అయ్యప్ప నిత్య లఘుపూజ

                                         
ఓం స్వామియే శరణమయ్యప్ప
అయ్యప్పనిత్య (సాధారణ) లఘుపూజ అర్ధ తాత్పర్య సహితము.

పీఠిక
స్వామిశరణం . అయ్యప్ప స్వామివారి పూజ స్వామిభక్తులు ప్రతినిత్యం చేసుకుంటూనే వుంటారు. భక్తులు వారివారి అనుభవాన్ని బట్టి ఎవరు చేసుకునే ప్రకారం వారు చేసుకుంటూనే వుంటారు. నేను చేసుకునే పద్దతి , ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి , కాలకృత్యములు తీర్చుకొని  స్నానమాచరించి,  స్వామివారికి అలంకారము చేసి , పూజచేసి , తీర్ధ ప్రసాదములు స్వీకరించిన తర్వాతనే నిత్య కృత్యములలో పాల్గొంటాను. (ఇందులో ప్రత్యేకత ఏముంది , ఎవరు చేసినా అంతేకదా అనుకునే ఆస్కారము వుంది కదా , అందుకని “అయ్యప్పనిత్య (సాధారణ )లఘుపూజ అర్ధ తాత్పర్య సహితము” అని వ్రాయుచున్నాను. ఇది పీఠిక కనుక అలా వ్రాయుచున్నాను. నేను ఇలా వ్రాసినందుకు విజ్ఞులు నన్ను క్షమించ వలసినదిగా ప్రార్ధన. అన్యధా భావించకండి). పూజలో గణపతి , కుమారస్వామి , సకలదేవతా ప్రార్ధన , అయ్యప్పకు షోడషోపచార (ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం , అర్ఘ్యం , ఆచమనీయం , స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, చందనం, కుంకుమ, పుష్పములు , పూలమాల ) పూజ , స్వామివారి అంగపూజ , శరణుఘోష ఉత్తరంగా పూజగా ధూపం , దీపం , నైవేద్యం , తాంబూలం, హారతి, క్షమాపణ , తీర్ధ ప్రసాద  స్వీకరణ చేస్తాము. పూజమొత్తం 30 నిమిషాలలో పుర్తౌతుంది. ఇంత త్వరగా పూజచేస్తే ఎంత ఫలితం ఉటుందండీ కాని, చేసే పూజలోని శ్లోకాలు, పద్యాలు మనము దేనినైతే ఉచ్చరిస్తున్నామో దానియొక్క అర్ధం తెలుసుకొని ,మననం చేసుకుంటూ చేస్తే “విత్తనంబు మర్రి  వృక్షంబునకు ఎంత “ అన్నట్లుగా , మర్రిచెట్టు గింజ చాలా సూక్ష్మంగా వుంటుంది. దానికి అదను రాగానే మొలకెత్తి మహావృక్షమైనట్లుగా ,మంత్రార్ధమును మననము చేసుకుంటూ పూజచేస్తే ఫలితం అధికంగా వుంటుంది. మనము చదివే మంత్రార్ధము భావము తెలుసుకున్నట్లైతె , ఆమంత్రానికి శ్లోకానికి సంభందించిన ఆ దేవతయొక్క రూపలావణ్యములు,గుణ గణములు , వారికి ఎవరితో ఎలాంటి సంభందము వున్నది, మనకు ఆదేవతా స్వరూపము కన్నులకు కట్టినట్లుగా అనిపిస్తుంది. మన మనస్సుకు ఆదేవునిపై ఏకాగ్రతతో పూజచేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఏకాగ్రతతో  చేసే పూజకు ఫలితం ఎక్కువగా వుంటుంది. కనుక నేనుచేయు పూజ “అయ్యప్ప నిత్య (సాధారణ ) లఘు పూజ” కు అర్ధ తాత్పర్యములను వ్రాయుచున్నాను. నాకు తెలిసిన దానిని తోటివారికి పంచి , వారికి తెలిసిన దానిని వారి నుండి గ్రహించుటయే నాకు ఆనందము.  నేను చేసిన ఈ చిన్ని ప్రయత్నములో నాకు తెలియక తెలియక చేసిన పొరపాట్లను , దీనిని చదివిన మీరు (పాఠకులు) నాకుచేసే సూచనలను తప్పక పాటిస్తానని మనవి చేసుకుంటున్నాను. “ కవితా కన్యకా గుణములు - కవికన్న రసజ్ణుడెరుగు , కవియేమెరుగున్ “ అన్నట్లుగా , నేనువ్రాసిన తప్పులు నాకు తెలియవు. రసజ్ఞులైన మీరు నాకు తెలియజేయ వలసినదిగా ప్రార్ధన. స్వామిశరణం .
మీ
బుధజన విధేయుడు
పూర్ణా పుష్కళాంబా సమేత శ్రీధర్మశాస్తా
హరిహరసుత అయ్యప్ప సేవార్ధి
వోరుగంటి నాగభూషణం గురుస్వామి.
మెయిన్ రోడ్ గరిడేపల్లి , పోస్ఠ్ &మం . గరిడేపల్లి
జిల్లా నల్లగొండ . Pin.No.508 201
సెల్. 9966518098     










ఓం స్వామియే శరణమయ్యప్ప
అయ్యప్ప నిత్య (సాధారణ)లఘుపూజ.


ధ్యానం : -  ఓం శుక్లాంబర ధరం విష్ణుం - శశి వర్ణం చతుర్భుజం
                   పసన్న వదనం ధ్యాయేత్ - సర్వ విఘ్నోపశాంతయే ॥


దీప ప్రజ్వలనం  - ఓం దీపం జ్యోతి పరబ్రహ్మం - దీపం కురు తమోపహం
                            దీపేన సాధ్యతే సర్వం - సదా (సంధ్యా) దీపం నమోస్తుతే  ॥


సాంబ్రాణి కడ్డీలు వెలిగించుట : - ఓం ఫాలనేత్ర సుతం దేవం - కలిదోష నివారణం
                                              బాలరూపం లోకనాధం - నమామి శబరీశ్వరం ॥


హస్త ప్రక్ష్యాళయ ( చేతులు కడుగు కొనాలి )
ఆచమ్యః  (ఆచమనము చేయాలి. కేశవనామాలు పఠించాలి)
ఓం కేశవాయ స్వాహాః , ఓం నారాయణాయ స్వాహాః , ఓం మాధవాయ స్వాహాః , ఓం గోవిందాయ నమః , ఓం  విష్ణవే నమః , ఓం మధుసూదనాయ నమః , ఓం త్రివిక్రమాయ నమః , ఓం వామనాయ నమః , ఓం శ్రీధరాయ నమః , ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః ,ఓం దామోదరాయ నమః , ఓం సంకర్షణాయ నమః , ఓం వాసుదేవాయ నమః , ఓం  ప్రద్యుమ్నాయ నమః , ఓం అనురుద్దాయ నమః , ఓం  పురుషోత్తమాయ నమః , ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం  అచ్యుతాయ నమః , ఓం జనార్ధనాయ నమః , ఓం  ఉపేంద్రాయ నమః , ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః  ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.


సంకల్పం.
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా , శ్రీ పరమేశ్వర ముద్దిశ్య , పరమేశ్వర ప్రీత్యర్ధం , శ్రీ హరిహరసుత అయ్యప్ప  ప్రీత్యర్ధం , శ్రీ పూర్ణా పుష్కలాంబా సమేత శ్రీ ధర్మశాస్తా  ప్రీత్యర్ధం , శుభ శోభన ముహూర్తే ఆధ్య బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే , శ్వేత వరాహ కల్పే, వైవస్వత మన్వంతరే , కలియుగే ,  ప్రధమ పాదే , జంబూ ద్వీపే , భరత వర్షే , భరత ఖండే , మేరోర్దక్షిణ దిగ్భాగే , శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే , కృష్ణ కావేర్యో మధ్యప్రదేశే ,స్వగృహే , లక్ష్మీ నివాస గృహే ,హరిహర గురు చరణ సన్నిధౌ , అస్మిన్ వర్తమానేన షష్ట్యబ్ధ్యాం మధ్యే , వ్యావహారిక చాంద్రమానేన ......... నామ సంవత్సరే , ........ ఆయనే , ....... ఋతౌ  , ........ మాసే , ........ పక్షే , ....... తిధౌ , ........ వాసరే , శుభ యోగే , శుభ కరణే , ఏవంగుణ విశేషణ , విశిష్ట యాం , శుభ తిధౌ , అస్య యజమానస్య ( ఇచ్చట పూజ చేసేవారి లేక పూజ చేయించు కొనే వారి గోత్ర నామాదులు చెప్పాలి)........ గోత్రోద్భవస్య ....... నామధేయస్య , ధర్మపత్ని ...... నామ్నీం సమేతస్య ,అస్మాకం సహా కుటుంబానాం , సహా బంధూనాం క్షేమ , స్థైర్య , ధైర్య , వీర్య , విజయ , అభయ , ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం , ధర్మ అర్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిధ్యర్ధం , మనో వాంఛా ఫల సిధ్యర్ధం , అయ్యప్పస్వామి కరుణా కటాక్ష సిధ్యర్ధం ( ఇంకను మనము చేసే పనిని బట్టి మన కోరికలు స్వామికి నివేదించుకొన వచ్చును ).  యధా ధ్యాన ఆవాహనాది షోడషోప చార పూజాం కరిష్యే ( అవసరాన్ని బట్టి మనము ఇంకను ఏమేమి పూజలు చేయ దలచు కున్నామో చెప్పవచ్చును). తదాధౌ మహా గణపతి పూజాం కరిష్యే .


గణపతి స్తోత్రం .
ఓం శుక్లాంబర ధరం విష్ణుం - శశివర్ణం చతుర్భుజం
    ప్రసన్న వదనం ధ్యాయేత్ - సర్వ విఘ్నోప శాంతయే ॥


     అగజానాన పద్మార్కం - గజానన మహర్నిశం
     అనేక దం తం భక్తానాం - ఏక దంత ముపాస్మహే ॥


     గజాననం భూత గణాధి సేవితం - కపిథ్దం జంబూఫల సారబక్షణం
      ఉమాసుతం శోకవినాశ కారణం - నమామి విఘ్నేశ్వర పాద పంకజం ॥


ఓం సుముకశ్చైక దంతస్య - కపిలో గజకర్ణికః ।
    లంబోరశ్చ వికటో - విఘ్నరాజో గణాధిపః ।
    ధూమకేతు ర్గణాద్యక్షో - ఫాల చంద్రో గజాననః।
    వక్రతుండ శుర్పకర్ణ - హేరంభ స్కంద పూర్వజః ॥


సుబ్రమణ్య స్తోత్రం.
ఓం శక్తిహస్తం విరూపాక్షం - శిఖివాహన షడాననం
     తారుణం రిపు రోగఘ్నం - భావయే కుక్కుట ధ్వజం ॥


ఓం గాంగేయం వహ్నిగర్భం - శరవణ జనితం , జ్ఞాన శక్తిం కుమారం
    బ్రహ్మణ్యం స్కందదేవం  గుహ - మమలగుణ యతిం , రుద్రతేజ స్వరూపం
    సేనాన్యం తారకఘ్న గురు - మచల యతిం , కార్తికేయం షడాననం
    సుబ్రణ్యం   మయూర ధ్వజ - రధ సహితం దేవ దేవం నమామి ॥


శ్రీ కృష్ణ స్తోత్రం తేజ
ఓం వసుదేవ సుతం దేవం - కంస చాణూర మర్ధనం
        దేవకీ పరమానందం - కృష్ణం వందే జగద్గురుం ॥


సాయిబాబా స్తోత్రం
ఓం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ - సుధా త్రావిణం త్రిక్త్య మవ్య ప్రియంతం
      తరుం కల్పవృక్షాధికం  సాధయంతాం  - నమామీశ్వరం సద్గురుం సాయినాధం ॥


లక్ష్మీకుభేర స్తోత్రం
ఓం రాజాధి రాజయ ప్రసహ్య సాహినే - నమో వయం వైశ్రవణాయ కుర్మహే
   సమే  కామాన్ కామకామాయ మహ్యం - కామేశ్వరో వైశ్రవణో తదాతు
   కుభేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః ॥  


శివ స్తోత్రం
ఓం వందే శంబు ముమాపతిం - సురగురుం వందే జగత్కారణం
   వందే పన్నగ భూషణం మృగధరం - వందే పశూణాం పతిం
   వందే సూర్య శశాంక వహ్ని నయనం - వందే ముకుందప్రియాం
   వందే భక్త జనాశ్రయంచ వరదం - వందే శివం శంకరం॥


దేవీ స్తోత్రం
ఓం సర్వ మంగళ మాంగల్యే - శివే సర్వార్ధ సాధకే
    శరణ్యే త్ర్యంబకీ దేవీ - నారాయణి నమోస్తుతే॥


విష్ణు స్తోత్రం
ఓం శాంతాకారం భుజగ శయనం - పద్మనాభం సురేశం
   విశ్వాకారం గగన సదృశం - మేఘవర్ణం శుభాంగం
   లక్ష్మీకాంతం కమల నయనం - యోగిహృధ్యాన గమ్యం
   వందే విష్ణుం భవభయ హరం - సర్వలోకైక నాధం ॥


లక్ష్మీదేవి స్తోత్రం
ఓం లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం - శ్రీరంగ ధామేశ్వరీం
    దాసీభూత సమస్త దేవ వనితాం - లోకైక దీపాంకురాం ।


   శ్రీమన్మంద కటాక్ష లబ్ధవిభవాం - బ్రహ్మేంద్ర గంగాధరం
   త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం - వందే ముకుంద ప్రియాం ॥


శ్రీరామ స్తోత్రం
ఓం శ్రీరాఘవం దశరధాత్మజ మప్రమేయం - సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
   ఆజాను భాహుం అరవింద దళాయతాక్షం - రామం నిశాచర వినాశకరం నమామి॥


ఆంజనేయ స్తోత్రం
ఓం మనోజవం మారుతతుల్య వేగం - జితేంద్రియం బుద్దిమతాం పరిష్థం
     వాతాత్మజం వానరయూధ ముఖ్యం - శ్రీరామ దూతం శిరసా నమామి॥


నవగ్రహ స్తోత్రం
ఓం ఆదిత్యాయ చ సోమాయ  - మంగళాయ బుధాయచ
    గురు శుక్ర శనిబ్యశ్చ - రాహువే కేతువే నమః॥


సరస్వతి స్తోత్రం
ఓం యాకుందేందు తుశారహార వదనా - యాశుభ్ర వస్త్రాన్వితా
    యా వీణా వర మండిత కరా - యాశ్వేత పద్మాసనా
    యా బ్రహ్మాచ్యుత శంకర - ప్రభృతి సదా పూజితా
    సామంపాతు సరస్వతీ భగవతీ - పూర్ణేందు బింబాననా॥


గురు వందనం
ఓం గురుః బ్రహ్మ గురుర్విష్ణు - గురుదేవో మహేశ్వరః
    గురు సాక్షాత్ పరబ్రహ్మ - తస్మై శ్రీగురవే నమః ॥


    అజ్ఞాన తిమిరాంధస్య - జ్ణానాంజన శలాకయా
   చక్షుర్మీలితం యేన - తస్మై శ్రీ గురవే నమః॥


( చంద్రమౌళి గురుస్వామినే (గురు దేవేభ్యో ) నమః ). ఇచ్చట ఎవరి గురువుగారి పేరు వారు చెప్పు కుంటారు.


అయ్యప్ప పూజ
ధ్యానం .    ఓం అఖిల భువన దీపం , భక్త చిత్తాబ్జ సూనం
                   సురగణ ముని సేవ్యం , తత్వమస్యాది లక్ష్యం
                   హరిహర సుతమీశం , తారక బ్రహ్మరూపం
                   శబరిగిరి నివాసం భావయే భూతనాధం॥


ఆవాహనం . శ్లో॥ అగచ్చన్ భగవన్ దేవ - స్థానేచాత్ర స్థిరోభవ
                      యావత్పూజాం కరిష్యేహం - స్థావత్వం సన్నిధిం వస ॥


ఆసనం.     శ్లో॥ నానావర్ణ సమాయుక్తాన్ - పుష్ప గంధైశ్చ భూషితం
                     ఆసనం దేవదేవేశ - ప్రీత్యర్ధం ప్రతి గృహ్యతాం॥


పాద్యం.     శ్లో॥ భూతనాధ నమస్తేస్తు - నరకార్ణవ తారక
                    పాద్యం గృహాణ దేవేశ - మమ సౌఖ్యం వివర్ధయ॥


అర్ఘ్యం .    శ్లో॥ వ్యక్తావ్యక్త స్వరూపాయ - హృశీకేశాయతే నమః
                   మయా నివేదితో భక్త్యా - అర్ఘ్యోయం ప్రతిగృహ్యతాం ॥


ఆచమనీయయం. శ్లో॥ మందాకినీ సమం వారి - తాప పాపహరం శుభం
                              దధినం కల్పితం దేవ - సమ్యకాశ ద్వుతాం త్వయా॥


స్నానం (స్నాపనము). శ్లో॥ ఓం గంగైచ యమునై చైవ - కృష్ణా గోదావరీ సరస్వతి
                                          నర్మదా సింధు కావేరీ - జలేస్మిన్ సన్నిధిం కురు॥
                                           సర్వే సముద్రా సరితా - తీర్ధానిచ నదా  హ్రదా
                                          `ఆయాంతు దేవ పూజార్ధం - మమ దురిత క్షయ కారక॥
                                           నానానదీ సమానీతం - సువర్ణ కలశ స్థితం
                                           శుద్దోదకేన సుస్నానం - కర్తవ్యం హరి నందన॥


వస్త్రం .      శ్లో॥ వేదసూక్త  సమాయుక్తం - యజ్ఞసామ సమన్వితం
                   సర్వవర్ణ ప్రదేదేవ -  వాసాంసి ప్రతి గృహ్యతాం॥


యజ్ణోపవీతం.  శ్లో॥ బ్రహ్మ విష్ణు మహేశైశ్చ - నిర్మితం బ్రహ్మసూత్రకం
                         గృహాణ సర్వ వరద - ధర్మశాస్తా నమోస్తుతే॥


గంధం (చందనం). శ్లో॥ శ్రీగంధ చందనం దివ్యం - గంధాద్యం సుమనోహరం
                             విలేపన సురశ్రేష్థ - చందనం ప్రతి గృహ్యతాం॥


కుంకుమ.  శ్లో॥ హరిద్రా చూర్ణ సమాయుక్తం - కుంకుమం క్షేమదాయకం
                    నానా పరిమళం దివ్యం - గృహాణ గుణభూషణ ॥


అక్షతలు . శ్లో॥ అక్షతాన్ తండులాన్ శుబ్రాన్ - కుంకుమేన విరాజితం
                   హరిద్రాచూర్ణ సమ్యుక్తాం - గృహాణ మరవందిత॥


పుష్పాణి ( పుష్పములు). శ్లో॥ మల్లికాని సుగంధీని - మాలత్యాదీనివై ప్రభో
                                        మయా హృతాని పూజార్ధం - పుష్పాణి ప్రతి గృహ్యతాం॥


పుష్పమాల .  శ్లో॥ జాజీ  చంపక పున్నాగ - మల్లికా మాలతీ కృతాం
                         పుష్పమాలా సుగందాధ్యాం - గృహత్వాలం కురుప్రభో॥


