంకను నాకు తెలియని ఎన్నో ఉపయోగములుండ వచ్చును. ఇన్ని విధములుగా మానవులకు ఉపయోగపడు నింబ( వేప)  వృక్షము కల్పవృక్షము వంటిదే కదా. సాయిబాబా వారు తనకొరకు సాదయంతాం( సాధన చేయువారికి) కల్పవృక్షము వంటివారు కదా. కనుకనే బాబావారు తాను కూర్చొనుటకు వేపచెట్టును ఎంచు కున్నారేమో . స్వామిశరణం .





No comments:

Post a Comment