A.S.N.P
ఓం స్వామియే శరనమయ్యప్ప
అయ్యప్పనిత్య (సాధారణ) లఘుపూజ అర్ధ తాత్పర్య సహితము.
పీఠిక
స్వామిశరణం . అయ్యప్ప స్వామివారి పూజ స్వామిభక్తులు ప్రతినిత్యం చేసుకుంటూనే వుంటారు. భక్తులు వారివారి అనుభవాన్ని బట్టి ఎవరు చేసుకునే ప్రకారం వారు చేసుకుంటూనే వుంటారు. నేను చేసుకునే పద్దతి , ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి , కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి, స్వామివారికి అలంకారము చేసి , పూజచేసి , తీర్ధ ప్రసాదములు స్వీకరించిన తర్వాతనే నిత్య కృత్యములలో పాల్గొంటాను. (ఇందులో ప్రత్యేకత ఏముంది , ఎవరు చేసినా అంతేకదా అనుకునే ఆస్కారము వుంది కదా , అందుకని “అయ్యప్పనిత్య (సాధారణ )లఘుపూజ అర్ధ తాత్పర్య సహితము” అని వ్రాయుచున్నాను. ఇది పీఠిక కనుక అలా వ్రాయుచున్నాను. నేను ఇలా వ్రాసినందుకు విజ్ఞులు నన్ను క్షమించ వలసినదిగా ప్రార్ధన. అన్యధా భావించకండి). పూజలో గణపతి , కుమారస్వామి , సకలదేవతా ప్రార్ధన , అయ్యప్పకు షోడషోపచార (ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం , అర్ఘ్యం , ఆచమనీయం , స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, చందనం, కుంకుమ, పుష్పములు , పూలమాల ) పూజ , స్వామివారి అంగపూజ , శరణుఘోష ఉత్తరంగా పూజగా ధూపం , దీపం , నైవేద్యం , తాంబూలం, హారతి, క్షమాపణ , తీర్ధ ప్రసాద స్వీకరణ చేస్తాము. పూజమొత్తం 30 నిమిషాలలో పుర్తౌతుంది. ఇంత త్వరగా పూజచేస్తే ఎంత ఫలితం ఉటుందండీ కాని చేసే పూజలోని శ్లోకాలు, పద్యాలు మనము దేనినైతే ఉచ్చరిస్తున్నామో దానియొక్క అర్ధం తెలుసుకొని ,మననం చేసుకుంటూ చేస్తే “విత్తనంబు మర్రి వృక్షంబునకు ఎంత “ అన్నట్లుగా , మర్రిచెట్టు గింజ చాలా సూక్ష్మంగా వుంటుంది. దానికి అదను రాగానే మొలకెత్తి మహావృక్షమైనట్లుగా ,మంత్రార్ధమును మననము చేసుకుంటూ పూజచేస్తే ఫలితం అధికంగా వుంటుంది. మనము చదివే మంత్రార్ధము భావము తెలుసుకున్నట్లైతె , ఆమంత్రానికి శ్లోకానికి సంభందించిన ఆ దేవతయొక్క రూపలావణ్యములు,గుణ గణములు , వారికి ఎవరితో ఎలాంటి సంభందము వున్నది, మనకు ఆదేవతా స్వరూపము కన్నులకు కట్టినట్లుగా అనిపిస్తుంది. మన మనస్సుకు ఆదేవునిపై ఏకాగ్రతతో పూజచేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఏకాగ్రతత్ చేసే పూజకు ఫలితం ఎక్కువగా వుంటుంది. కనుక నేనుచేయు “అయ్యప్ప నిత్య (సాధారణ ) లఘు పూజ” కు అర్ధ తాత్పర్యములను వ్రాయుచున్నాను. నాకు తెలిసిన దానిని తోటివారికి పంచి , వారికి తెలిసిన దానిని వారి నుండి గ్రహించుటయే నాకు ఆనందము. నేను చేసిన ఈ చిన్ని ప్రయత్నములో నాకు తెలియక తెలియక చేసిన పొరపాట్లను , దీనిని చదివిన మీరు (పాఠకులు) నాకుచేసే సూచనలను తప్పక పాటిస్తానని మనవి చేసుకుంటున్నాను. “ కవితా కన్యకా గుణములు - కవికన్న రసజ్ణుడెరుగు , కవియేమెరుగున్ “ అన్నట్లుగా , నేనువ్రాసిన తప్పులు నాకు తెలియవు. రసజ్ఞులైన మీరు నాకు తెలియజేయ వలసినదిగా ప్రార్ధన. స్వామిశరణం .