                                                                 అయ్యప్పస్వామి అంగపూజ


ఓం శ్రీ పంపా బాలయ నమః - పాదౌ పూజయామి
ఓం గుహ్యాతి గుహ్య గోప్త్రే నమః - గుల్ఫం పూజయామి
ఓం అంకుశ ధరాయ నమః - ఝంగే పూజయామి
ఓం జగన్మోహనాయ నమః - జానునీ పూజయామి
ఓం ఉద్దాన వైభవాయ నమః - ఊరూ పూజయామి
ఓం ఖండేందు మౌళి తనయాయ నమః - కటిం పూజయామి
ఓం హరిహర పుత్రాయ నమః - గుహ్యం పూజయామి
ఓం దక్షిణామూర్తి రూపకాయ నమః - నాభిం పూజయామి
ఓం వరదాన కీర్తయే నమః - ఉదరం పూజయామి
ఓం త్రిలోక రక్షకాయ నమః - వక్ష స్థలం పూజయామి
ఓం మణిపూరాబ్జ నిలయాయ నమః - పార్శౌ పూజయామి
ఓం పాశహస్తాయ నమః - హస్తాన్ పూజయామి
ఓం మంత్ర రూపాయ నమః - హృదయం పూజయామి
ఓం  వజ్రమాల ధరాయ నమః - కంఠం పూజయామి
ఓం సూర్యకోటి సమప్రభాయ నమః - ముఖం పూజయామి
ఓం గ్రామ పాలకాయ నమః - కపోలౌ పూజయామి
ఓం తీక్ష్ణ దంతాయ నమః - దంతాన్ పూజయామి
ఓం కారుణ్యామృత లోచనాయ నమః - నేత్రే పూజయామి
ఓం రత్నకుండల దారినే నమః - కర్ణౌ పూజయామి
ఓం లాస్య ప్రియాయ నమః - లలాటం పూజయామి
ఓం శివప్రియాయ నమః - శిరః పూజయామి
ఓం జటామకుట ధారిణే  నమః అలాకాన్  పూజయామి
ఓం హరిహర పుత్ర స్వరూప  ధర్మశాస్త్రే నమః సర్వాంగ పూజన్ సమర్పయామి


                                         గురూపదేశ మంత్రము
(ప్రతిరోజు గురూపదేశ మంత్రమును 108 లేక కనీసం 18 సార్లైనా జపించాలి108 సార్లైతే శ్రేష్థం )


శరణు ఘోష  
ఓం స్వామియే శరణమయ్యప్ప
ఓం హరిహరసుతనే శరణమయ్యప్ప
ఓం ఆపద్భాంధవనే  శరణమయ్యప్ప
ఓం అనాధ రక్షకనే  శరణమయ్యప్ప
ఓం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప
ఓం అన్నదాన ప్రభువే  శరణమయ్యప్ప
ఓం అయ్యప్పనే  శరణమయ్యప్ప
ఓం ఆర్యంగావు అయ్యవే  శరణమయ్యప్ప
ఓం అచ్చన్ కోవెల్ అరసే  శరణమయ్యప్ప
ఓం కుళుత్తుపుళ బాలకనే శరణమయ్యప్ప                - 10 -
ఓం ఎరుమేలి ధర్మశాస్తావే  శరణమయ్యప్ప
ఓం వావర్ స్వామియే  శరణమయ్యప్ప
ఓం కన్నిమూల గణపతి భగవానే  శరణమయ్యప్ప
ఓం నాగరాజావే  శరణమయ్యప్ప
ఓం మాలిగాపురోత్తమ లోక మంజుమాతావే  శరణమయ్యప్ప
ఓం కరుప్ప స్వామియే  శరణమయ్యప్ప
ఓం సేవిప్పర్ కానందమూర్తయే  శరణమయ్యప్ప
ఓం కాశీ వాసియే  శరణమయ్యప్ప
ఓం హరిద్వార్ నివాసియే  శరణమయ్యప్ప
ఓం శ్రీరంగపట్టణ వాసియే   శరణమయ్యప్ప           - 20 -
ఓం కరపత్తూర్ వాసియే  శరణమయ్యప్ప
ఓం గరిడేపల్లి ధర్మశాస్తావే  శరణమయ్యప్ప
ఓం సద్గురు నాధనే  శరణమయ్యప్ప
ఓం విల్లాడి వీరనే  శరణమయ్యప్ప
ఓం వీరమణి కంఠనే  శరణమయ్యప్ప
ఓం ధర్మశాస్తావే  శరణమయ్యప్ప
ఓం కాంతిమల వాసయే  శరణమయ్యప్ప
ఓం పొన్నంబల వాసనే  శరణమయ్యప్ప
ఓం శరణఘోష ప్రియనే  శరణమయ్యప్ప
ఓం పంబాశిశువే  శరణమయ్యప్ప                    - 30 -
ఓం పందళ రాజకుమారనే  శరణమయ్యప్ప
ఓం వావరిన్ తోళునే  శరణమయ్యప్ప
ఓం మోహినీ సుతనే  శరణమయ్యప్ప
ఓం కళ్కండ దైవమే  శరణమయ్యప్ప
ఓం కలియుగ వరదనే  శరణమయ్యప్ప
ఓం సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తయే  శరణమయ్యప్ప
ఓం మహిషి మర్ధననే  శరణమయ్యప్ప
ఓం పూర్ణపుష్కళ నాదనే  శరణమయ్యప్ప
ఓం వన్ పులి వాహననే  శరణమయ్యప్ప
ఓం భక్త వత్సలనే శరణమయ్యప్ప                  - 40 -
ఓం భూలోక నాధనే - శరణ మయ్యప్ప
ఓం అయిందు మలైవాసనే - శరణమయ్యప్ప
ఓం శబరి గిరీశనే - శరణమయ్యప్ప
ఓం యిరుముడి ప్రియనే - శరణమయ్యప్ప
ఓం అభిషేక ప్రియనే - శరణమయ్యప్ప
ఓం వేద ప్పొరుళే - శరణమయ్యప్ప
ఓం శుద్ధ బ్రహ్మ చారియే - శరణమయ్యప్ప
ఓం సర్వ మంగళ  దాయకనే - శరణమయ్యప్ప
ఓం వీరాధి వీరనే - శరణమయ్యప్ప
ఓం ఓంకార ప్పొరుళే - శరణమయ్యప్ప                              - 50 -
ఓం ఆనంద రూపనే - శరణమయ్యప్ప
ఓం భక్త చిత్తాధి వాసనే - శరణమయ్యప్ప
ఓం ఆశ్రిత వత్సలనే - శరణమయ్యప్ప
ఓం భూత గణాధి పతయే - శరణమయ్యప్ప
ఓం శక్తి రూపనే - శరణమయ్యప్ప
ఓం శాంత మూర్తియే - శరణమయ్యప్ప
ఓం పదునెట్టాంబడిక్కి అధిపతియే - శరణమయ్యప్ప
ఓం ఉత్తమ పురుషనే - శరణమయ్యప్ప
ఓం రుషికుల రక్షకనే - శరణమయ్యప్ప
ఓం వేద ప్రియనే - శరణమయ్యప్ప                                   - 60 -
ఓం  ఉత్తరా నక్షత్ర జాతకనే - శరణమయ్యప్ప
ఓం  తపోధననే - శరణమయ్యప్ప
ఓం ఎంగళ్ కుల దైవమే  - శరణమయ్యప్ప
ఓం జగన్మోహననే - శరణమయ్యప్ప
ఓం మోహన రూపననే - శరణమయ్యప్ప
ఓం మాధవ సుతనే - శరణమయ్యప్ప
ఓం  యదుకుల వీరనే - శరణమయ్యప్ప
ఓం మామలై వాసనే  - శరణమయ్యప్ప
ఓం షణ్ముఖ సోదరనే - శరణమయ్యప్ప
ఓం వేదాంత రూపనే - శరణమయ్యప్ప.                          - 70 -
ఓం శంకర సుతనే - శరణమయ్యప్ప
ఓం శతృ సంహారనే - శరణమయ్యప్ప
ఓం సద్గుణ మూర్తయే - శరణమయ్యప్ప
ఓం పరా శక్తియే - శరణమయ్యప్ప
ఓం పరాత్పరనే - శరణమయ్యప్ప
ఓం పరంజ్యోతియే - శరణమయ్యప్ప
ఓం హోమ ప్రియనే - శరణమయ్యప్ప
ఓం గణపతి సోదరనే - శరణమయ్యప్ప
ఓం రక్త విలోచనే - శరణమయ్యప్ప
ఓం విష్ణు సుతనే - శరణమయ్యప్ప                                   - 80 -
ఓం సకల కళా వల్లభనే - శరణమయ్యప్ప
ఓం లోక రక్షకనే - శరణమయ్యప్ప
ఓం అమిత గుణాకరనే - శరణమయ్యప్ప
ఓం అలంకార ప్రియనే - శరణమయ్యప్ప
ఓం కన్నిమారై కార్పణ్యనే - శరణమయ్యప్ప
ఓం భువనేశ్వరనే - శరణమయ్యప్ప
ఓం మాతా పిత గురు దైవమే - శరణమయ్యప్ప
ఓం స్వామియున్ పుంగావనమే - శరణమయ్యప్ప
ఓం అళుదా నదియే - శరణమయ్యప్ప
ఓం అళుదా మేడే - శరణమయ్యప్ప                                     - 90 -
ఓం కళ్లిడుం కుండ్రమే - శరణమయ్యప్ప
ఓం కరిమలై ఏట్రమే - శరణమయ్యప్ప
ఓం కరిమలై ఇరక్కమే - శరణమయ్యప్ప
ఓం పెరియాన వట్టమే - శరణమయ్యప్ప
ఓం సిరియాన వట్టమే - శరణమయ్యప్ప
ఓం పంబా నదియే - శరణమయ్యప్ప
ఓం పంబయిల్ విళక్కే - శరణమయ్యప్ప
ఓం నీలిమలై ఏట్రమే - శరణమయ్యప్ప
ఓం అప్పాచి మేడే - శరణమయ్యప్ప
ఓం శబరి పీఠమే - శరణమయ్యప్ప                                       - 100 -
ఓం శరంగుత్తి ఆలే - శరణమయ్యప్ప
ఓం భస్మక్కుళమే - శరణమయ్యప్ప
ఓం పదునెట్టాం బడియే - శరణమయ్యప్ప
ఓం నెయ్యభిషేక ప్రియనే - శరణమయ్యప్ప
ఓం కర్పూర జ్యోతియే - శరణమయ్యప్ప
ఓం జ్యోతి స్వరూపనే - శరణమయ్యప్ప
ఓం మకర జ్యోతియే - శరణమయ్యప్ప
ఓం హరిహర సుతన్ ,ఆనంద చిత్తన్ , అయ్యనయ్యప్ప  స్వామియే . . . . . . శరణమయ్యప్ప   - 108 -


ధూపం. శ్లో॥ దశాంగం గుగ్గులోపేతం - సుగంధిం సుమనోహరం
                హరిహరసుత నమస్తుభ్యం - గృహాణ వరధో  భవ॥


దీపం.   శ్లో॥ దీపం గృహాణ దేవేశ - ఘృతవర్తి సమన్వితం
               జ్ఞాన రూపాయ నిత్యాయ - నిర్మలాయ నమోస్థుతే॥


నైవేద్యం. శ్లో॥ ఓం భూర్భువః సువః - తత్స వితుర్వరేణ్యం
                 భర్గో దేవస్య ధీమహి - ధీయో యోన ప్రచోదయాత్॥
ఆపోజ్యోతి రసోమృతం (పదార్దములపై నీటిని చిలకరిస్తూ)దేవ సవిత ప్రసువ , (పగలైతే)సత్యన్ - త్వర్తేన పరిషించామి , (రాత్రైతే) ఋతంత్వా సత్యేన పరిషించామి , అమృతమస్తు ,అమృతోపరణమసి స్వాహాః ॥
ఓం ప్రాణాయ స్వాహాః ,ఓం అపానాయ స్వాహాః , ఓం వ్యానాయ స్వాహాః , ఓం ఉదానాయ స్వాహాః ఓం సమానాయ స్వాహాః, ఓం బ్రహ్మణే స్వాహాః , ఓం బ్రాహ్మణిమ ఆత్మామృతత్వాయ మధ్యే మధ్యే అమృత తుల్య పానీయం సమర్పయామి. ఉత్తరా పోషనం సమర్పయామి, హస్త  ప్రక్ష్యాళయామి, పాద ప్రక్ష్యాళయామి , తాంబూలం సమర్పయామి .


తాంబూలం .శ్లో॥ ఓం పూగీఫల సమాయుక్తం - నాగవల్లీ దళైర్యుతం
                           ముక్తాచూర్ణ సమ్యుక్తాన్ - తాంబూలం ప్రతి గృహ్యతాం ॥


కర్పూర నీరాజనం. శ్లో॥ ఓం యఃజ్యోతి సర్వలోకానాం - తేజసాం తేజముత్తమం
                                    ఆత్మజ్యోతి పరంధామ - నీరాజన మిదం ప్రభో॥


(మంగళ)హారతి . ( మంగళహారతి ఎవరికి వచ్చిన లేక ఎవరికి నచ్చిన పాటలు వారు పాడుతారు)
              శ్లో|| పంచాంద్రీశ్వరి మంగళం - హరిహర ప్రేమాకృతే మంగళం
                  ఫించాలంకృత మంగళం - ప్రణమతాం  చింతార్మణే మంగళం
                   పంచాస్యా ధ్వజ మంగళం - త్రిజగత మాద్యాప్రభో మంగళం
                  పంచా స్త్రోపమ మంగళం - శృతి శిరోలంకార సన్మంగళం


మంత్ర పుష్పం . ( పుష్పాంజలి).
ఓం రాజాధి రాజయ ప్రసహ్య సాహినే - నమో వయం - వై - శ్రవణాయ కుర్మహే
సమే  కామకామాయ మహ్యం - కామేశ్వరో -వై - శ్రవణో దదాతు
కుభేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః ॥


ఓం తత్పురుషాయ విద్మహే , వక్రతుండాయ ధీమహిః - తన్నోదంతి ప్రచోదయాత్
ఓం తత్పురుషాయ విద్మహే , మహా సేనాన్యే ధీమహిః - తన్నో షణ్ముఖ ప్రచోదయాత్
ఓం నారాయణాయ విద్మహే , వాసుదేవాయ ధీమహిః - తన్నో విష్ణు ప్రచోదయాత్
ఓం తత్పురుషాయ విద్మహే , మహాదేవాయ ధీమహిః - తన్నో రుద్ర ప్రచోదయాత్
ఓం భూతనాధయ విద్మహే , భవపుత్రాయ ధీమహిః - తన్నో శాస్తా ప్రచోదయాత్ ॥


ఆత్మ ప్రదక్షణ . ఓం యానికానిచ పాపాని , జన్మాంతర కృతానిచ
                         తానెతానె ప్రణశ్యంతి , ప్రదక్షణం పదేపదే
                         పాపోహం పాపకర్మాహం , పాపాత్మా పాప సంభవ
                         త్రాహిమాం కృపయాదేవ , శరణాగత వత్సల
                        అన్యధా శరణం నాస్తి , త్వమేవ శరణం మమ
                        తస్మాత్ కారుణ్య భావేన , రక్ష రక్ష మహేశ్వరా॥


క్షమాపణ .       ఆవాహనం నజానామి - న జామి విసర్జనం
                     పూజావిధం నజానామి - క్షమస్వ పురుషోత్తమ
                    మంత్ర హీనం క్రియా హీనం - భక్తిహీనం శబరీశ్వర
                    యత్పూజితం మయా దేవం , పరిపూర్ణం తదస్తుమే ॥


ప్రార్ధన ( వేడుకొనుట )
                మన్మయా భక్తి  యుక్తేన - పత్రం పుష్పం ఫలం జలం
                నివేదితం చ నైవేద్యం - తద్ గృహాణ మమ కంబయా ॥
               రూపం దేహి , జయందేహి - యశోదేహి ద్వివోజహి
               ఈప్సితం మే వరం దేహి - పరధర్మ పరాంగతిం ॥
               పుత్రాన్ దేహి , ధనం  దేహి - సర్వాన్ కామాంశ్చ దేహిమే
               దేహి శాంతి మవిశ్చిన్నాం - సర్వ తత్వార్ధ దర్శనం ॥
               గతం పాపం , గతం దుఖఃం - గతం దారిద్ర్య మేవచ
                ఆగదా సుఖః ,సంపత్తి - అమోహాత్ తవ దర్శనం ॥


అనయా పూజయా శ్రీ హరిహరపుత్ర స్వరూప ధర్మశాస్తా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు.
                                                                                                              ఓం ఏతత్సర్వం బ్రహ్మార్పణ మస్తు.
అనయా ధ్యాన ఆవాహనాది షోడషోపచార పూజయా భగవాన్ సర్వాత్మక శ్రీ అయ్యప్పస్వామి
                                                                                                             సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు.
ఓం స్వామియే  …. ....... శరణమయ్యప్ప . అయ్యప్ప నిత్య సాధారణ లఘుపూజ సంపూర్ణం.


ఓం స్వామియే శరణమయ్యప్ప
నిత్య సాధారణ లఘుపూజ అర్ధ తాత్పర్య సహితము.


ధ్యానం : -  ఓం శుక్లాంబర ధరం విష్ణుం - శశి వర్ణం చతుర్భుజం
                   పసన్న వదనం ధ్యాయేత్ - సర్వ విఘ్నోపశాంతయే ॥


దీప ప్రజ్వలనం  - ఓం దీపం జ్యోతి పరబ్రహ్మం - దీపం కురు తమోపహం
                            దీపేన సాధ్యతే సర్వం - సదా (సంధ్యా) దీపం నమోస్తుతే  ॥


తాత్పర్యము : - పరబ్రహ్మ స్వరూపమైన ( జ్ఞాన) జ్యోతికి ప్రతిరూపమై నట్టిదియు తన కాంతిచే చీకటి ( జ్ఞానపు              
                     వెలుగులో అజ్ఞానమును) పోగోట్టునదియు , తన వెలుగులో అన్ని పనులు చేసుకొనుటకు
                   ( జ్ఞానముచే సమస్తము సాధించు కొనుటకు ) ఉపకరించు నట్టిదియు ఇనటువంటి ( ఉదయ, సంధ్య )                
                   దీపము నకు నేను ఎల్లపుడు నమస్కరించు చున్నాను.


సాంబ్రాణి కడ్డీలు వెలిగించుట : - ఓం ఫాలనేత్ర సుతం దేవం - కలిదోష నివారణం
                                              బాలరూపం లోకనాధం - నమామి శబరీశ్వరం ॥


తాత్పర్యము : - నొసట కంటివాని (ముక్కంటి) కుమారుడు, కలికాల దోషములను పోగొట్టువాడు, బాల రూపము
                    లోకములను పాలించు వాడు , శబరి గిరీశుడైన అయ్యప్పస్వామికి నేను నమస్కరించు చున్నాను .


హస్త ప్రక్ష్యాళయ ( చేతులు కడుగు కొనాలి )
ఆచమ్యః  (ఆచమనము చేయాలి. కేశవనామాలు పఠించాలి)


ఓం కేశవాయ స్వాహాః -  కేశవాయ = శ్రీకృష్ణా వతారమున కేసి యను రాక్షసుని ( గుఱ్ఱమును ) సంహరించిన వాడైన
                                కేశవునకు నమస్కారము
ఓం నారాయణాయ స్వాహాః - నారము=నీరు ,నారాయణ = నీటిచే ఆవరించ బడిన వాడు. నీటి ( సముద్రము) మధ్యలో
                                      నున్న(విష్ణుమూర్తి)నారాయణునకు నమస్కారము .
ఓం మాధవాయ స్వాహాః - మా = తల్లి (లోకమాత లక్ష్మీదేవి), ధవ = భర్త , మాధవ = లక్ష్మీదేవికి భర్త యైన
                                 (విష్ణుమూర్తి) మాధవునకు నమస్కారము .
ఓం గోవిందాయ నమః - గోవిందాయ = గోవులను (గోవు ధర్మదేవత స్వరూపము కనుక ధర్మమును) కాపాడు వాడైన
                              గోవిందునకు నమస్కారము .
ఓం  విష్ణవే నమః - విష్ణవే నమః = విశ్వమంతట వ్యాపించిన వాడైన , విష్ణువునకు నమస్కారము.
ఓం మధుసూదనాయ నమః - మధుసూదన = మధు అను రాక్షసుని ( మధు కైటభులను ) సంహరించిన వాడైన
                                      మదుసూదను నకు నమస్కారము.
ఓం త్రివిక్రమాయ నమః - త్రివిక్రమాయ= ముల్లోకములను ఆక్రమించిన వాడైన (బలి చక్రవర్తికి విష్ణుమూర్తి చూపిన
                                విశ్వరూపము) త్రివిక్రమునకు నమస్కారము .
ఓం వామనాయ నమః - వామన = పొట్టివాడు , (బలి చక్రవర్తిని అణచుటకు బ్రాహ్మణ వటువుగా వచ్చిన రూపము)అట్టి
                               వామనునకు నమస్కారము .
ఓం శ్రీధరాయ నమః - శ్రీ = లక్ష్మీదేవి, ధరాయ = ధరించిన వాడు (భర్త), లక్ష్మీదేవిని వక్షస్థలమున ధరించిన వాడైన
                            శ్రీధరునకు నమస్కారము .
ఓం హృషీకేశాయ నమః - హృషీకేశాయ = హృషీక +ఈశాయ, హృషీకములు = ఇంద్రియములు (జ్ఞానేంద్రియములు,
                                కర్మేంద్రియములు), ఈశాయ = అధిపతి యైనవాడు, ఇంద్రియములను జయించిన వాడైన
                                (జితేంద్రియుడు), హృషీకేశునకు నమస్కారము
ఓం పద్మనాభాయ నమః - పద్మనాభాయ = బ్రహ్మదేవునకు జన్మ స్థానమైన కమలము (పద్మము)ను నాభియందు
                                  కలవాడైన పద్మనాభు నకు నమస్కారము.
ఓం దామోదరాయ నమః - దామోదర = దామ+ఉదర = దామోదర, దామము =తులసి , ఉదరమున తులసి
                                  మాలను ( కలిగియున్నవాడు) ధరించిన వాడైన , దామములు = లోకములు , ఉదరుడు =
                                 పొట్ట యందు కలవాడు , సకల లోక ములు తనయందు ధరించిన వాడు . దామము =
                                 దారము లేక త్రాడు, యశోదాదేవిచే పొట్టకు ( ఉదరము నకు) త్రాడుచే కట్టబడిన వాడైన
                                దామోదరునకు నమస్కారము .
ఓం సంకర్షణాయ నమః - సంకర్షణ = ఆకర్షించు కొనువాడు, లాగుకొను వాడు, ప్రళయకారకుడు , ప్రళయము నందు
                                 సమస్తము తనలోనికి లాగుకొని కూడా తన రూపములో ఏమాత్రము మార్పు చెందనివాడైన
                                సంకర్షణు నకు నమస్కారము .
ఓం వాసుదేవాయ నమః - వాసుదేవాయ = వసుదేవుని  కుమారుడైన (కృష్ణు నకు ) వాసుదేవునకు నమస్కారము .
ఓం  ప్రద్యుమ్నాయ నమః - ప్రద్యుమ్నాయ = తేజో రూపుడైన (జ్యోతి స్వరూపుడైన) ప్రద్యుమ్నునకు నమస్కారము
ఓం అనురుద్దాయ నమః - అనురుద్దాయ = దేనిచే నైనను , ఎవరి చేతనైనను జయింప బడని వాడైన
                                  అనురుద్దునకు నమస్కారము.
ఓం  పురుషోత్తమాయ నమః - పురుషోత్తమాయ = పురుష +ఉత్తమ , పురుష = దేవతలు, ఉత్తమ = గొప్ప.
                                       దేవతలలో గొప్పవాడైన పురుషోత్తమునకు నమస్కారము.
ఓం అధోక్షజాయ నమః - అంతర్ముఖులు కాగా సాక్షాత్కరించువాడు . భూమ్యాకాశముల మధ్య విరాడ్రూపమున
                                వ్యాపించి యున్న వాడైన , అధోక్షజునకు నమస్కారము.
ఓం నారసింహాయ నమః - నారసింహాయ = నర+సింహ, అర్ధ భాగము నరరూపము అర్ధ భాగము సింహ ( మృగ)
                                  రూపము కలవాడైన , నరసింహునకు నమస్కారము.
ఓం  అచ్యుతాయ నమః - చ్యుతి = నశించునది, అచ్యుత = నాశనము లేనివాడైన అచ్యుతునకు నమస్కారము .
ఓం జనార్ధనాయ నమః - జనార్ధనాయ = జనులచేత మేలు కొరకు కోరబడువాడు.దుష్టులను శిక్షించువాడు, వారిని
                                నరక లోకమునకు పంపించు వాడైన జనార్ధనునకు నమస్కారము.
ఓం  ఉపేంద్రాయ నమః - ఉప+ఇంద్ర = ఉపేంద్ర , ఇంద్రునకు తమ్ముడైనవాడు. ఇంద్రునుకి పైన ఇంద్రుడైన
                                ఉపేంద్రునకు నమస్కారము.
ఓం హరయే నమః - హరయే = హరియైనటు వంటి , జనన మరణ రూపమైన సంసారమును హరించువాడు.
                          ప్రళయ కాలమున సర్వమును హరించు వాడైన మహా విష్ణువునకు నమస్కారము .
ఓం శ్రీకృష్ణాయ నమః  - శ్రీ కృష్ణాయ = సమస్తమును ఆకర్షించు వాడైన , నల్లని వాడైన శ్రీకృష్ణు నకు నమస్కారము.
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః - పరబ్రహ్మ స్వరూపుడైన  శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారము.


సంకల్పము.
సంకల్పము లేని పూజ అడ్రస్ లేని ఉత్తరం ( లెటర్) లాంటిదని నానుడి. సంకల్ప సహితంగా చేసే పూజకు ఫలితం
ఎక్కువగా వుంటుదని పెద్దల ఉవాచ. సంకల్పము ప్రణాలిక లాంటిది. మనము చేయబోయే పనికి ( పూజకు)
బయో - డేటా  లాంటిది. ఈపూజకు ( మనము చేయబోయే పూజకు ) బయో - డేటా. : - ఎందుకొరకు, ఎవరిని ఉద్దేశించి ఎవరి కొరకు , ఏ కాలమున , ఏ ప్రదేశమున , ఎవరి సమక్షమున , ఏ సమయమున , ఎవరు , ఎందుకు ,
ఏఏ పూజలు చేస్తున్నారు.
ఎందుకొరకు : - మమ ఉపాత్త సమస్త దురిత క్షయద్వారా = నా ( మా ) యొక్క సకల దోశములు ,పాపములు
                    నశించుట కొరకు   
ఎవరిని ఉద్దేశించి : - శ్రీ పరమేశ్వ ముద్దిశ్య = పరమేశ్వరుని ( భగవంతుని) ఉద్దేశించి.
ఎవరికొరకు : -  పరమేశ్వర ప్రీత్యర్ధం , హరిహరసుత అయ్యప్ప ప్రీత్యర్ధం , శ్రీ పూర్ణా పుష్కలాంబా సమేత శ్రీ ధర్మశాస్తా
                   ప్రీత్యర్ధం = భగవానుడైన , హరిహర పుత్రుడైన అయ్యప్ప , పూర్ణ పుష్కల దేవేరులతో కూడియున్న
                   శ్రీ ధర్మశాస్తా వారి కొరకు .
ఏ కాలమున : - శుభ శోభన ముహూర్తే , ఆధ్య బ్రహ్మణః ద్వితీయ పరార్దే , శ్వేత వరాహ కల్పే , వైవస్వత మన్వంతరే ,
                     కలియుగే ,ప్రధమ పాదే = * ( ఇది కాల మానము ) బ్రహ్మ దేవుని ఆయుష్షు ( వయస్సు ) లోని
                    రెండవ భాగమున , శ్వేత వరాహ కల్పము , వైవస్వత మన్వంతరము,  కలియుగము లోని
                    మొదటి పాదమున.
ఏ ప్రదేశమున : - జంబూ ద్వీపే , భారత వర్షే మ భరత ఖండే , మేరోర్దక్షిణ దిగ్భాగే , శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే , కృష్ణా
                      కావేర్యో మధ్య ప్రదేశే , స్వగృహే ,లక్ష్మీ నివాసగృహే.( పూజచేసే వారు ఏ ప్రదేశములో వున్నారో
                      దానిని బట్టి చెప్పుకోవాలి).
ఎవరి సమక్షమున : - హరి హర గురు చరణ సన్నిధౌ = హరి హరుల (శివ కేశవుల) మరియు గురువుల సమక్షమున.
ఏ సమయమున : -  అస్మిన్ వర్తమానేన షష్ట్యబ్ద్యాం మధ్యే , వ్యవహారీక చాంద్రమానేన - - - - - - నామ సంవత్సరే,  - -     
                       - - - ఆయనే , - - - - - - -  -ఋతౌ , - - - - - - - మాసే , - - - - - - -  -పక్షే , - - - - - - తిధౌ ,  - - -
                       - - -  -వాసరే శుభ యోగే ,శుభ కరణే , ఏవంగుణ విశేషణ విశిష్థాయాం , శుభ తిధౌ = ( పూజచేసే
                      సమయములో ప్రస్తుత కాలగమనములో ఉన్న ) తిధి,వార, పక్ష, మాస ,ఋతువు ,   అయన
                      ,సంవత్సరములతో కూడుకొని యున్నటు వంటి విశేషమైన , విశిష్టమైన ఈశుభదినమున.
ఎవరు : -  అస్య యజమానస్య - - - - గోత్రోభవస్య - - - -నామధేయస్య , ధర్మపత్ని - - - - - నామ్నీం , అస్మాకం  సహా
           కుటుంబానాం, సహా బంధూనాం  ( పూజ  చేయువారి, పూజ చేయించు కొను వారి గోత్ర నామాదులు చెప్పాలి.)
ఎందు కొరకు : -  క్షేమ , స్థైర్య , ధైర్య , వీర్య , విజయ , అభయ , ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం , ధర్మ అర్ధ కామ
                      మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిధ్యర్ధం , మనో వాంఛా ఫల సిధ్యర్ధం , అయ్యప్పస్వామి కరుణా కటాక్ష
                      సిధ్యర్ధం ( ఇంకను మనము చేసే పనిని బట్టి మన కోరికలు స్వామికి నివేదించుకొన వచ్చును ).
ఏఏ పూజలు చేస్తున్నారు. : -   యధా ధ్యాన ఆవాహనాది షోడషోప చార పూజాం కరిష్యే ( అవసరాన్ని బట్టి మనము
                                         ఇంకను ఏమేమి పూజలు చేయ దలచు కున్నామో చెప్పవచ్చును).


( ఆధ్య  బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే = బ్రహ్మదేవుని ఆయుష్షు (వయస్సు) లో సగభాగములోని రెండవ భాగమున)
                                      భారతీయ కాలమానము ( వివరణ)
4 నిమిషములు =1క్షణం , 24 నిముషములు = 1 ఘడియ , 48 నిమిషములు = 1 ముహూర్తము ,
3 ఘంటలు = 1యామము లేక ప్రహర లేక  ఝాము ,  4 ఝాములు = 1పగలు లేక 1రాత్రి , 1పగలు+1రాత్రి = 1అహో రాత్రము లేక 1దినము లేక 1రోజు .
ఉషః కాలము = సూర్యోదయము నకు 5ఘడియలు ముందైన కాలము.
                                                     ( సూర్యోదయము నకు 2 గంటలు  ముందు  కాలము)
అరుణోదయం = సూర్యోదయము నకు 3 ఘడియలు ముందైన కాలము.
                                                    ( సూర్యోదయము నకు 1 గంట 12 నిమిషములు  ముందు  కాలము)
ప్రాతః కాలము = సూర్యోదయము నకు 2 ఘడియలు ముందైన కాలము.
                                                    ( సూర్యోదయము నకు 48 నిమిషములు ముందు  కాలము)
ప్రాతః సంధ్య = సూర్యోదయము నుండి 3 ఘడియల కాలము వరకు .
                                                   ( సూర్యోదయము నుండి 1ఘంట 12 నిమిషముల కాలము.)
సాయం సంధ్య = సూర్యాస్తమయము నుండి 3 ఘడియల వరకు కాలము.
                                                   ( సూర్యాస్తమయము నుండి 1 ఘంట 12 నిమిషముల కాలము  వరకు. )
ప్రదోష కాలము = సూర్యాస్తమయము నుండి 6 ఘడియల వరకు కాలము.
                                                   ( సూర్యాస్తమయము నుండి 2 గంటల 24 నిమిషముల కాలము  వరకు. )
మహా నిశీదము = అర్ధరాత్రి 12 ఘంటల  నుండి 2 ఘడియల వరకు కాలము.
                                                 ( అర్ధరాత్రి 12 ఘంటల నుండి 1 ఘంట 48 నిమిషముల కాలము  వరకు. )
7 దినములు = 1 వారము , 15 దినములు = 1 పక్షము , 2 పక్షములు = 1 నెల , 2 నెలలు = 1 ఋతువు ,
4 నెలలు = 1 కాలము , 6 నెలలు = 1 ఆయనము , 2 ఆయనములు ( ఉత్తరాయనము + దక్షిణాయనము) =
1 సంవత్సరము. ఉత్తరాయనము = షుమారు జనవరి 15 నుండి జులై 15 వరకు , దక్షినాయము = షుమారు జులై 15 నుండి జనవరి 15 వరకు. 12 సంవత్సరములు = 1 పుష్క రము. యుగములు 4.
1. కృత యుగము ( సత్యయుగము ) యుగ పరిమితి 17 లక్షల 28 వేల సంవత్సరములు.
2. త్రేతా యుగము                         యుగ పరిమితి  12 లక్షల 96 వేల సంవత్సరములు.
3. ద్వాపర యుగము                    యుగ పరిమితి    8 లక్షల 64 వేల సంవత్సరములు.
4. కలి యుగము                          యుగ పరిమితి   4 లక్షల 32 వేల సంవత్సరములు.


4 యుగములు =1 మహాయుగము, షుమారు 71. 5 మహాయుగములు = 1 మన్వంతరము, 14 మన్వంతరములు = 1 కల్ప(క)ము, బ్రహ్మ దేవునకు 1 కల్పము ( ప్రకృతి)పగలు గాను,1కల్పము (వికృతి) రాత్రి గాను లెక్కించ బడును. భూమిపై ( 28 మన్వంతరము లేక 2000 మహా యుగములు ) 864 కోట్ల సంవత్సరములు బ్రహ్మదేవునకు 1దినము. కల్పము అనగా కల్పించ బడునది లేక సృష్థి జరుగుట. వికల్పము అనగా సృష్థి వినాశమగుట. ప్రకృతి ( సృష్థి ) 432 కోట్ల సంవత్సరములు అవగానే బ్రహ్మకు పగటి కాలము ఐపోతుంది. అదే ప్రకృతి ( సృష్థి ) ఒక గ్రహముపై అంతరించి మరొక గ్రహముపై ఉద్భవించడానికి మధ్యనున్న కాలము బ్రహ్మదేవునకు ( వికృతి లేక వినాశము) రాత్రి అంటారు. భూమి మీద సృష్థి ప్రారంభమై ఇప్పటికి 200 కోట్ల సంవత్సరములు గడచి నట్లుగా చెప్పబడు చున్నది. ఆధునిక శాస్తవేత్తలు కూడా అదే విషయాన్ని ధృవపరుస్తున్నారు . వేద కాలము నాడే ఈ కాలమానాన్ని మన భారతీయ మహర్షులు చెప్పడం , ఇప్పటి ఆధునిక శాస్త్రవేత్తల అంచనాలకు సరి పోవడం నిజంగా మనకు గర్వకారణం. పురాణాలు చెపుతున్న కాలమాన ( కల్పకాల) సిద్ధాంతము, ఆధునిక సైన్స్ విషయాలకు షుమారుగా  సరిపోవుచున్నది. అంతటి బృహత్తర కాలమానాన్ని భూమిపై మరో  జాతి యేదీ  చెప్పక ముందే మన పూర్వీకులు చెప్పడం మన హిందూజాతి ఘనత. మనకు గర్వకారణం. జై హిందూ.


గణపతి స్తోత్రం .
ఓం శుక్లాంబర ధరం విష్ణుం - శశివర్ణం చతుర్భుజం
    ప్రసన్న వదనం ధ్యాయేత్ - సర్వ విఘ్నోప శాంతయే ॥


శుక్లాంబర ధరం = తెల్లని వస్త్రములను ధరించినవాడు, శశి వర్ణం = చంద్రుని వంటి తెల్లని దేహ కాంతి కలవాడు, చతుర్భుజం = నాలుగు చేతులు కలవాడు , ప్రసన్న వదనం = చిరునవ్వు ముఖము కలవాడు, ధ్యాయేత్ = ధ్యానించు చున్నాను , సర్వ విఘ్నోప = అన్ని రకములైన ఆటంకములను , శాంతయే = శాంతింప జేయు ( తొలగించు )వాడు .


     తాత్పర్యము : - చంద్రుని వంటి తెల్లని శరీర ఛాయ కలిగి , తెల్లని వస్త్రములను ధరించి , నాలుగు చేతులు కలిగి ,
     చిరునవ్వు ముఖముతో సకల ఆటంకములను తొలగించు గణపతిని నేను ధ్యానించు చున్నాను.


ఓం అగజానాన పద్మార్కం - గజానన మహర్నిశం
     అనేక దం తం భక్తానాం - ఏక దంత ముపాస్మహే ॥


అగజానన = ఏనుగు ముఖము ( తొండము ) లేనట్లయితే , పద్మార్కం = సూర్య కాంతికి వికసించిన పద్మము వలె ,
గజాననం = గజ ( ఏనుగు ) ముఖముతో , మహర్నిశం = ఎల్లప్పుడు, అనేక = సకల , దంతం = దం - తం = కోరికలు తీర్చువాడు, భక్తానాం =  భక్తులచే , ఏక దంతం = ఏక దంతునిగా , ఉపాస్మహే = ఉపాసించు ( ధ్యానించు ) చున్నాను.


     తాత్పర్యము : - తొండము లేకున్నచో, సూర్యరశ్మికి వికసించిన పద్మమువంటి ముఖము కలవాడు, ఎల్లప్పుడు గజ
     వదనము తో నుండువాడు, భక్తులకు సకల కోర్కెలు తీర్చువాడైన ఏక దంతుని ఉపాసించు (ధ్యానించు)చున్నాను.