మీ
బుధజన విధేయుడు
పూర్ణా పుష్కళాంబా సమేత శ్రీధర్మశాస్తా
హరిహరసుత అయ్యప్ప సేవార్ధి
వోరుగంటి నాగభూషణం గురుస్వామి.
మెయిన్ రోడ్ గరిడేపల్లి , పోస్ఠ్ &మం . గరిడేపల్లి
జిల్లా నల్లగొండ . సెల్. 9966518098
ఓం స్వామియే శరణమయ్యప్ప
అయ్యప్ప నిత్య (సాధారణ)లఘుపూజ.
ధ్యానం : - ఓం శుక్లాంబర ధరం విష్ణుం - శశి వర్ణం చతుర్భుజం
పసన్న వదనం ధ్యాయేత్ - సర్వ విఘ్నోపశాంతయే ॥
దీప ప్రజ్వలనం - ఓం దీపం జ్యోతి పరబ్రహ్మం - దీపం కురు తమోపహం
దీపేన సాధ్యతే సర్వం - సదా (సంధ్యా) దీపం నమోస్తుతే ॥
సాంబ్రాణి కడ్డీలు వెలిగించుట : - ఓం ఫాలనేత్ర సుతం దేవం - కలిదోష నివారణం
బాలరూపం లోకనాధం - నమామి శబరీశ్వరం ॥
హస్త ప్రక్ష్యాళయ ( చేతులు కడుగు కొనాలి )
ఆచమ్యః (ఆచమనము చేయాలి. కేశవనామాలు పఠించాలి)
ఓం కేశవాయ స్వాహాః , ఓం నారాయణాయ స్వాహాః , ఓం మాధవాయ స్వాహాః , ఓం గోవిందాయ నమః , ఓం విష్ణవే నమః , ఓం మధుసూదనాయ నమః , ఓం త్రివిక్రమాయ నమః , ఓం వామనాయ నమః , ఓం శ్రీధరాయ నమః , ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః ,ఓం దామోదరాయ నమః , ఓం సంకర్షణాయ నమః , ఓం వాసుదేవాయ నమః , ఓం ప్రద్యుమ్నాయ నమః , ఓం అనురుద్దాయ నమః , ఓం పురుషోత్తమాయ నమః , ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః , ఓం జనార్ధనాయ నమః , ఓం ఉపేంద్రాయ నమః , ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.
సంకల్పం.