ఓం గజాననం భూత గణాధి సేవితం - కపిథ్దం జంబూఫల సారబక్షణం
      ఉమాసుతం శోకవినాశ కారణం - నమామి విఘ్నేశ్వర పాద పంకజం ॥


గజాననం = ఏనుగు ముఖము కలవాడు, భూత గణాధి సేవితం = సకల జీవగణములచే సేవించబడు వాడు , కపిథ్దం = రావి వృక్షము , జంబూఫల = వెలగ కాయ , సార బక్షణం = గుజ్జును హరించువాడు , ఉమా సుతం = పార్వతీదేవి కుమారుడు , శోక వినాశ కారణం = దుఃఖములను ( భాధలను ) పోగొట్టుటకు మూలమైన వాడు , పాద పంకజం = తామరపూల వంటి ఎర్రని పాదములను కలవాడు, నమామి విఘ్నేశ్వర = వినాయకునకు నమస్కరించు చున్నాను.


     తాత్పర్యము : - సకల జీవరాసులచే కొలువ బడుతూ, వెలగపండు లోని సారము ( గుజ్జును) హరించు వాడు, రావి ( రాగి) వృక్షమనిన ఇష్థపడు గజవదనుని , దుఃఖములను కష్థములను ఆటంకములను నివారించు వాడు, తామర పుష్పముల వంటి పాదములు కలవాడు, పార్వతీదేవి కుమారుడైన విఘ్నేశ్వరునకు , నమస్కరించు చున్నాను.


ఓం సుముకశ్చైక దంతస్య - కపిలో గజకర్ణికః ।
    లంబోరశ్చ వికటో - విఘ్నరాజో గణాధిపః ।
    ధూమకేతు ర్గణాద్యక్షో - ఫాల చంద్రో గజాననః।
    వక్రతుండ శూర్పకర్ణ - హేరంభ స్కంద పూర్వజః ॥


సుముకశ్చైక దంతస్య = సుముఖశ్చ + ఏక దంతశ్చ = చిరునవ్వు ముఖము కలవాడు, ఒకే దంతము కలవాడు కపిలో = ధూమ్ర వర్ణము కలవాడు, గజకర్ణికః = పెద్ద చెవులు కలవాడు, లంబోరశ్చ = పెద్ద ఉదరము ( పొట్ట) కలవాడు, వికటో = చూచువారికి నవ్వు పుట్టించు రూపము కలవాడు,  విఘ్నరాజో =  ఆటంకలములకు అధిపతి యైన వాడు,  గణాధిపః= సకల గణములకు ( సమూహములకు) అధిపతి,  ధూమకేతు = చెడుచేయు వారికి , దుర్మార్గులకు వారి వినాశమును సూచించు) తోక చుక్క, గణాద్యక్షో = సకల గణములకు ( సమూహములకు) అధిపతి, ఫాల చంద్రో = నుదిటపై భాగమున చంద్రవంక కలవాడు , గజాననః = ఏనుగు ముఖము కలవాడు, వక్రతుండ = ముడుచుకొని యున్న చిన్న తొండము కలవాడు, శూర్పకర్ణ =  చాటల వంటి చెవులు కలవాడు,హేరంభ = ఘీంకారము చేయువాడు, స్కంద పూర్వజః = కుమారస్వామికి అన్న అయినటువంటి వాడు.


         తాత్పర్యము : - చిరునవ్వు ముఖముతో , ఒకే దంతము కలిగి , ధూమ్ర వర్ణము కలవాడు, పెద్ద చెవులు కలవాడు, పెద్ద ఉదరము కలవాడు, చూచువారికి నవ్వుపుట్టించు రూపము కలవాడు, ఆటంకములకు అధిపతియై ,
సకల గణములకు ( సమూహములకు) అధిపతి అయినవాడు,  చెడుచేయు వారికి , దుర్మార్గులకు వారి వినాశమును సూచించు) తోక చుక్క వంటివాడు,  సకల గణములకు ( సమూహములకు) అధిపతి,  నుదిటపై భాగమున చంద్రవంక కలవాడు ,  ఏనుగు ముఖము కలవాడు,  ముడుచుకొని యున్న చిన్న తొండము  కలవాడు,   చాటల వంటి చెవులు కలవాడు, ఘీంకారము చేయువాడు,  కుమారస్వామికి అన్న అయినటువంటి గణనాధునకు నమస్కారము .


ఈ శ్లోకాన్నే షోడశ నామ పూజగా చెప్ప వచ్చును.
       ఓం సుముఖాయ నమః , ఓం ఏక దంతాయ నమః , ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః,
       ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః,
       ఓం ధూమకేతవే నమః, ఓం గణాద్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః,
       ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్ప కర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కంద పూర్వజాయ నమః


సుబ్రమణ్య స్తోత్రం.
ఓం శక్తిహస్తం విరూపాక్షం - శిఖివాహన షడాననం
     తారుణం రిపు రోగఘ్నం - భావయే కుక్కుట ధ్వజం ॥


శక్తిహస్తం = శూలాయుధమును చేతిలో ధరించిన వాడు, శిఖివాహనం = నెమలి వాహనము కలిగినవాడు, షడాననం = ఆరు ముఖములు కలిగినవాడు, తారుణం = తరింపజేయు వాడు, రిపు రోగఘ్నం = శతృవులను అనారోగ్యములను నశింపజేడు వాడు, భావయే = భావించు ( తలచు) చున్నాను,  కుక్కుట ధ్వజం = కోడిపుంజు చిహ్నముగల జండాను కలిగియున్న వాడు.


      తాత్పర్యము : - ఆరు ముఖములతో చేతి యందు శూలాయుధమును ధరించి ,కోడిపుంజు చిహ్నముగల
      పతాకమును కలిగి ,నెమలి వాహనము నధిరోహించి, శతృవులను అనారోగ్యములను పారద్రోలి, మనలను
      తరింపజేయు సుబ్రమణ్యుని నేను తలంచు చున్నాను.


   ఓం గాంగేయం వహ్నిగర్భం - శరవణ జనితం , జ్ఞాన శక్తిం కుమారం
    బ్రహ్మణ్యం స్కందదేవం  గుహ - మమలగుణ యతిం , రుద్రతేజ స్వరూపం
    సేనాన్యం తారకఘ్న గురు - మచల యతిం , కార్తికేయం షడాననం
    సుబ్రణ్యం   మయూర ధ్వజ - సహితం దేవ దేవం నమామి ॥


గాంగేయం = గంగాదేవి కుమారుడు, వహ్నిగర్భం = అగ్నియందు జన్మించిన వాడు, శరవణ జనితం = ఓంకారము నుండి ఉద్భవించిన వాడు, జ్ఞాన శక్తిం = జ్ఞానమను శూలమును ధరించిన, కుమారం = కుమారస్వామి, బ్రహ్మణ్యం=  బ్రహ్మజ్ఞానము కలవాడు,  స్కందదేవం = స్కంద దేవా ( కుమార స్వామీ),  గుహ  మమలగుణ = గుహం +అమల గుణం = రహస్య (వేద) విద్యను బాగుగా తెలిసిన వాడు,  రుద్రతేజ స్వరూపం = ఈశ్వర తేజ స్వరూపము కలవాడు,     
సేనాన్యం = (దేవ) సేనాపతి, తారకఘ్న= తారకాసురుని సంహరించిన వాడు, గురు  మచల యతిం = గురుం + అచల యతిం = అచల పరిపూర్ణమును బోధించు యతీశ్వరులకు గురువు వంటివాడు, కార్తికేయం = కృత్తికా నక్షత్రమునందు జన్మించిన వాడు,షడాననం = ఆరు ముఖములు కలవాడు ( ఆర్ముగం), సుబ్రణ్యం =  సుబ్రమణ్య స్వామి, మయూర ధ్వజ  రధ సహితం = నెమలి కేతనము గల రధమును అధిరోహించినవాడు, దేవ దేవం నమామి = దేవతలకు దేవుడైన వానికి నమస్కరించు చున్నాను.


       తాత్పర్యము : - గంగాదేవి కుమారుడు, అగ్నియందు జన్మించిన వాడు, ఓంకారము నుండి ఉద్భవించిన వాడు,
       జ్ఞానమను శూలమును ధరించిన వాడు, కుమార స్వామి , బ్రహ్మ జ్ఞానము కలవాడు, స్కందుడు, రహస్యమైన
       వేదవిద్యను బాగుగా తెలిసినవాడు, ఈశ్వర తేజ స్వరూపము కలవాడు, దేవ సేనాపతి, తారకాసురుని
       సంహరించిన వాడు, అచల పరిపూర్ణమును భోధించు యతీశ్వరులకు గురువు వంటివాడు, కృత్తికా నక్షత్రమున
       జనించిన వాడు , శణ్ముఖుడు (ఆర్ముగం), సుబ్రమణ్యుడు,నెమలి చిహ్నము గల జండాను కలిగియున్న
       రధము నధిరోహించిన వాడు, దేవతలకు దేవుడైన సుబ్రమణ్య స్వామికి నమస్కరించు చున్నాను.


శ్రీ కృష్ణ స్తోత్రం  
ఓం వసుదేవ సుతం దేవం - కంస చాణూర మర్ధనం
        దేవకీ పరమానందం - కృష్ణం వందే జగద్గురుం ॥


వసుదేవ సుతం = వసుదేవుని కుమారుడు,  కంస చాణూర మర్ధనం = కంసుడు, చాణూరుడు అను అసురులను సంహరించిన వాడు, దేవకీ పరమానందం = దేవకీదేవికి అమితమైన ఆనందమును చేకూర్చిన వాడు, కృష్ణం వందే  జగద్గురుం = జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారము.


      తాత్పర్యము : - వసుదేవుని కుమారుడు , కంసుడు చాణూరుడు అను దానవులను సంహరించిన వాడు ,
      దేవకీదేవికి ( తన నోటి యందు బ్రహ్మాండమును చూపించి ఆత్మానందము, బ్రహ్మానందను) అమితమైన
      ఆనందమును చేకూర్చిన వాడు,  జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారము.


సాయిబాబా స్తోత్రం
ఓం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ - సుధా త్రావిణం త్రిక్త్య మవ్య ప్రియంతం
      తరుం కల్పవృక్షాధికం  సాధయంతాం  - నమామీశ్వరం సద్గురుం సాయినాధం ॥


సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ = ఎల్లప్పుడు వేపచెట్టు మొదట్లో ( వేపచెట్టు క్రింద) కూర్చొని యుండువాడు, సుధా త్రావిణం = అమృతమును పంచెడు వాడు ,మవ్య ప్రియంతం = తనకు ఇష్థమైన వారికి , తనను ఇష్థపడు వారికి ,  తరుం కల్పవృక్షాధికం = కల్పవృక్షము కన్న అధికమైన వాడు, సాధయంతాం = సేవించెడి వారికి, నమామీశ్వరం సద్గురుం సాయినాధం = సద్గురువైన సాయినాధునికి నమస్కారము.


       తాత్పర్యము : - ఎల్లప్పుడు వేపచెట్టు ( నింబ వృక్షం )మొదట్లో అనగా వేపచెట్టు క్రింద కూర్చొని  యుండువాడు,
       తనను ఇష్థపడు వారికి , తాను  ఇష్థ పడు వారికి అమృతమును త్రాగించువారు  ( వాక్ సుధను అనుగ్రహించు
       వారు ), తనను గూర్చి సాధన చేయు ( తనను కొలచి, సేవించెడి ) వారలకు కల్పవృక్షము కన్నఎక్కువైనటు
       వంటివారైన సద్గురు సాయినాదునకు నమస్కారము .


శివ స్తోత్రం
ఓం వందే శంబు ముమాపతిం - సురగురుం వందే జగత్కారణం
   వందే పన్నగ భూషణం మృగధరం - వందే పశూణాం పతిం
   వందే సూర్య శశాంక వహ్ని నయనం - వందే ముకుందప్రియాం
   వందే భక్త జనాశ్రయంచ వరదం - వందే శివం శంకరం॥


శంబుం = శంభునకు (ఈశ్వరునకు), ఉమాపతిం = ఉమా ( పార్వతీ) దేవి భర్తకు , సురగురుం = దేవతలకు గురువైనటు వంటి వానికి , జగత్కారణం  = సృష్థికి ఆధార మైనటువంటి ( లింగరూపు) వానికి,  పన్నగ భూషణం= సర్పములను ఆభరణములుగా ధరించు వానికి,  మృగధరం = జింక ( లేడి)ని చేతియందు కలవానికి, పశూణాం పతిం = గోవులకు రాజైనటువంటి ( నంది) ఈశ్వరునకు ,  సూర్య శశాంక వహ్ని నయనం = సూర్యుడు, చంద్రుడు, అగ్ని ని మూడు కన్నులు గా కలవానికి, ముకుందప్రియాం = విష్ణుమూర్తికి ప్రియమైన వాడు, భక్త జనాశ్రయంచ వరదం = తనను ఆశ్రయించిన భక్తులకు వరములు ఇచ్చువాడు, శివం శంకరం = శివునకుశంకరునకు, వందే= నమస్కరించు చున్నాను.


     తాత్పర్యము : - శంభునకు (ఈశ్వరునకు), పార్వతీదేవి భర్త , దేవతాగురువు, సృష్థికి మూలమైన(లింగాకృతి గల)
     వానికి, సర్పములను ఆభరణములుగా ధరించు వానికి, జింక ( జింక వలె చంచలముగా పరుగెత్తు మనస్సును
     తన అధీనములో) చేతి యందు కలవానికి, ( నంది) ఈశ్వరునకు , సూర్య చంద్రాగ్ను లను మూడు కన్నులుగా
     గల వాని (ముక్కంటి)కి , విష్ణుమూర్తికి ప్రియమైన వానికి, తనను ఆశ్రయించిన భక్తులకు వరములను
     ఇచ్చువాడైన శివునకు, శంకరునకు నేను నమస్కరించు చున్నాను


దేవీ స్తోత్రం
ఓం సర్వ మంగళ మాంగల్యే - శివే సర్వార్ధ సాధకే
    శరణ్యే త్ర్యంబకీ దేవీ - నారాయణి నమోస్తుతే॥


సర్వ మంగళ మాంగల్యే = సకల శుభములను చేకూర్చు మంగళ గౌరీదేవి, శివే = శివుని అర్ధాంగి , సర్వార్ధ సాధకే = సకల కోర్కెలు తీర్చునది,  శరణ్యే = శరణుబ్ందు చున్నాను, త్ర్యంబకీ దేవీ = త్ర్యంబకుని ( శివుని) సతీమణి , నారాయణి = విష్ణుమూర్తి సహోదరి ,  నమోస్తుతే = నిన్ను స్తుతిస్తూ నమస్కరించు చున్నాను .


      తాత్పర్యము : - నారాయణుని సహోదరి, త్ర్యంబకుడైన ఈశ్వరుని సతీమణీ, సకల కోర్కెలు తీర్చి సకల
      శుభములను చేకూర్చు మంగళ గౌరీదేవి, నిన్ను శరణుపొంది స్తోత్రము చేయుచు నమస్కరించు చున్నాను.


విష్ణు స్తోత్రం
ఓం శాంతాకారం భుజగ శయనం - పద్మనాభం సురేశం
   విశ్వాకారం గగన సదృశం - మేఘవర్ణం శుభాంగం
   లక్ష్మీకాంతం కమల నయనం - యోగిహృధ్యాన గమ్యం
   వందే విష్ణుం భవభయ హరం - సర్వలోకైక నాధం ॥

శాంతాకారం = ప్రసన్నమైన ఆకృతి కలవాడు,  భుజగ శయనం = సర్పము ( శేశ తల్పము ) పై పవళించు వాడు,  పద్మనాభం = నాభియందు కమలము కలవాడు,  సురేశం = దేవతలలో రాజు,  విశ్వాకారం = విశ్వమునే రూపముగా ధరించినవాడు, గగన సదృశం = ఆకాశము వంటివాడు ( ఆకాశము కంటికి కన్పిస్తుందే కాని అది మనకు అందదు, భగవత్ తత్వము ఇతరులు మనకు చెప్పినపుడు అర్ధమైనట్లు అనిపిస్తుందే కాని ఎంతకూ అంతు పట్టదు ),  మేఘవర్ణం
= నీలపు వర్ణము కలవాడు, శుభాంగం = మంగళ కరమైన అవయవములు కలవాడు,  లక్ష్మీకాంతం = లక్ష్మీదేవికి భర్తయై నటువంటి వాడు,  కమల నయనం = తామర రేకుల వంటి కన్నులు కలవాడు, యోగిహృధ్యాన గమ్యం = యోగి +హృద్ + ధ్యాన + గమ్యం = యోగులు (నిరంతరము తనను మనస్సులో ధ్యానించు కొను వారి ) హృదయము లలో  వుండు వాడు,  భవభయ హరం = పుట్టుక వలన సంక్రమించిన భయములను పోగొట్టు వాడు, సర్వలోకైక నాధం = సకల భువనము ( లోకముల ) ను రక్షించు వాడైన ,  వందే విష్ణుం = విష్ణువు నకు నమస్కరించు చున్నాను.


తాత్పర్యము : -  ప్రసన్నమైన ఆకృతి కలవాడు,  సర్పము ( శేశ తల్పము ) పై పవళించు వాడు,  నాభియందు కమలము కలవాడు,  దేవతలలో రాజు,  విశ్వమునే రూపముగా ధరించినవాడు, ఆకాశము వంటివాడు ( ఆకాశము కంటికి కన్పిస్తుందే కాని అది మనకు అందదు, భగవత్ తత్వము ఇతరులు మనకు చెప్పినపుడు అర్ధమైనట్లు అనిపిస్తుందే కాని ఎంతకూ అంతు పట్టదు ), నీలపు వర్ణము కలవాడు,  మంగళ కరమైన అవయవములు కలవాడు,   లక్ష్మీదేవికి భర్తయై నటువంటి వాడు,  తామర రేకుల వంటి కన్నులు కలవాడు,  యోగుల (నిరంతరము తనను మనస్సులో ధ్యానించు కొను వారి ) హృదయము లలో  వుండు వాడు,   పుట్టుక వలన సంక్రమించిన భయములను పోగొట్టు వాడు, సకల భువనము ( లోకముల ) ను రక్షించు వాడైన ,  విష్ణువు నకు నమస్కరించు చున్నాను.


లక్ష్మీదేవి స్తోత్రం
ఓం లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం - శ్రీరంగ ధామేశ్వరీం
    దాసీభూత సమస్త దేవ వనితాం - లోకైక దీపాంకురాం ।
   శ్రీమన్మంద కటాక్ష లబ్ధవిభవాం - బ్రహ్మేంద్ర గంగాధరాం  
   త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం - వందే ముకుంద ప్రియాం ॥


లక్ష్మీం = అమ్మా లక్ష్మీ దేవీ, క్షీరసముద్ర రాజ తనయాం = పాల సముద్రుని కుమార్తెవైన ,  శ్రీరంగ ధామేశ్వరీం = శ్రీరంగ క్షేత్రమున నెలకొని యున్నదానవైన ,  దాసీభూత సమస్త దేవ వనితాం = దాసీ జనములచే దేవతా స్త్రీలచే పరివేష్ఠింప బడినదానవు, లోకైక దీపాంకురాం = అన్ని లోకములకు వెలుగు ( జ్ఞానము) ను ప్రసాదించు దానవు, మన్మంద = చిరునవ్వు, కటాక్ష లబ్ధవిభవ = కరుణా కటాక్షమును పొందినవారు, బ్రహ్మేంద్ర గంగాధరాం  = బ్రహ్మ , ఇంద్ర (విష్ణువు) ఈశ్వరుడు, త్వాం త్రైలోక్య కుటుంబినీం = నీవు మూడు లోకములలో ముగ్గురు మూర్తులకు సతీమణిగా వున్నదానవు,  సరసిజాం = కమలము నందు జన్మించిన దానవు, వందే ముకుంద ప్రియాం = ముకుందుని ( విష్ణుమూర్తి ) ప్రియ సఖివైన నీకు నమస్కారము.


      తాత్పర్యము : - పాల సముద్రుని కుమార్తె , శ్రీరంగ క్షేత్రమున నెలకొని యున్నశ్రీదేవీ ,  దాసీలచే దేవతా స్త్రీలచే
      పరివేష్ఠింప బడినదానవు,  అన్ని లోకములకు వెలుగు ( జ్ఞానము , సిరిసంపదల) ను ప్రసాదించు దానవు, నీ
       చిరునవ్వు,  కరుణా కటాక్షమును పొందినవారైన , బ్రహ్మ , ఇంద్ర (విష్ణువు) ఈశ్వరుడు,  మూడు లోకములలో
       ముగ్గురు మూర్తులకు ( బ్రహ్మకు సరస్వతీ దేవిగా , విష్ణువునకు లక్ష్మీదేవిగా , ఈశ్వరునకు పార్వతీదేవిగా)
       సతీమణిగా వున్నదానవు,  కమలము నందు జన్మించిన దానవు,  ముకుందుని ( విష్ణుమూర్తి ) ప్రియ సఖివైన
       నీకు నమస్కారము.


శ్రీరామ స్తోత్రం
ఓం శ్రీరాఘవం దశరధాత్మజ మప్రమేయం - సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
   ఆజాను భాహుం అరవింద దళాయతాక్షం - రామం నిశాచర వినాశకరం నమామి॥


రాఘవం = రఘు వంశము నందు జన్మించిన వాడు, దశరధాత్మజం = దశరధుని కుమారుడు, అప్రమేయం = ఇతరులతో అవసరములేని ( ఇతరులతో పోల్చ దగని ) వీరాధివీరుడు, సీతాపతి = సీతాదేవి భర్త, రఘుకులాన్వయ= రఘువంశమునందు జన్మించిన వాడు , రత్నదీపం = తలమానికమైన వాడు, ఆజాను భాహుం = ( మోకాళ్ళను తాకు ) పొడవైన చేతులు కలవాడు, అరవింద దళాయతాక్షం =తామర రేకులవంటి కన్నులు కలవాడు, నిశాచర వినాశకరం = రాక్షసులను సంహరించిన వాడు,  రామం నమామి = శ్రీ రామునకు నమస్కారము


      తాత్పర్యము : - రఘు వంశము నందు జన్మించిన వాడు,  దశరధుని కుమారుడు,  ఇతరులతో అవసరములేని    
      (ఇతరులతో పోల్చ దగని ) వీరాధివీరుడు,  సీతాదేవి భర్త,  రఘువంశమునందు జన్మించిన వాడు , రఘు వంశము
      నకు  తలమానికమైన వాడు, ( మోకాళ్ళను తాకు ) పొడవైన చేతులు కలవాడు, తామర రేకులవంటి కన్నులు
      కలవాడు,  రాక్షసులను సంహరించిన వాడైన  శ్రీ రామునకు నమస్కారము


ఆంజనేయ స్తోత్రం
ఓం మనోజవం మారుతతుల్య వేగం - జితేంద్రియం బుద్దిమతాం పరిష్థం
     వాతాత్మజం వానరయూధ ముఖ్యం - శ్రీరామ దూతం శిరసా నమామి॥


మనోజవం = ధృడమైన మనస్సు కలవాడు, మారుత = వాయువుతో , తుల్య వేగం = సమానమైన వేగముతో చరించు వాడు, జితేంద్రియం = ఇంద్రియములను జయించిన వాడు ( బ్రహ్మచారి), బుద్దిమతాం = సుగుణము కలవాడు, పరిష్థం = ధృడమైన శరీరము కలవాడు, వాతాత్మజం = వాయుదేవుని కుమారుడు, వానరయూధ ముఖ్యం = వానర మూకకు నాయకుడు ,  శ్రీరామ దూతం = రాముని బంటు ( సేవకుడు)  అయిన ఆంజనేయునకు , శిరసా నమామి = శిరస్సు వంచి నమస్కరించు చున్నాను.


       తాత్పర్యము : - ధృడమైన మనస్సు కలవాడు,  వాయువుతో  సమానమైన వేగముతో చరించు  వాడు,  
       ఇంద్రియములను జయించిన వాడు ( బ్రహ్మచారి), సుగుణము కలవాడు, ధృడమైన శరీరము కలవాడు,
       వాయుదేవుని కుమారుడు,  వానర మూకకు నాయకుడు , శ్రీ రాముని బంటు ( సేవకుడు)  అయిన
       ఆంజనేయునకు ,  శిరస్సు వంచి నమస్కరించు చున్నాను.


నవగ్రహ స్తోత్రం
ఓం ఆదిత్యాయ చ సోమాయ  - మంగళాయ బుధాయచ
    గురు శుక్ర శనిబ్యశ్చ - రాహువే కేతువే నమః॥


ఆదిత్యాయ = సూర్యుడు, సోమాయ = చంద్రుడు, మంగళాయ = కుజుడు,  బుధాయ = బుధుడు,  గురు = గురుడు ( బృహస్పతి), శుక్ర = శుక్రుడు, శని = శనేశ్వరుడు, రాహువే = రాహువు , కేతువే నమః= కేతువులకు నమస్కారము,


       తాత్పర్యము : - నవగ్రహములైన  సూర్యుడు,  చంద్రుడు, కుజుడు,  బుధుడు,  గురుడు ( బృహస్పతి), శుక్రుడు,
       శనేశ్వరుడు, రాహువు ,  కేతువులకు నమస్కారము.


సరస్వతి స్తోత్రం
ఓం యాకుందేందు తుషారహార వదనా - యాశుభ్ర వస్త్రాన్వితా
    యా వీణా వర మండిత కరా - యాశ్వేత పద్మాసనా
    యా బ్రహ్మాచ్యుత శంకర - ప్రభృతి సదా పూజితా
    సామంపాతు సరస్వతీ భగవతీ - పూర్ణేందు బింబాననా॥


కుందేందు = కుంద + ఇందు = చందనము ( గంధము) , చంద్రుని వంటి తెల్లని, తుషారహార = మంచుతెర , వదనా = మోముగల , యాశుభ్ర వస్త్రాన్వితా = శుభ్రమైన తెల్లని  వస్త్రములు ధరించి,  వర వీణా = శ్రేష్టమైన వీణచే, మండిత కరా = కాంతులీనుచున్న చేతులు కలది , శ్వేత పద్మాసనా = తెల్లని పద్మమును ఆసనముగా కలిగియున్న,  బ్రహ్మాచ్యుత
శంకర = బ్రహ్మ విష్ణు మహేశ్వరుల, ప్రభృతి = మొదలైన వారిచే, సదా పూజితా = ఎల్లా వేళల పూజింప ( గౌరవించ) బడునది,సామంపాతు = సాష్థాంగ నమస్కారము,పూర్ణేందు బింబాననా = పున్నమిచంద్రుని వంటి ముఖముగలదానా


     తాత్పర్యము : - (చందనము) గంధము ,  మంచుతెర ,చంద్రుని వంటి తెల్లని,  మోముగలిగి , తెల్లని  వస్త్రములు
     ధరించి, శ్రేష్టమైన కాంతులీను వీణ చేతుల యందు కలదియు , బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ( త్రిమూర్తులు)
     మొదలైన వారిచే  ఎల్లా వేళల పూజింప ( గౌరవించ) బడునదియు , పున్నమిచంద్రుని వంటి ముఖముగలిగిన
      భగవతీ, సరస్వతీదేవి నీకు  సాష్థాంగ నమస్కారము.


గురు వందనం
ఓం గురుః బ్రహ్మ గురుర్విష్ణు - గురుదేవో మహేశ్వరః
    గురు సాక్షాత్ పరబ్రహ్మ - తస్మై శ్రీగురవే నమః ॥
    అజ్ఞాన తిమిరాంధస్య - జ్ణానాంజన శలాకయా
    చక్షుర్మీలితం యేన - తస్మై శ్రీగురవే నమః॥


గురుః బ్రహ్మ = గురువే బ్రహ్మ దేవుడు ,  గురుర్విష్ణు = గురువే విష్ణుమూర్తి , గురుదేవో మహేశ్వరః = గురువే దేవదేవుడైన ఈశ్వరుడు, గురు సాక్షాత్ పరబ్రహ్మ = గురువే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు, తస్మై శ్రీగురవే నమః = అట్టి గురువునకు నమస్కరించు చున్నాను,  అజ్ఞాన తిమిరాంధస్య = అజ్ఞానపు చీకటిలో కన్నులు కానరాని (గ్రుడ్డి) వారికి , జ్ణానాంజన శలాకయా = జ్ఞానమను కాటుకను పెట్టే కాటుకపుల్ల వంటి వారైన ,  చక్షుర్మీలితం యేన = చక్షుర్ + ఉన్మీలితం + యేన = కన్నులు తెరిపించు వారెవరో , తస్మై శ్రీగురవే నమః = అట్టి గురువునకు నమస్కారము.


తాత్పర్యము  : - బ్రహ్మ విష్ణు ఈశ్వర స్వరూపులై , సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులై , అజ్ఞానపు చీకటిలో (అన్ను మిన్ను కానక అహంకారము తో కన్నులు మూసుక పోయి ) కన్నులు కానరాని వారికి ,తానే కాటుక పుల్లయై జ్ఞానము అను కాటుకను పెట్టి అజ్ఞానముతో మూసుక పోయిన కన్నులను తెరిపించి, జ్ఞాన కాంతులను చూపించు వారైన గురువునకు నమస్కారము. బ్రహ్మ, విష్ణు , ఈశ్వర వీరి ముగ్గురిని త్రిమూర్తులంటారు. బ్రహ్మ సృష్థి కర్త , సృష్థి చేయడమే వీరి విధి .  
విష్ణువు స్థితికర్త , సృష్థిని వృద్ధిపరచి సంరక్షించి పాలించుట వీరి విధి . ఈశ్వరుడు లయకర్త, లయము అనగా
నాశనమగుట, నశించుట, అంతరించుట , కానరాకుండా పోవుట అనునవి సామాన్య అర్ధములు. కాని లయము అనగా కలసిపోవుట , విలీనమగుట అని అర్ధము. ఈశ్వరుడు తన ( ప్రకృతి)నుండి వచ్చిన దానిని తిరిగి తనలోనే ( ప్రకృతిలోనే) ఐక్యము చేస్తు ( చేసుకుంటు) న్నాడు. లయము చేయుటయే వీరి విధి. కాని గురువు తన  శిశ్యునికి మంత్రోపదేశము చేసి వారి హృదయాలలో జ్ఞానబీజము నాటి బ్రహ్మగాను, అట్టి జ్ఞానము అభివృద్ధి పొందుటకు అనుష్థాదికములను చేయించి జ్ఞానమును వృద్ధిచేసి విష్ణువుగాను , పరిపూర్ణ జ్ఞానము పొందిన శిశ్యుని పరబ్రహ్మలో ఐక్యమగునటుల చేసి ఈశ్వరునిగాను ,గురువు త్రిమూర్తి స్వరూపుడై తానే శిశ్యునకు పరబ్రహ్మ స్వరూపుడగు చున్నాడు. అట్టి గురువునకు నమస్కారము.
( చంద్రమౌళి గురుస్వామినే (గురు దేవేభ్యో ) నమః ). ఇచ్చట ఎవరి గురువుగారి పేరు వారు చెప్పు కుంటారు.


అయ్యప్ప పూజ
ధ్యానం .    ఓం అఖిల భువన దీపం , భక్త చిత్తాబ్జ సూనం
                   సురగణ ముని సేవ్యం , తత్వమస్యాది లక్ష్యం
                   హరిహర సుతమీశం , తారక బ్రహ్మరూపం
                   శబరిగిరి నివాసం భావయే భూతనాధం॥


అఖిల భువన దీపం = సకలజగత్తునకు వెలుగు నిచ్చువాడు ( జ్యోతి స్వరూపుడు),  భక్త చిత్తాబ్జ సూనం = భక్తుల హృదయ కమలమునందు ప్రభవించువాడు, సురగణ ముని సేవ్యం = మునులచే దేవతాగణములచే పూజింపబడు వాడు, తత్వమస్యాది లక్ష్యం = తత్వమసి + ఆది లక్ష్యం = తత్వమసి యను మహావాక్యార్ధమును భోధించుటయే లక్ష్యముగా కలవాడు, హరిహర సుతమీశం = హరిహర పుత్రుడవైన ఓ దేవా , తారక బ్రహ్మరూపం = తరింపజేయు నటువంటి పరబ్రహ్మ స్వరూపుడవు, శబరిగిరి నివాసం = శబరి కొండపై స్థిరముగా నెలకొని యున్నట్టి , భావయే భూతనాధం = భూతనాధుడైనట్టి అయ్యప్పను తలచుకొను చున్నాను.


       తాత్పర్యము : - సకల లోకములకు జ్ఞానమను వెలుగు నిచ్చువాడు , జ్యోతి స్వరూపుడు , మునులచే
       దేవతాగణములచే పూజింపబడు వాడు,  భక్తుల హృదయ కమలమునందు నివవించువాడు, హరిహర
       పుత్రుడవైన ఓ దేవా , తత్వమసి యను మహావాక్యార్ధమును బొధించుటయే లక్ష్యముగా గల సద్గురువు,
       తరింపజేయు నటువంటి పరబ్రహ్మ స్వరూపుడు , శబరి కొండపై స్థిరముగా నెలకొని యున్న,  భూతనాధుడైనట్టి
        అయ్యప్పను తలచుకొను చున్నాను.


ఆవాహనం . శ్లో॥ అగచ్చ భగవన్ దేవ - స్థానేచాత్ర స్థిరోభవ
                      యావత్పూజాం కరిష్యేహం - తావత్వం సన్నిధిం వస ॥


అగచ్చ = రండి ( వేంచేయండి), భగవన్ దేవ = భగవాన్ అయ్యప్పస్వామీ ,  స్థానేచాత్ర  = స్థానేచ + అత్ర  = ఈ స్థానము ( ప్రదేశము ) న , స్థిరోభవ = కదలకుండా వుండండి, యావత్పూజా  = పూజపూర్తిగా , కరిష్యేహం = కరిష్యే + అహం = నేను చేసు కుంటాను, తావత్వం = మీరు , సన్నిధిం వస = నా ( సన్నిధిలో ) వద్దనే వుండండి.


        తాత్పర్యము : - హే భగవాన్ అయ్యప్పస్వామీ, తాము ఇక్కడకు వేంచేయండి, నేను మీకు పూజ పూర్తిగా
        చేసేంతవరకు కదలకుండా , ఇక్కడే నావద్దనే కూర్చొన వలసినదిగా నాయొక్క ప్రార్ధన.


ఆసనం.     శ్లో॥ నానావర్ణ సమాయుక్తాన్ - పుష్ప గంధైశ్చ భూషితం
                     ఆసనం దేవదేవేశ - ప్రీత్యర్ధం ప్రతి గృహ్యతాం॥


నానావర్ణ సమాయుక్తాన్ = అనేక వర్ణములతో కూడియున్న ( రంగులు గల), పుష్ప గంధైశ్చ = సువాసన గల పుష్పములతో , భూషితం = అలంకరించ బడిన , ఆసనం = ఆసనమును , దేవదేవేశ  ప్రీత్యర్ధం = దేవదేవుడవైన నీకొరకు, ప్రతి గృహ్యతాం = స్వీకరించండి.


         తాత్పర్యము : - స్వామీ , దేవదేవుడవైన నీ కొరకు సువాసన గల రంగు రంగుల పూలతో అలంకరించబడి
         ఏర్పాటు చేయబడిన, ఈ ఆసనమును స్వీకరించండి.


పాద్యం.     శ్లో॥ భూతనాధ నమస్తేస్తు - నరకార్ణవ తారక
                    పాద్యం గృహాణ దేవేశ - మమ సౌఖ్యం వివర్ధయ॥


భూతనాధ నమస్తేస్తు = ఓ భూతనాధా నీకు నమస్కారము, నరకార్ణవ =నరక + ఆర్ణవ = నరకము అను సముద్రమును,  తారక = దాటించు వాడు, పాద్యం గృహాణ = కాళ్ళు కడుగుకొనుటకు నీళ్ళను తీసుకొనుము, దేవేశ = దేవ + ఈశ = దేవతలలో గొప్పవాడా , మమ సౌఖ్యం  వివర్ధయ = నాయొక్క సౌఖ్యములను ( సుఖములను) పెంచువాడా.


           తాత్పర్యము : - దేవతలలో గొప్పవాడవైన , నరకము అను సముద్రమును దాటించి ,నా సుఖసౌఖ్యములను
           పెంపొందించు వాడవైన , ఓ భూతనాధా నీకు నమస్కారము. నేను మీకు కాళ్ళు కడుగుకొనుటకు ఇచ్చు
           ఈ నీటిని తీసుకొనుము ( నీ కాళ్ళు కడుగనిమ్ము).


అర్ఘ్యం .    శ్లో॥ వ్యక్తావ్యక్త స్వరూపాయ - హృశీకేశాయతే నమః
                   మయా నివేదితో భక్త్యా - అర్ఘ్యోయం ప్రతిగృహ్యతాం ॥


వ్యక్తావ్యక్త స్వరూపాయ = వ్యక్తీకరించ బడు నటువంటియు, వ్యక్తికరించ లేనటువంటి స్వరూపము ( ఆకృతి) కలవాడ,  హృశీకేశాయతే నమః = హృశీక + ఈశాయ + తే నమః = ఇంద్రియములను జయించిన వానికి నమస్కారము ,                     మయా నివేదితో భక్త్యా = నేను భక్తితో ఇచ్చు చున్నటువంటి ,  అర్ఘ్యోయం = చేతులు కడుగు కొనుటకు ఇచ్చు జలమును, ప్రతిగృహ్యతాం = తీసుకొనండి ( గ్రహించండి).


          తాత్పర్యము : - వివరింప దగినట్టియు, వివరింప లేనటువంటియు ఐన రూపము ( ఆకృతి ) కలవాడవైన ,
          బ్రహ్మచారి ( ఇంద్రియములను జయించిన వాడ ) వైన స్వామీ, నేను భక్తితో నీకు చేతులు కడుగుకొనుటకు
          ఇచ్చు నీటిని గ్రహించుము. ( నీచేతులు కడుగనిమ్ము).


ఆచమనీయయం. శ్లో॥ మందాకినీ సమం వారి - తాప పాపహరం శుభం
                              దధినం కల్పితం దేవ - సమ్యకాశ ద్వుతాం త్వయా॥


మందాకినీ = మందాకని నదియొక్క , సమం వారి = సరియైన నీరు (అంత పవిత్రమైన , రుచికరమైన నీటిని , తాప = దాహమును, పాపహరం = పాపములను పోగొట్టునటు వంటి ,  శుభం = మేలును చేకూర్చు నటువంటి, దధినం  కల్పితం దేవ = పెరుగు కలుపబడిన ,  ద్వుతాం త్వయా = మీరుత్రాగండి.