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా , శ్రీ పరమేశ్వర ముద్దిశ్య , పరమేశ్వర ప్రీత్యర్ధం , శ్రీ హరిహరసుత అయ్యప్ప ప్రీత్యర్ధం , శ్రీ పూర్ణా పుష్కలాంబా సమేత శ్రీ ధర్మశాస్తా ప్రీత్యర్ధం , శుభ శోభన ముహూర్తే ఆధ్య బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే , శ్వేత వరాహ కల్పే, వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రధమ పాదే , జంబూ ద్వీపే , భరత వర్షే , భరత ఖండే , మేరోర్దక్షిణ దిగ్భాగే , శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే , కృష్ణ కావేర్యో మధ్యప్రదేశే ,స్వగృహే , లక్ష్మీ నివాస గృహే ,హరిహర గురు చరణ సన్నిధౌ , అస్మిన్ వర్తమానేన షష్ట్యబ్ధ్యాం మధ్యే , వ్యావహారిక చాంద్రమానేన ......... నామ సంవత్సరే , ........ ఆయనే , ....... ఋతౌ , ........ మాసే , ........ పక్షే , ....... తిధౌ , ........ వాసరే , శుభ యోగే , శుభ కరణే , ఏవంగుణ విశేషణ , విశిష్ట యాం , శుభ తిధౌ , అస్య యజమానస్య ( ఇచ్చట పూజ చేసేవారి లేక పూజ చేయించు కొనే వారి గోత్ర నామాదులు చెప్పాలి)........ గోత్రోద్భవస్య ....... నామధేయస్య , ధర్మపత్ని ...... నామ్నీం సమేతస్య ,అస్మాకం సహా కుటుంబానాం , సహా బంధూనాం క్షేమ , స్థైర్య , ధైర్య , వీర్య , విజయ , అభయ , ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం , ధర్మ అర్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిధ్యర్ధం , మనో వాంఛా ఫల సిధ్యర్ధం , అయ్యప్పస్వామి కరుణా కటాక్ష సిధ్యర్ధం ( ఇంకను మనము చేసే పనిని బట్టి మన కోరికలు స్వామికి నివేదించుకొన వచ్చును ). యధా ధ్యాన ఆవాహనాది షోడషోప చార పూజాం కరిష్యే ( అవసరాన్ని బట్టి మనము ఇంకను ఏమేమి పూజలు చేయ దలచు కున్నామో చెప్పవచ్చును). తదాధౌ మహా గణపతి పూజాం కరిష్యే .
గణపతి స్తోత్రం .
ఓం శుక్లాంబర ధరం విష్ణుం - శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ - సర్వ విఘ్నోప శాంతయే ॥
అగజానాన పద్మార్కం - గజానన మహర్నిశం
అనేక దం తం భక్తానాం - ఏక దంత ముపాస్మహే ॥
గజాననం భూత గణాధి సేవితం - కపిథ్దం జంబూఫల సారబక్షణం
ఉమాసుతం శోకవినాశ కారణం - నమామి విఘ్నేశ్వర పాద పంకజం ॥
ఓం సుముకశ్చైక దంతస్య - కపిలో గజకర్ణికః ।
లంబోరశ్చ వికటో - విఘ్నరాజో గణాధిపః ।
ధూమకేతు ర్గణాద్యక్షో - ఫాల చంద్రో గజాననః।
వక్రతుండ శుర్పకర్ణ - హేరంభ స్కంద పూర్వజః ॥
సుబ్రమణ్య స్తోత్రం.
ఓం శక్తిహస్తం విరూపాక్షం - శిఖివాహన షడాననం
తారుణం రిపు రోగఘ్నం - భావయే కుక్కుట ధ్వజం ॥
ఓం గాంగేయం వహ్నిగర్భం - శరవణ జనితం , జ్ఞాన శక్తిం కుమారం
బ్రహ్మణ్యం స్కందదేవం గుహ - మమలగుణ యతిం , రుద్రతేజ స్వరూపం
సేనాన్యం తారకఘ్న గురు - మచల యతిం , కార్తికేయం షడాననం
సుబ్రణ్యం మయూర ధ్వజ - రధ సహితం దేవ దేవం నమామి ॥
శ్రీ కృష్ణ స్తోత్రం తేజ
ఓం వసుదేవ సుతం దేవం - కంస చాణూర మర్ధనం
దేవకీ పరమానందం - కృష్ణం వందే జగద్గురుం ॥
సాయిబాబా స్తోత్రం
ఓం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ - సుధా త్రావిణం త్రిక్త్య మవ్య ప్రియంతం
తరుం కల్పవృక్షాధికం సాధయంతాం - నమామీశ్వరం సద్గురుం సయినాధం ॥