          తాత్పర్యము : - దాహమును ,పాపములను పోగొట్టు మందాకినీ  నదీ జలము వంటి నీటిలో పెరుగు కలిపి
          (మజ్జిగను) మీకు ఇచ్చుచున్నాను , స్వీకరించండి ( త్రాగండి) ప్రభూ.


స్నానం (స్నపనము). శ్లో॥ ఓం గంగైచ యమునై చైవ - కృష్ణా గోదావరీ సరస్వతి
                                          నర్మదా సింధు కావేరీ - జలేస్మిన్ సన్నిధిం కురు॥
                                           సర్వే సముద్రా సరితా - తీర్ధానిచ నదా  హ్రదా
                                          `ఆయాంతు దేవ పూజార్ధం - మమ దురిత క్షయ కారక॥
                                           నానానదీ సమానీతం - సువర్ణకలశ స్థితం
                                           శుద్దోదకేన సుస్నానం - కర్తవ్యం హరి నందన॥


గంగైచ యమునై చైవ - కృష్ణా గోదావరీ సరస్వతి , నర్మదా సింధు కావేరీ = గంగ , యమునా , కృ ష్ణా , గోదావరి , సరస్వతి , నర్మదా , సింధు , కావేరి మొదలైన పుణ్య నదుల,  జలే = నీటిని , అ స్మిన్ సన్నిధిం కురు = ఇచ్చట ( మీవద్ద) వుంచినాను, సర్వే సముద్రా = అనేక సముద్రముల ,  సరితా = జలపాతముల ,  తీర్ధానిచ = నీటిని ,  నదా  = నదుల ( తూర్పు ప్రవహించే నదులు ), హ్రదా = పశ్చిమం ప్రవహించే నదుల నీరు, ఆయాంతు = వచ్చి చేరుగాక,  దేవ పూజార్ధం = స్వామివారి పూజకొరకు,  మమ = నాయొక్క , దురిత క్షయ కారక = పాపములను పోగొట్టువాడా ,          నానానదీ = అనేక నదులయొక్క , సమానీతం = కూడుకొని  యున్నటు వంటి,   సువర్ణకలశ స్థితం = బంగారు కలశము (చెంబు) లో వున్నటువంటి,  హరి నందన = విష్ణువు కుమారుడ,  శుద్దోదకేన = పరిశుద్దమైన ఈ నీటితో ,స్నానం - కర్తవ్యం = స్నానము చేయండి.


      తాత్పర్యము : - నా పాపములను ,దోషములను పోగొట్టు , విష్ణు నందనుడవైన అయ్యప్పస్వామీ , నీపూజకొరకు
      సిద్దము చేయబడిన బంగారు కలశములోనికి సకల సముద్రములనీరు,  గంగ , యమునా , కృ ష్ణా , గోదావరి ,
      సరస్వతి , నర్మదా , సింధు , కావేరి మొదలైన పుణ్య నదుల నీరు, పడమరగా ప్రవహించే నదులనీరు,    
      జలపాతముల నీరు వచ్చి చేరుగాక. స్వామీ అట్టి కలశములోని జలముచే మీరు స్నానమాచరించెదరు గాక  
     ( స్నానము చేయండి).


వస్త్రం .      శ్లో॥ వేదసూక్త  సమాయుక్తం - యజ్ఞసామ సమన్వితే
                   సర్వవర్ణ ప్రదేదేవ -  వాసాంసి ప్రతి గృహ్యతాం॥


వేదసూక్త  సమాయుక్తం = వేద సూక్తులతో కూడుకొని ,  యజ్ఞసామ సమన్వితే = సామ యజ్ఞముతో కలసియున్న ,
సర్వవర్ణ ప్రదే =అనేక రంగులు ( వర్ణములు )గల, దేవ = స్వామీ, వాసాంసి = వస్త్రములను,  ప్రతి గృహ్యతాం = స్వీకరించండి .


        తాత్పర్యము : - స్వామీ వేదసూక్తులను దారములచే , సామ యజ్ఞమను క్రియచే తయారు చేయబడిన అనేక
        వర్ణములు గల ఈ వస్త్రమును ధరించండి.


యజ్ణోపవీతం.  శ్లో॥ బ్రహ్మ విష్ణు మహేశైశ్చ - నిర్మితం బ్రహ్మసూత్రకం
                         గృహాణ సర్వ వరద - ధర్మశాస్తా నమోస్తుతే॥


బ్రహ్మ విష్ణు మహేశైశ్చ = బ్రహ్మ విష్ణు ఈశ్వరులచే , నిర్మితం = తయారు చేయ బడిన , బ్రహ్మసూత్రకం =   యజ్ణోపవీతము ( 3X3=9 పోగుల జంద్యము), గృహాణ = గ్రహించుము ( తీసుకొనుము),సర్వ వరద = అందరిని కాపాడువాడు, ధర్మశాస్తా నమోస్తుతే =  ఓ ధర్మశాస్తా నిన్ను కొనియాడుచు నమస్కరించు చున్నాను.


         తాత్పర్యము : - సర్వులను కాపాడు ఓ ధర్మశాస్తా , బ్రహ్మ విష్ణు ఈశ్వరులచే తయారు చేయబడిన ఈ
         యజ్ఞోపవీతమును నీకు సమర్పిస్తున్నాను ధరించండి.


గంధం (చందనం). శ్లో॥ శ్రీగంధ చందనం దివ్యం - గంధాద్యం సుమనోహరం
                             విలేపన సురశ్రేష్థ - చందనం ప్రతి గృహ్యతాం॥


శ్రీగంధ = మంచి ( శ్రీ ) గంధపు చెట్టు ( చెక్క )నుండి తీయబడిన , చందనం దివ్యం = మహత్తరమైన గంధమును,  గంధాద్యం =   గంధములలో కెల్ల శ్రేష్థమైన , సుమనోహరం = హృదయమును దోచుకోగల మంచి సువాసన గలది,                               విలేపన = పూయు (రాయు) చున్నాను, సురశ్రేష్థ = దేవతలలో శ్రేష్టుడ వైనటువంటి,  చందనం ప్రతి గృహ్యతాం = గంధమును స్వీకరించండి.


           తాత్పర్యము : - మనస్సును దోచుకొను సువాసనగల , గంధములలో కెల్ల శ్రేష్థమైన శ్రీగంధ చందమును
           దేవతలలో గొప్పవాడవైన నీకు విలేపనము చేయు ( పూయు ) చున్నాను. తాము స్వీకరించ వలసినదిగా నా
           ప్రార్ధన. ( గంధమును నీటిలో కలిపి పూయవలెనే కాని పొడి  గంధమును స్వామిపై చల్లారాదు  )


కుంకుమ.  శ్లో॥ హరిద్రా చూర్ణ సమాయుక్తం - కుంకుమం క్షేమదాయకం
                    నానా పరిమళం దివ్యం - గృహాణ గుణభూషణ ॥


హరిద్రా చూర్ణ = పసుపు పొడితో , సమాయుక్తం = కూడుకొని యున్న ,  కుంకుమం = కుంకుమ , క్షేమదాయకం = మేలును చేకూర్చునది ( మేలుచేయునది) , నానా పరిమళం = అనేక సువాసనలతో ,  దివ్యం =  శ్రేష్థమైన , గృహాణ = స్వికరించుము,  గుణభూషణ = మంచి గుణములచే శోభిల్లువాడా.


             తాత్పర్యము : - సుగుణములతో శోభిల్లు అయ్యప్పస్వామీ, పసుపుతో తయారు చేయబడిన మంచి
            సువాసనలు వెదజల్లు, క్షేమమును చేకూర్చు నటువంటి కుంకుమను నీకు సమర్పిస్తున్నాను .
            స్వీకరించుము.


అక్షతలు . శ్లో॥ అక్షతాన్ తండులాన్ శుబ్రాన్ - కుంకుమేన విరాజితం
                   హరిద్రాచూర్ణ సమ్యుక్తాం - గృహాణ మరవందిత॥


తండులాన్ శుబ్రాన్ = శుభ్రము ( రాళ్ళు, మట్టి పెల్లలు , మెరిగలు లేకుండా బాగుచేయబడిన) బియ్యము,  కుంకుమేన విరాజితం = కుంకుమ కలుపబడిన , హరిద్రాచూర్ణ సమ్యుక్తాం = పసుపు కలుపబడినవి, గృహాణా మరవందిత = గృహాణాం + అమర + వందిత = దేవతలచే కొనియాడబడు వాడా,  స్వీకరించుము,


       తాత్పర్యము : - దేవతలచే కొనియాడబడు అయ్యప్పస్వామి ,శుభ్రము చేయబడిన బియ్యములో పసుపు
       కుంకుమ కలిపిన ( పుసుపు అక్షతలు విష్ణువునకు, కుంకుమ అక్షతలు ఈశ్వరునకు , అయ్యప్ప హరిహర
       సుతుడు కనుక పసుపు కుంకుమ కలిపిన) అక్షతలను స్వీకరించుము.  


పుష్పాణి ( పుష్పములు). శ్లో॥ మల్లికాని సుగంధీని - మాలత్యాదీనివై ప్రభో
                                        మయా హృతాని పూజార్ధం - పుష్పాణి ప్రతి గృహ్యతాం॥


మల్లికాని = మల్లెపూలు , సుగంధీని = సువాసనగల  మాలత్యాదీనివై = మాలతి మొదలైన ,  ప్రభో  = ఓ దేవా,                             మయా హృతాని = నాచే సేకరించ బడిన ,   పూజార్ధం = పూజకొరకు , పుష్పాణి = పూవులను , ప్రతి గృహ్యతాం = స్వీకరించండి .


          తాత్పర్యము : - ఓ దేవా నీపూజ కొరకు నాచే సంగ్రహించ (సేకరించ) బడిన మల్లెపూలు , సుగంధ భరితమైన
          మాలతీ మొదలైన పూవులను స్వీకరించుము స్వామీ.


పుష్పమాల .  శ్లో॥ జాజీ  చంపక పున్నాగ - మల్లికా మాలతీ కృతాం
                         పుష్పమాలా సుగందాధ్యాం - గృహత్వాలం కురుప్రభో॥


జాజీ  చంపక పున్నాగ - మల్లికా మాలతీ = జాజి , చంపక , పున్నాగ , మల్లెలు, మాలతి మొదలగు పుష్పములచే, కృతాం = తయారు చేయబడిన ( కట్టబడిన , అల్లబడిన ),  పుష్పమాలా సుగందాధ్యాం = సుగంధభరితమైన ఈ పూలమాలను, గృహత్వాలం కురు = తీసుకొని అలంకరించు ( మెడలో వేసు ) కొనండి , ప్రభో = స్వామీ.


           తాత్పర్యము : - సువాసనా  భరితమైన జాజి,చంపక , పున్నాగ, మల్లెలు , మాలతి మొదలైన పుష్పములతో
           తయారు చేయ చేయబడిన ఈ పూలమాలను స్వీకరించండి స్వామీ.


                                      అయ్యప్ప ( ధర్మశాస్తా) అంగపూజ.


ఓం శ్రీ పంపా బాలాయ నమః - పాదౌ పూజయామి = పంబానదీ తీరమున పంళరాజుకు పసిబాలునిగా లభించిన స్వామీ
                                                                  నీకు నమస్కారము. నీ పాదములను పూజించుచున్నాను.
ఓం గుహ్యాతి గుహ్య గోప్త్రే నమః - గుల్ఫం పూజయామి = అతి రహస్యమైన (గుప్త) బ్రహ్మ( లేక వేద ) విద్యను
                కలిగియున్న స్వామీ నీకు నమస్కారము. నీ గుల్ఫములను ( చీలమండలమును) పూజించుచున్నాను.
ఓం అంకుశ ధరాయ నమః - ఝంగే పూజయామి = దుర్మార్గులను శిక్షించుటకు అంకుశమును ధరించిన స్వామీ నీకు
                                                                 నమస్కారము. నీ ( ఝంగే) పిక్కలను  పూజించుచున్నాను.
ఓం జగన్మోహనాయ నమః - జానునీ పూజయామి = జగత్తు (ప్రపంచము)నే మోహింప జేయగల అందమైన ఆకృతిగల
                                                                    స్వామీ నీకు నమస్కారము. నీ మోకాళ్లను  పూజించుచున్నాను.
ఓం ఉద్దాన వైభవాయ నమః - ఊరూ పూజయామి = వైభవము ( సుఖ సంతోషము) లను పెంపొందించు స్వామీ నీకు
                                                                         నమస్కారము. నీ ఊరువు ( తొడ)లను  పూజించుచున్నాను.
ఓం ఖండేందు మౌళి తనయాయ నమః - కటిం పూజయామి = చంద్రవంకను తలపై ధరించిన శివుని కుమారా  నీకు
                                                                          నమస్కారము. నీ కటిని (నడుమును) పూజించుచున్నాను.
ఓం హరిహర పుత్రాయ నమః - గుహ్యం పూజయామి = విష్ణు ఈశ్వరుల కుమారా నీకు నమస్కారము. నీ గుహ్యం
                                                                        (మర్మ స్థానము) ను పూజించుచున్నాను.
ఓం దక్షిణామూర్తి రూపకాయ నమః - నాభిం పూజయామి = దక్షిణామూర్తియైన శివుని స్వరూపముగల స్వామీ నీకు
                                                                      నమస్కారము. నీ నాభిని ( బొడ్డును) పూజించు చున్నాను.
ఓం వరదాన కీర్తయే నమః - ఉదరం పూజయామి = వరముల నిచ్చువాడవని కీర్తిని పొందిన స్వామీ నీకు
                                                           నమస్కారము.నీ ఉదరము( కడుపు, పొట్ట)ను పూజించు చున్నాను.
ఓం త్రిలోక రక్షకాయ నమః - వక్ష స్థలం పూజయామి = ముల్లోకములను కాపాడు స్వామీ నీకు నమస్కారము. నీ
                                                           వక్షస్థలమును  పూజించు చున్నాను.
ఓం మణిపూరాబ్జ నిలయాయ నమః - పార్శౌ పూజయామి = మణిపూరకమున నివాసముండు స్వామీ నీకు
                                                          నమస్కారము. నీ పార్శ్వము ( ప్రక్క) లను  పూజించు చున్నాను.
ఓం పాశహస్తాయ నమః - హస్తాన్ పూజయామి = పాపులను, చెడ్డవారిని కట్టడి చేయుటకు చేతియందు పాశమును
                                                      ధరించిన స్వామీ  నీకు నమస్కారము. నీచేతులను  పూజించు చున్నాను.
ఓం మంత్ర రూపాయ నమః - హృదయం పూజయామి = మంత్రరూపుడ వైన స్వామీ నీకు నమస్కారము.
                                                       నీహృదయమును  పూజించు చున్నాను.
ఓం  వజ్రమాలా  ధరాయ నమః - కంఠం పూజయామి = మెడయందు వజ్ర ( మణి) మాలను ధరింఛిన స్వామీ నీకు
                                                      నమస్కారము. నీ కంఠమును  పూజించు చున్నాను.
ఓం సూర్యకోటి సమప్రభాయ నమః - ముఖం పూజయామి = కోటి సూర్యులకు సమమైన కాంతివంతమైన తేజస్సుగల
                                                   స్వామీ నీకు నమస్కారము. నీ ముఖమును  పూజించు చున్నాను.
ఓం గ్రామ పాలకాయ నమః - కపోలౌ పూజయామి = గ్రామ పాలకుడవై గ్రామములను ( జనావాసము లను) కాపాడు
                                          స్వామీ నీకు నమస్కారము. నీ కపోలములను ( చెక్కిళ్ళను)  పూజించు చున్నాను.
ఓం తీక్ష్ణ దంతాయ నమః - దంతాన్ పూజయామి = పదునైన సన్నని తెల్లని కాంతివంతమైన పలువరస కలిగిన స్వామీ
                                                      నీకు నమస్కారము. నీ దంతములను  పూజించు చున్నాను.
ఓం కారుణ్యామృత లోచనాయ నమః - నేత్రే పూజయామి = కరుణయను అమృతముతో కూడిన కన్నులుగల స్వామీ
                                                      నీకు నమస్కారము. నీ కన్నులను  పూజించు చున్నాను.
ఓం రత్నకుండల ధారిణే  నమః - కర్ణౌ పూజయామి = రత్నకుండలములను (కర్ణాభరణములను) ధరించిన స్వామీ
                                                    నీకు నమస్కారము. నీ చెవులను  పూజించు చున్నాను.
ఓం లాస్య ప్రియాయ నమః - లలాటం పూజయామి = నృత్యమనిన ఇష్థపడు స్వామీ నీకు నమస్కారము. నీ
                                                      లలాటము ( నుదురు, నొసలు )ను  పూజించు చున్నాను.
ఓం శివప్రియాయ నమః - శిరః పూజయామి = శివునకు ప్రియ కుమారుడ వైన స్వామీ నీకు నమస్కారము. నీ
                                                     శిరస్సును  పూజించు చున్నాను.
ఓం జటామకుట ధారిణే  నమః అలాకాన్  పూజయామి = తలవెంట్రుకలను కిరీటమువలె అలంకారము (తాపసి
                   రూపము) కలిగిన స్వామీ నీకు నమస్కారము. నీ జఠాజూటము ( వెంట్రుకల)ను  పూజించు చున్నాను.
ఓం హరిహర పుత్ర స్వరూప  ధర్మశాస్త్రే నమః సర్వాంగ పూజన్ సమర్పయామి = హరిహర పుత్రా , ధర్మ
                                           స్వరూపుడవైన ఓ ధర్మశాస్తా నీ అన్ని అంగములకు నా పూజను సమర్పిస్తున్నాను.


                                         గురూపదేశ మంత్రము
(ప్రతిరోజు గురూపదేశ మంత్రమును 108 లేక కనీసం 18 సార్లైనా జపించాలి108 సార్లైతే శ్రేష్థం )


శరణు ఘోశ
ఓం స్వామియే శరణమయ్యప్ప = అయ్యప్పస్వామీ నిన్ను శరణు పొందుచున్నాను.
ఓం హరిహరసుతనే శరణమయ్యప్ప = విష్ణు ఈశ్వరుల కుమారుడవైన అయ్యప్పా నిన్ను శరణు పొందుచున్నాను
ఓం ఆపద్భాంధవనే  శరణమయ్యప్ప= ఆపదలయందు ఆదుకునే అయ్యప్పా నిన్ను శరణు పొందుచున్నాను.
ఓం అనాధ రక్షకనే  శరణమయ్యప్ప= దిక్కులేని వారికి నీవే దిక్కై కాపాడే అయ్యప్పా నిన్ను శరణు పొందుచున్నాను.
ఓం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప= సకల భువనములకు నాయకుడవైన అయ్యప్పా నిన్ను
                                                                                                                          శరణు పొందుచున్నాను
ఓం అన్నదాన ప్రభువే  శరణమయ్యప్ప= ఎల్లప్పుడు అన్నమును ప్రసాదించు అయ్యప్పా నిన్ను శరణు
                                                                                                                                    పొందుచున్నాను
ఓం అయ్యప్పనే  శరణమయ్యప్ప= అయ్యప్ప యను కారణ నామమును ధరించిన ధర్మశాస్తా అయ్యప్పా నిన్ను
                                                                                                                          శరణు పొందుచున్నాను
ఓం ఆర్యంగావు అయ్యవే  శరణమయ్యప్ప= ఆర్యంగావు అను ( కేరళ లోని) గ్రామమున గృహస్తునిగా కొలువున్న
                                                                                                  అయ్యప్పా నిన్ను శరణు పొందుచున్నాను
ఓం అచ్చన్ కోవెల్ అరసే  శరణమయ్యప్ప= అచ్చన్ కోవెల్ అను గ్రామమున పూర్ణ,పుష్కల దేవేరులతో కొలువున్న
                                                                                                  అయ్యప్పా నిన్ను శరణు పొందుచున్నాను
ఓం కుళుత్తుపుళ బాలకనే శరణమయ్యప్ప= కుళుత్తుపురము అను గ్రామమున పసిబాలునిగా వున్న అయ్యప్పా
                                                                                                      నిన్ను శరణు పొందుచున్నాను    - 10
ఓం ఎరుమేలి ధర్మశాస్తావే  శరణమయ్యప్ప= ఎరుమేలి యను గ్రామమున ధర్మశాస్తాగా దర్శనమిచ్చు అయ్యప్పా
                                                                                                                 నిన్ను శరణు పొందుచున్నాను
ఓం వావర్ స్వామియే  శరణమయ్యప్ప= ఎరుమేలి యందున్న వావర్ నకు మిత్రుడవైన అయ్యప్పా నిన్ను శరణు
                                                                                                                             పొందుచున్నాను
ఓం కన్నిమూల గణపతి భగవానే  శరణమయ్యప్ప= పంబలో ముందుగా వున్న గణపతికి సోదరుడవైన అయ్యప్పా
                                                                                                              నిన్ను శరణు పొందుచున్నాను
ఓం నాగరాజావే  శరణమయ్యప్ప= నాగరాజా (సుబ్రమణ్య స్వామికి సోదరుడవైన)అయ్యప్పా నిన్ను శరణు
                                                                                                                               పొందుచున్నాను
ఓం మాలిగాపురోత్తమ లోక మంజుమాతావే  శరణమయ్యప్ప= మంజుమాత దేవిని అనుగ్రహించనున్న అయ్యప్పా
                                                                                                                నిన్ను శరణు పొందుచున్నాను
ఓం కరుప్ప స్వామియే  శరణమయ్యప్ప= 18 బంగారు మెట్ల వద్దనున్న కరుప్పస్వామికి నాయకుడవైన అయ్యప్పా
                                                                                                                నిన్ను శరణు పొందుచున్నాను
ఓం సేవిప్పర్ కానందమూర్తయే  శరణమయ్యప్ప= నిన్ను సేవించువారికి ఆనందమును చేకూర్చు అయ్యప్పా నిన్ను
                                                                                                                          శరణు పొందుచున్నాను
ఓం కాశీ వాసియే  శరణమయ్యప్ప= కాశీ క్షేత్రమున నెలకొని వున్న అయ్యప్పా నిన్ను శరణు పొందుచున్నాను
ఓం హరిద్వార్ నివాసియే  శరణమయ్యప్ప= హరిద్వార్ క్షేత్రమున కొలువున్న అయ్యప్పా నిన్ను శరణు
                                                                                                                                 పొందుచున్నాను
ఓం శ్రీరంగపట్టణ వాసియే   శరణమయ్యప్ప = శ్రీరంగ పట్టణం క్షేత్రమున వున్న అయ్యప్పా నిన్ను శరణు
                                                                                                                        పొందుచున్నాను   - 20 -
ఓం కరపత్తూర్ వాసియే  శరణమయ్యప్ప= కరపత్తూర్ అను క్షేత్రమున వున్న అయ్యప్పా నిన్ను శరణు
                                                                                                                        పొందుచున్నాను
ఓం గరిడేపల్లి ధర్మశాస్తావే  శరణమయ్యప్ప= గరిడేపల్లి ( తెలంగాణ రాష్థ్రం , నల్లగొండ జిల్లా) లో ప్రతిష్టించ బడిన
                                                                                 ధర్మశాస్తా అయ్యప్పా నిన్ను శరణు పొందుచున్నాను
ఓం సద్గురు నాధనే  శరణమయ్యప్ప=గురువులకు గురువైన సద్గురునాధ అయ్యప్పా నిన్ను శరణు పొందుచున్నాను
ఓం విల్లాడి వీరనే  శరణమయ్యప్ప= విల్లంబులు చేత ధరించిన వీర అయ్యప్పా నిన్ను శరణు పొందుచున్నాను
ఓం వీరమణి కంఠనే  శరణమయ్యప్ప= అరివీర భయంకరుడవైన మణికంఠా వీర అయ్యప్పా నిన్ను శరణు
                                                                                                                              పొందుచున్నాను
ఓం ధర్మశాస్తావే  శరణమయ్యప్ప= శ్రీధర్మశాస్తా వైన అయ్యప్పా నిన్ను శరణు పొందుచున్నాను
ఓం కాంతిమల వాసయే  శరణమయ్యప్ప=కాంతిమల శిఖరముపై కొలువున్న అయ్యప్పా నిన్ను శరణు
                                                                                                                               పొందుచున్నాను
ఓం పొన్నంబల వాసనే  శరణమయ్యప్ప= స్వర్ణ ( బంగారు ) ఆలయము నందు నెలకొని యున్న అయ్యప్పా నిన్ను
                                                                                                                          శరణు పొందుచున్నాను
ఓం శరణఘోష ప్రియనే  శరణమయ్యప్ప= శరణు ఘోష కీర్తనకు పరవశించు అయ్యప్పా నిన్ను శరణు
                                                                                                                            పొందుచున్నాను
ఓం పంబాశిశువే  శరణమయ్యప్ప = పంబ తీరమున పసిబాలునిగా వున్న అయ్యప్పా నిన్ను శరణు పొందుచున్నాను  - 30
ఓం పందళ రాజకుమారనే  శరణమయ్యప్ప=పందళ రాజకుమారుడవైన  అయ్యప్పా నిన్ను శరణు పొందుచున్నాను
ఓం వావరిన్ తోళునే  శరణమయ్యప్ప= వావర్ మిత్రుడవైన  అయ్యప్పా నిన్ను శరణు పొందుచున్నాను
ఓం మోహినీ సుతనే  శరణమయ్యప్ప= జగన్మోహిని ( విష్ణువు) కుమారుడవైన  అయ్యప్పా నిన్ను శరణు పొందుచున్నాను
ఓం కళ్కండ దైవమే  శరణమయ్యప్ప = కలఖండ ( పటికబెల్లము ) ను ఇష్థపడు  అయ్యప్పా నిన్ను శరణు పొందుచున్నాను
ఓం కలియుగ వరదనే  శరణమయ్యప్ప= కలికాలపు జనులను కాపాడునట్టి  అయ్యప్పా నిన్ను శరణు పొందుచున్నాను
ఓం సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తయే  శరణమయ్యప్ప= సకల రోగములను పోగొట్టుటకు నీవే మాకు ధన్వంతరి
                                                                                                వైన  అయ్యప్పా నిన్ను శరణు పొందుచున్నాను
ఓం మహిషి మర్ధననే  శరణమయ్యప్ప= ఘోర మహిషిని సంహరించిన  అయ్యప్పా నిన్ను శరణు పొందుచున్నాను
ఓం పూర్ణపుశ్కళ నాదనే  శరణమయ్యప్ప  = పుర్ణాదేవికి , పుష్కలా దేవికి భర్తవైన  అయ్యప్పా నిన్ను శరణు
                                                                                                                                       పొందుచున్నాను
ఓం వన్ పులి వాహననే  శరణమయ్యప్ప= పెద్ద పులిని వాహనముగా గైకొనిన  అయ్యప్పా నిన్ను శరణు పొందుచున్నాను
ఓం భక్త వత్సలనే శరణమయ్యప్ప = నీ భక్తులైన వారిని నీ కన్న బిడ్దలవలె కాపాడు  అయ్యప్పా నిన్ను శరణు
                                                                                                                             పొందుచున్నాను - 40 -
ఓం భూలోక నాధనే - శరణ మయ్యప్ప= భూలోకమును ప్రభుడవై కాపాడు  అయ్యప్పా నిన్ను శరణు పొందుచున్నాను
ఓం అయిందు మలైవాసనే - శరణమయ్యప్ప= అచ్చన్ కోయల్, అరియంగావు, కుళుత్తపురం, ఎరుమేలి ,శబరిమల
                                                       యను ఐదు కొండలపై కొలువున్న  అయ్యప్పా నిన్ను శరణు పొందుచున్నాను.
ఓం శబరి గిరీశనే - శరణమయ్యప్ప= శబరిమలపై చిన్ముద్ర ధారిగా దర్శనమిచ్చు  అయ్యప్పా నిన్ను శరణు                                                                                                                              
                                                                                                                                       పొందుచున్నాను
ఓం యిరుముడి ప్రియనే - శరణమయ్యప్ప= నీ భక్తులు నీ కొరకుతెచ్చేఇరుముడిని ఇష్ఠపడే  అయ్యప్పా నిన్ను శరణు
                                                                                                                                       పొందుచున్నాను
ఓం అభిషేక ప్రియనే - శరణమయ్యప్ప= అభిషేకములంటే ఇష్టపడు  అయ్యప్పా నిన్ను శరణు పొందుచున్నాను.
ఓం వేద ప్పొరుళే - శరణమయ్యప్ప= వేదముల యందు కీర్తించ బడిన  అయ్యప్పా నిన్ను శరణు పొందుచున్నాను.
ఓం శుద్ధ బ్రహ్మ చారియే - శరణమయ్యప్ప= నిర్మల బ్రహ్మచారివైన  అయ్యప్పా నిన్ను శరణు పొందుచున్నాను.
ఓం సర్వ మంగళ  దాయకనే - శరణమయ్యప్ప= సకల శుభములను ఒసంగు  అయ్యప్పా నిన్ను శరణు పొందుచున్నాను.
ఓం వీరాధి వీరనే - శరణమయ్యప్ప= వీరులకే వీరుడవైన  అయ్యప్పా నిన్ను శరణు పొందుచున్నాను.
ఓం ఓంకార ప్పొరుళే - శరణమయ్యప్ప = ఓం కారముచే స్తుతించ బడు  అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.  - 50 -
ఓం ఆనంద రూపనే - శరణమయ్యప్ప=ఆనందమే రూపముగా గల అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.
ఓం భక్త చిత్తాధి వాసనే - శరణమయ్యప్ప= భక్తుల హృదయ నివాసివైన అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.
ఓం ఆశ్రిత వత్సలనే - శరణమయ్యప్ప= నిన్ను ఆశ్రయించి ( శరణు పొంది )న వారిని  వలె కాపాడు అయ్యప్పా నిన్ను
                                                                                                                              శరణుపొందుచున్నాను.
ఓం భూత గణాధి పతయే - శరణమయ్యప్ప= సకల భూత గణము ( ప్రాణు )లకు అధిపతివైన అయ్యప్పా నిన్ను
                                                                                                                               శరణుపొందుచున్నాను.
ఓం శక్తి రూపనే - శరణమయ్యప్ప= శక్తి స్వరూపుడు వైన అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.
ఓం శాంత మూర్తియే - శరణమయ్యప్ప= శాంత  స్వరూపుడ వైన అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.
ఓం పదునెట్టాంబడిక్కి అధిపతియే - శరణమయ్యప్ప= అష్ఠాదశ సోపానములకు అధిపతి వైన అయ్యప్పా నిన్ను
                                                                                                                               శరణుపొందుచున్నాను.
ఓం ఉత్తమ పురుషనే - శరణమయ్యప్ప= దేవతలలో శ్రేష్ఠుడ వైన అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.
ఓం ఋషికుల రక్షకనే - శరణమయ్యప్ప= ఋష్యాశ్రములను కాపాడు  అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.
ఓం వేద ప్రియనే - శరణమయ్యప్ప= వేదములకు (వేదములంటె) ఇష్ఠపడు అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.-60 -
ఓం  ఉత్తరా నక్షత్ర జాతకనే - శరణమయ్యప్ప= ఉత్తరా నక్షత్రమున అవతరించిన అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.
ఓం  తపో ధననే - శరణమయ్యప్ప= పట్టబంధాసనమున తపస్సులో నున్న అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.
ఓం ఎంగళ్ కుల దైవమే  - శరణమయ్యప్ప= పాండ్య వంశమున దైవమై వెలసిన అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.
ఓం జగన్మోహననే - శరణమయ్యప్ప= జగత్తు(ప్రపంచము)నే మోహింప జేయగల అందమైన ఆకృతి గల అయ్యప్పా
                                                                                                                      నిన్ను శరణుపొందుచున్నాను.
ఓం మోహన రూపననే - శరణమయ్యప్ప= చూడగానే ఆకర్శించగల అందమైన రూపము గల అయ్యప్పా నిన్ను
                                                                                                                             శరణుపొందుచున్నాను.
ఓం మాధవ సుతనే - శరణమయ్యప్ప= మాధవుని (విష్ణుమూర్తి) కుమారుడవైన అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.
ఓం  యదుకుల వీరనే - శరణమయ్యప్ప= యదుకుల ( ఎంగళ్ వంశము)మున జనించిన వీర అయ్యప్పా నిన్ను
                                                                                                                              శరణుపొందుచున్నాను.
ఓం మామలై వాసనే  - శరణమయ్యప్ప= దేవుని (శబరి) కొండపై నివాసమున్న అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.
ఓం షణ్ముఖ సోదరనే - శరణమయ్యప్ప= సుబ్రమణ్యస్వామి సోదరుడవైన అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.
ఓం వేదాంత రూపనే - శరణమయ్యప్ప= వేదాంతమే రూపముగా గల అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.   - 70 -
ఓం శంకర సుతనే - శరణమయ్యప్ప= శివుని కుమారుడ వైన అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.
ఓం శతృ సంహారనే - శరణమయ్యప్ప= కామ, క్రోధ, లోభ,మోహ ,మద , మాత్సర్యము అను అతః శతృవులను అణచు
                                                                                           వాడవైన అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.
ఓం సద్గుణ మూర్తయే - శరణమయ్యప్ప= సుగుణములకు నిలయమైన రూపముగల అయ్యప్పా నిన్ను
                                                                                                                               శరణుపొందుచున్నాను.
ఓం పరా శక్తియే - శరణమయ్యప్ప= (పరాశక్తి ) శక్తి స్వరూపుడవైన అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.
ఓం పరాత్పరనే - శరణమయ్యప్ప=పరబ్రహ్మ రూపుడవైన అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.
ఓం పరంజ్యోతియే - శరణమయ్యప్ప= జ్యోతి స్వరూపుడవైన అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.
ఓం హోమ ప్రియనే - శరణమయ్యప్ప= యజ్ఞ యాగాదు లనిన ఇష్ఠపడు అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.
ఓం గణపతి సొదరనే - శరణమయ్యప్ప= వినాయకుని తమ్ముడవైన అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.
ఓం రక్త విలోచనే ( కట్టాళ విశ్రామమే )- శరణమయ్యప్ప= అటవికుని రూపమున వున్న అయ్యప్పా నిన్ను
                                                                                                                               శరణుపొందుచున్నాను.
ఓం విష్ణు సుతనే - శరణమయ్యప్ప = విష్ణుమూర్తి తనయుడవైన అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.            - 80 -
ఓం సకల కళా వల్లభనే - శరణమయ్యప్ప=64 కళలలో ఆరితేరిన అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.
ఓం లోక రక్షకనే - శరణమయ్యప్ప= (భూ) లోకమును ర గల అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.
ఓం అమిత గుణాకరనే - శరణమయ్యప్ప=అనేకమైన సుగుణములకు నిలయమైన అయ్యప్పా నిన్ను
                                                                                                                               శరణుపొందుచున్నాను.
ఓం అలంకార ప్రియనే - శరణమయ్యప్ప= అలంకారమనిన ఇష్ఠపడు అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.
ఓం కన్నిమారై కార్పణ్యనే - శరణమయ్యప్ప= కన్నె స్వాములపై దయగల అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.
ఓం భువనేశ్వరనే - శరణమయ్యప్ప=సకల లోకములకు ప్రభుడ వైన అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.
ఓం మాతా పిత గురు దైవమే - శరణమయ్యప్ప=తల్లి,తండ్రి,గురువులే ప్రత్యక్ష దైవమని బోధించిన అయ్యప్పా నిన్ను
                                                                                                                               శరణుపొందుచున్నాను.
ఓం స్వామియున్ పుంగావానమే - శరణమయ్యప్ప= పుంగావనము అనబడు పూతోటలో విహరించు అయ్యప్పా నిన్ను
                                                                                                                               శరణుపొందుచున్నాను.
ఓం అళుదా నదియే - శరణమయ్యప్ప=అళుదా నదీ తీరమున విహరించిన అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.
ఓం అళుదా మేడే - శరణమయ్యప్ప= అళుదా మెట్టపై నడయాడిన అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.- 90 -
ఓం కళ్లిడుం కుండ్రమే - శరణమయ్యప్ప= అళుదా నదిలో తీసిన రాళ్లను పెట్టుచోట వున్న అయ్యప్పా నిన్ను
                                                                                                                               శరణుపొందుచున్నాను.
ఓం కరిమలై ఏట్రమే - శరణమయ్యప్ప= కరిమల శిఖరమున నడయాడిన అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.
ఓం కరిమలై ఇరక్కమే - శరణమయ్యప్ప= కరిమల దిగువన తిరుగాడిన అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.
ఓం పెరియాన వట్టమే - శరణమయ్యప్ప=  పెరియాన వట్టమనబడు పెద్ద సమతల ప్రదేశమున సంచరించిన   
                                                                                                         అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.
ఓం సిరియాన వట్టమే - శరణమయ్యప్ప= సిరియానవట్టము అనబడు చిన్న సమతల ప్రదేశమున తిరుగాడిన
                                                                                                        అయ్యప్పా నిన్ను శరణుపొందుచున్నాను.
ఓం పంబా నదియే- శరణమయ్యప్ప= పంబానదీ తీరమున పసిబాలునిగా వున్నఅయ్యప్పా నిన్నుశరణు
                                                                                                                                      పొందుచున్నాను                              
ఓం పంబయిల్ విళక్కే - శరణమయ్యప్ప= పంబానదిలో వెలిగించబడు జ్యోతియు నీవే అయ్యప్పా నిన్నుశరణు
                                                                                                                                      పొందుచున్నాను
ఓం నీలిమలై ఏట్రమే - శరణమయ్యప్ప= నీలిమల ఎగువన వున్న అయ్యప్పా నిన్నుశరణుపొందుచున్నాను
ఓం అప్పాచి మేడే - శరణమయ్యప్ప= అప్పాచిమేడు అను మెట్టపై సంచరించు అయ్యప్పా నిన్నుశరణు    
                                                                                                                                       పొందుచున్నాను
ఓం శబరి పీఠమే - శరణమయ్యప్ప = శబరి పీఠమున శబరి అను భక్తురాలికి శ్రీరామునిగా దర్శనమిచ్చిన
                                                                                             అయ్యప్పా నిన్నుశరణుపొందుచున్నాను   - 100 -
ఓం శరంగుత్తి ఆలే - శరణమయ్యప్ప= శరంగుత్తి వద్ద బాణమును వదలిన అయ్యప్పా నిన్నుశరణుపొందుచున్నాను
ఓం భస్మక్కుళమే - శరణమయ్యప్ప= భస్మక్కుళము వద్దనున్న అయ్యప్పా నిన్నుశరణుపొందుచున్నాను
ఓం పదునెట్టాం బడియే - శరణమయ్యప్ప= పద్దెనిమిది మెట్లపై నున్న అయ్యప్పా నిన్నుశరణుపొందుచున్నాను
ఓం నెయ్యభిషేక ప్రియనే - శరణమయ్యప్ప= నెయ్యభిషేకమనిన ఇష్ఠపడు అయ్యప్పా నిన్నుశరణుపొందుచున్నాను
ఓం కర్పూర జ్యోతియే - శరణమయ్యప్ప= కర్పూర కాంతిలో వెలుగొందు అయ్యప్పా నిన్నుశరణుపొందుచున్నాను
ఓం జ్యోతి స్వరూపనే - శరణమయ్యప్ప=జ్యోతిస్వరూపుడ వైన అయ్యప్పా నిన్నుశరణుపొందుచున్నాను
ఓం మకర జ్యోతియే - శరణమయ్యప్ప= మకర సంక్రాంతి రోజున కంపించు మకరజ్యోతి నీవే అయ్యప్పా
                                                                                                               నిన్నుశరణుపొందుచున్నాను
ఓం హరిహర సుతన్ ,ఆనంద చిత్తన్ , అయ్యనయ్యప్ప  స్వామియే . . . . . . శరణమయ్యప్ప = హరిహర సుతుడవు,
                                  ఆనంద చిత్తుడవైన అయ్యన్ అయ్యప్పస్వామి నిన్ను శరణు పొందుచున్నాను.   - 108 -


ధూపం. శ్లో॥ దశాంగం గుగ్గులోపేతం - సుగంధిం సుమనోహరం
                హరిహరసుత నమస్తుభ్యం - గృహాణ వరదో  భవ॥


         తాత్పర్యము : - హరిహరసుత అయ్యప్పా ,దశాంగం గుగ్గిలం మొదలైన సువాసనగల ద్రవ్యములతో మీకు
         ధూపము వేయుచు మీకు నమస్కరించున్నాను దయతో స్వీకరించి మా కోర్కెలు తీర్చ వలసినదిగా మాప్రార్ధన.


దీపం.   శ్లో॥ దీపం గృహాణ దేవేశ - ఘృతవర్తి సమన్వితం
               జ్ఞాన రూపాయ నిత్యాయ - నిర్మలాయ నమోస్తుతే॥


           దీపం గృహాణ = దీపమును స్వీకరించుము,  దేవేశ = దేవతలలో శ్రేష్ఠుడవైన అయ్యప్పా, ఘృతవర్తి
           సమన్వితం = ఆవు నేతితో కూడిన వత్తితో చేయబడిన ,  జ్ఞాన రూపాయ = జ్ఞానస్వరూపుడవైన , నిత్యాయ =
           శాశ్వితుడవైన , నిర్మలాయ = నిర్మలమైన ( నిష్కళంకమైన) , నమోస్తుతే = నిన్ను వేడుకుంటూ
           నమస్కరించు చున్నాను.


          తాత్పర్యము : - జ్ఞాన స్వరూపుడవైన , శాశ్వితుడవైన , నిర్మలమైన మనస్సుగల అయ్యప్పా, నిన్ను స్తుతిస్తూ
           నీకు నమస్కారము చేస్తూ ఆవునెయ్యితో కూడిన దీపమును సమర్పిస్తున్నాను. స్వీకరించుము.


నైవేద్యం. శ్లో॥ ఓం భూర్భువః సువః - తత్స వితుర్వరేణ్యం
                 భర్గో దేవస్య ధీమహి - ధీయో యోన ప్రచోదయాత్॥


ఆపోజ్యోతి రసోమృతం (పదార్దములపై నీటిని చిలకరిస్తూ)దేవ సవిత ప్రసువ , (పగలైతే)సత్యన్ - త్వర్తేన పరిషించామి , (రాత్రైతే) ఋతంత్వా సత్యేన పరిషించామి , అమృతమస్తు ,అమృతోపరణమసి స్వాహాః ॥
( మనలో పంచప్రాణ రూపములోనున్న స్వామికి ) ఓం ప్రాణాయ స్వాహాః ,ఓం అపానాయ స్వాహాః , ఓం వ్యానాయ స్వాహాః , ఓం ఉదానాయ స్వాహాః ఓం సమానాయ స్వాహాః, ఓం బ్రహ్మణే స్వాహాః , ఓం బ్రాహ్మణిమ ఆత్మామృతత్వాయ ( అంటూ నివేదిత పదార్ధములను స్వామికి  నివేదించాలి)మధ్యే మధ్యే అమృత తుల్య పానీయం సమర్పయామి. ఉత్తరా పోషనం సమర్పయామి, హస్త  ప్రక్ష్యాళయామి, పాద ప్రక్ష్యాళయామి ,


తాంబూలం .శ్లో॥ ఓం పూగీఫల సమాయుక్తం - నాగవల్లీ దళైర్యుతం
                           ముక్తాచూర్ణ సమ్యుక్తాన్ - తాంబూలం ప్రతి గృహ్యతాం ॥


          పూగీఫలం =పోకచెక్క (వక్క)  సమాయుక్తం = కూడుకుని ఉన్నటువంటి , నాగవల్లీ దళం = తమలపాకు ,                           
          ముక్తాచూర్ణం  = ముత్యములతో తయారు చేయబడిన సున్నం, తాంబూలం ప్రతి గృహ్యతాం =
           తాంబూలమును స్వీకరించండి.


        తాత్పర్యము : - స్వామీ  తమలపాకు,వక్క, ముత్యపు సున్నముతో కూడిన తాంబూలమును నీకు
        సమర్పిస్తున్నాను స్వీకరించండి


కర్పూర నీరాజనం. శ్లో॥ ఓం యఃజ్యోతి సర్వలోకానాం - తేజసాం తేజముత్తమం
                                    ఆత్మజ్యోతి పరంధామ - నీరాజన మిదం ప్రభో॥


      యఃజ్యోతి = ఈ జ్యోతి , సర్వలోకానాం =  అన్నిలోకములలోకెల్ల , తేజసాం = వెలుగులలో  కెల్ల , తేజముత్తమం =
      తేజం+ఉత్తమం = ఉత్తమమైన వెలుగుకల , ఆత్మజ్యోతి = నాఆత్మయను జ్యోతిని , పరంధామ = పరలోకమున
      (కైలాస) ఉండు,  నీరాజనం = హారతిని ,  మిదం ప్రభో = స్వీకరించు ప్రభూ


      తాత్పర్యము : - కైలాసమున ఉండు ప్రభో అయ్యప్పా సకల లోకములలో కెల్ల కాంతివంతమైన నా ఆత్మయను
      జ్యోతితో నీకు హారతి ఇచ్చుచున్నాను దీనిని స్వీకరించు ప్రభూ.


(మంగళ)హారతి . ( మంగళహారతి ఎవరికి వచ్చిన లేక ఎవరికి నచ్చిన పాటలు వారు పాడుతారు)
              శ్లో|| పంచాద్రీశ్వరి మంగళం - హరిహర ప్రేమాకృతే మంగళం
                  ఫించాలంకృత మంగళం - ప్రణమతాం  చింతార్మణే మంగళం
                   పంచాస్యా ధ్వజ మంగళం - త్రిజగత మాద్యాప్రభో మంగళం
                  పంచా స్త్రోపమ మంగళం - శృతి శిరోలంకార సన్మంగళం  


              తాత్పర్యము : - ఐదుకొండలపై కొలువున్న స్వామీ నీకు మంగళము. హరిహరుల ప్రేమస్వరూపుడ వైన
              నీకు మంగళము. పింఛమువలె తలపాగా అలంకరించ బడిన నీకు మంగళము.కోరిన కోర్కెలు తీర్చు
              చింతామణి వంటి వాడవైన స్వామి నీకు  నమస్కారము నీకు మంగళము. జెండాపై పులి చిహ్నము
              గలస్వామి నీకు మంగళము. ముల్లోకములు మూలమైన నీకు మంగళము.ఐదు వేదములలోను
               పురాణములలోను గొప్పగా పొగడ బడిన నీకు మంగళము.


ఓం రాజాధి రాజయ ప్రసహ్య సాహినే - నమో వయం - వై - శ్రవణాయ కుర్మహే
సమే  కామకామాయ మహ్యం - కామేశ్వరో -వై - శ్రవణో దదాతు
కుభేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః ॥


ఓం తత్పురుషాయ విద్మహే , వక్రతుండాయ ధీమహిః - తన్నోదంతి ప్రచోదయాత్
ఓం తత్పురుషాయ విద్మహే , మహా సేనాన్యే ధీమహిః - తన్నో షణ్ముఖ ప్రచోదయాత్
ఓం నారాయణాయ విద్మహే , వాసుదేవాయ ధీమహిః - తన్నో విష్ణు ప్రచోదయాత్
ఓం తత్పురుషాయ విద్మహే , మహాదేవాయ ధీమహిః - తన్నో రుద్ర ప్రచోదయాత్
ఓం భూతనాధయ విద్మహే , భవపుత్రాయ ధీమహిః - తన్నో శాస్తా ప్రచోదయాత్ ॥


ఆత్మ ప్రదక్షణ . ఓం యానికానిచ పాపాని , జన్మాంతర కృతానిచ
                         తానెతానె ప్రణశ్యంతి , ప్రదక్షణం పదేపదే
                         పాపోహం పాపకర్మాహం , పాపాత్మా పాప సంభవ
                          త్రాహిమాం కృపయాదేవ , శరణాగత వత్సల
                         అన్యధా శరణం నాస్తి , త్వమేవ శరణం మమ
                          తస్మాత్ కారుణ్య భావేన , రక్ష రక్ష మహేశ్వరా॥


    యానికానిచ పాపాని = తెలిసీ తెలియాక చేసిన పాపములు,  జన్మాంతర కృతానిచ = పూర్వజన్మలో చేసి నటువంటి,                          
    తానెతానె ప్రణశ్యంతి = వాటంతట అవే పూర్తిగా నశించి పావుగాక , ప్రదక్షణం పదేపదే = మళ్ళీ మళ్ళీ నీచుట్టు
    తిరుగు చున్నాను, పాపోహం = నేను పాపిని , పాపకర్మాహం = పాపకర్మలు( చెడు పనులు ) చేసిన వాడిని ,
    పాపాత్మా = పాప చింతన కలిగిన కలిగిన వాడిని , పాప సంభవ = పాపము నుండి పుట్టిన వాడిని,  త్రాహిమాం =
     నన్ను రక్షిం చుము,  కృపయాదేవ = ఓ దేవా దయతో , శరణాగత = శరణన్న వారిని , వత్సల = నీ బిడ్డవలె
     కాపాడువాడా, అన్యధా = వేరెవ్వరిని , శరణం నాస్తి = శరణు కోరుట లేదు, త్వమేవ శరణం మమ = నీవే నాకు
     దిక్కు, తస్మాత్ = కాబట్టి, కారుణ్య భావేన = దయగల మనసుతో , రక్ష రక్ష మహేశ్వరా = ఈశ్వరుని కుమారా
     నన్ను రక్షించుము.


     తాత్పర్యము: - తెలిసీ తెలియక ఈజన్మలో గాని గతజన్మలోగానీ నేను చేసిన పాపములు వాటంతట అవే ( నేను
     అనుభవించ కుండా) పోవుటకై నేను నీ చుట్టూ ( తిరుగు చున్నాను) ప్రదక్షిణలు చేస్తూవున్నాను నేను పాపిని,
     పాపకర్మలు చేసిన వాడిని, పాప చింతన కలవాడిని , నిన్ను శరణు వేణు చున్నాను, నీవే తప్ప నాకు వేరే  దిక్కు
       లేదు, కనుక ఈశ్వర కుమారుడా శరణాగత వత్సలుడవైన నీవు నన్ను దయతో రక్షించుము.


క్షమాపణ .       ఆవాహనం నజానామి - న జామి విసర్జనం
                     పూజావిధం నజానామి - క్షమస్వ పురుషోత్తమ
                    మంత్ర హీనం క్రియా హీనం - భక్తిహీనం శబరీశ్వర
                    యత్పూజితం మయా దేవం , పరిపూర్ణం తదస్తుమే ||


       ఆవాహనం = ఆహ్వానించుట ( రమ్మని పిలుచుట ),నజానామి = నాకుతెలియదు, విసర్జనం =      
       పొమ్మనుట , పూజావిధం = పూజచేసే పద్దతి, క్షమస్వ పురుషోత్తమ = ఓ స్వామీ నన్ను మన్నించుము.
       మంత్ర హీనం = నాకు మంత్రములు రావు, క్రియా హీనం = విధివిధానాలు తెలియవు  , భక్తిహీనం = భక్తి లేని
       వాడిని యత్పూజితం మయా = నేను చేసిన ఈ పూజనే , పరిపూర్ణం = పూర్తిపూజగా భావించి , తదస్తుమే =
       తృప్తి నొందుము.

       తాత్పర్యము : - స్వామీ నాకు మంత్రములు రావు, నాకు భక్తి అంటే పెద్దగా తెలియదు. నిన్ను రమ్మనడం
       ( ఆహ్వానించడం ) రాదు, నిన్ను పొమ్మనడం ( ఉద్వాసన ) రాదు, నిన్ను పూజించే పద్ధతులు తెలియవు,
       అయినా నీవు శరణాగత వత్సలుడవు గనుక, నేను చేసిన ఈ చిన్ని పూజను పరిపూర్ణమైన పూజగా
       భావించి తృప్తినొంది నన్ను అనుగ్రహించుమో అయ్యప్పస్వామీ .  


ప్రార్ధన ( వేడుకొనుట )
                మన్మయా భక్తి  యుక్తేన - పత్రం పుష్పం ఫలం జలం
                నివేదితం చ నైవేద్యం - తద్ గృహాణ మమ కంబయా ॥


మన్మయా = మన్ + మయా = దేనినైతే నాయొక్క , భక్తి  యుక్తేన = తెలిసినంత వరకు భక్తితో , పత్రం పుష్పం ఫలం జలం = ఆకులు,పూలు, పండ్లు, నీరు ,  నివేదితం చ = నివేదించ బడిన , నైవేద్యం = నైవేద్యమును , తద్ గృహాణ = వాటిని స్వీకరించుము, మమ = నాయొక్క ( నాకు) , కంబయా = ( స్తంభము వలె ) నాకు ఆధారభూతుడవైన.

            తాత్పర్యము : - నాకు ఆధారభూతుడ వైన ఆయప్పస్వామీ , నాకు తెలిసినంత వరకు , నాకు లభించిన  
            ఆకులు( పత్రములు), పూలు, పండ్లు, నీటిని నీకు భక్తితో సమర్పిస్తున్న నైవేద్యమును స్వీకరించుము.
     
               రూపం దేహి , జయందేహి - యశోదేహి ద్వివోజహి
               ఈప్సితం మే వరం దేహి - పరధర్మ పరాంగతిం ॥


రూపం దేహి = అందమైన దేహము (ఆరోగ్యము)నిమ్ము,, జయందేహి = విజయమును చేకూర్చుము, యశోదేహి = కీర్తిని కలుగజేయుము, ఈప్సితం = మనోవాంఛ ( కోరిక) లను,  మే వరం దేహి = నెరవేరు నట్లు వరమునిమ్ము , పరధర్మ = వేద ధర్మములను, పరాంగతిం = మోక్షమును ప్రసాదించుము.


         తాత్పర్యము : - స్వామీ నాకు మంచి ఆరోగ్యముగల దేహమును, విజయమును, కీర్తిని ప్రసాదించుము.
         నాకోరికలు నెరవేరు నట్లు వరము నిమ్ము నాకు వేద ధర్మములను అనుగ్రహించి మోక్షమును ప్రసాదించుము.


               పుత్రాన్ దేహి , ధనం  దేహి - సర్వాన్ కామాంశ్చ దేహిమే
               దేహి శాంతి మవిశ్చిన్నాం - సర్వ తత్వార్ధ దర్శనం ॥
              
పుత్రాన్ దేహి = మంచి గుణవంతులైన కుమారుల నిమ్ము,, ధనం  దేహి = ఐశర్యమును ప్రసాదించుము, సర్వాన్ కామాంశ్చ దేహిమే = సకల కోరికలు తీర్చుము,  దేహి శాంతి = శాంతిని ప్రసాదించుము, మవిశ్చిన్నాం = చెడిపోనటు వంటి ( నాశనము లేనటు వంటి), సర్వ తత్వార్ధ దర్శనం =  తత్వముల అర్థమును అనుగ్రహించుము ( అన్ని తత్వములను అర్ధము చేసుకునే జ్ఞానమును ప్రసాదించుము).


            తాత్పర్యము : - స్వామీ సత్పుతృలను ( మంచిగుణములు కల కుమారులను) ప్రసాదించుము. నా సకల
            కోర్కెలను తీర్చుము. మనశ్శాంతిని ప్రసాదించుము. నాశనము లేనటువంటి వేద తత్వార్ధములను
            అనుగ్రహించుము.


          గతం పాపం , గతం దుఖఃం - గతం దారిద్ర్య మేవచ
          ఆగదా సుఖః ,సంపత్తి - అమోహాత్ తవ దర్శనం ॥


గతం పాపం = నేను చేసిన పాపములను పరిహరించుము, గతం దుఖఃం =దుఖఃమును ( బాధలను ) లను పోగొట్టుము, గతం దారిద్ర్య = దరిద్రమును పోగుట్టుము, మేవచ = వీటన్నిటిని పోగొట్టుము . ఆగదా = రానిమ్ము ( ప్రసాదించుము), సుఖః సంపత్తి = సుఖమును సంపదను , తవ దర్శనం = నీయొక్క దర్శనముచే .


         తాత్పర్యము : - స్వామీ నిన్ను దర్శించి నంతనే నేనుచేసిన పాపములు, నా దుఖఃమును, నాబాధలను, నా
        దరిద్రమును, వీటన్నిటిని పోగొట్టి నాకు సుఖమును సంపదను,మరల మరల నిన్ను దర్శించు భాగ్యమును
         అనుగ్రహించుము


జ్ఞానముతోను అజ్ఞానముతోను తెలిసి తెలియక నేను చేసిన తప్పులను ఒప్పులుగా భావించి, నన్ను మన్నించి క్షమించి కాపాడవలెను. సత్యమగు అష్ఠాదశ సోపానములపై చిన్ముద్ర దారిగా అమరియుండి ,సకల లోకములను సకల ప్రాణులను కాపాడు, హరిహరసుతుడైన అయ్యన్ అయ్యప్పస్వామి  వారి పాదార  విందములే మాకు శరణం , శరణం శరణ మయ్య్ ......... ప్ప . ఓం స్వామియే  ...... ...... ...... ...... ...... ...... ......  ...... ......శరణమయ్యప్ప .
              ఓం శాంతి ......... ..................   ఓం శాంతి ......... ......... ......... ఓం శాంతి  


అనయా పూజయా శ్రీ హరిహరపుత్ర స్వరూప ధర్మశాస్తా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు.
                                                                                                              ఓం ఏతత్సర్వం బ్రహ్మార్పణ మస్తు.
అనయా ధ్యాన ఆవాహనాది షోడషోపచార పూజయా భగవాన్ సర్వాత్మక శ్రీ అయ్యప్పస్వామి
                                                                                                             సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు.
           ఓం స్వామియే  …. ....... శరణమయ్యప్ప . అయ్యప్ప నిత్య సాధారణ లఘుపూజ సంపూర్ణం.




                             

No comments:

Post a Comment