లక్ష్మీకుభేర స్తోత్రం
ఓం రాజాధి రాజయ ప్రసహ్య సాహినే - నమో వయం వైశ్రవణాయ కుర్మహే
సమె కామాన్ కామకామామహ్యం - కామేశ్వరో వైశ్రవణో తదాతు
కుభేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః ॥
శివ స్తోత్రం
ఓం వందే శంబు ముమాపతిం - సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరం - వందే పశూణాం పతిం
వందే సూర్య శశాంక వహ్ని నయనం - వందే ముకుందప్రియాం
వందే భక్త జనాశ్రయంచ వరదం - వందే శివం శంకరం॥
దేవీ స్తోత్రం
ఓం సర్వ మంగళ మాంగల్యే - శివే సర్వార్ధ సాధకే
శరణ్యే త్ర్యంబకీ దేవీ - నారాయణి నమోస్తుతే॥
విష్ణు స్తోత్రం
ఓం శాంతాకారం భుజగ శయనం - పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం - మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమల నయనం - యోగిహృధ్యాన గమ్యం
వందే విష్ణుం భవభయ హరం - సర్వలోకైక నాధం ॥
లక్ష్మీదేవి స్తోత్రం
ఓం లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం - శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం - లోకైక దీపాంకురాం ।
శ్రీమన్మంద కటాక్ష లబ్ధవిభవాం - బ్రహ్మేంద్ర గంగాధరం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం - వందే ముకుంద ప్రియాం ॥
శ్రీరామ స్తోత్రం
ఓం శ్రీరాఘవం దశరధాత్మజ మప్రమేయం - సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజాను భాహుం అరవింద దళాయతాక్షం - రామం నిశాచర వినాశకరం నమామి॥
ఆంజనేయ స్తోత్రం
ఓం మనోజవం మారుతతుల్య వేగం - జితేంద్రియం బుద్దిమతాం పరిష్థం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం - శ్రీరామ దూతం శిరసా నమామి॥
నవగ్రహ స్తోత్రం
ఓం ఆదిత్యాయ చ సోమాయ - మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిబ్యశ్చ - రాహువే కేతువే నమః॥
సరస్వతి స్తోత్రం
ఓం యాకుందేందు తుశారహార వదనా - యాశుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వర మండిత కరా - యాశ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర - ప్రభృతి సదా పూజితా
సామంపాతు సరస్వతీ భగవతీ - పూర్ణేందు బింబాననా॥
గురు వందనం
ఓం గురుః బ్రహ్మ గురుర్విష్ణు - గురుదేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ - తస్మై శ్రీగురవే నమః ॥
అజ్ఞాన తిమిరాంధస్య - జ్ణానాంజన శలాకయా
చక్షుర్మీలితం యేన - తస్మై శ్రీహురవే నమః॥
( చంద్రమౌళి గురుస్వామినే (గురు దేవేభ్యో ) నమః ). ఇచ్చట ఎవరి గురువుగారి పేరు వారు చెప్పు కుంటారు.
అయ్యప్ప పూజ
ధ్యానం . ఓం అఖిల భువన దీపం , భక్త చిత్తాబ్జ సూనం
సురగణ ముని సేవ్యం , తత్వమస్యా లక్ష్యం
హరిహర సుతమీశం , తారక బ్రహ్మరూపం
శబరిగిరి నివాసం భావయే భూతనాధం॥
ఆవాహనం . శ్లో॥ అగచ్చన్ భగవన్ దేవ - స్థానేచాత్ర స్థిరోభవ
యావత్పూజాం కరిష్యేహం - స్థావత్వం సన్నిధిం వస ॥
ఆసనం. శ్లో॥ నానావర్ణ సమాయుక్తాన్ - పుష్ప గంధైశ్చ భూషితం
ఆసనం దేవదేవేశ - ప్రీత్యర్ధం ప్రతి గృహ్యతాం॥
పాద్యం. శ్లో॥ భూతనాధ నమస్తేస్తు - నరకార్ణవ తారక
పాద్యం గృహాణ దేవేశ - మామ సౌఖ్యం వివర్ధయ॥
అర్ఘ్యం . శ్లో॥ వ్యక్తావ్యక్త స్వరూపాయ - హృశీకేశాయతే నమః
మయా నివేదితో భక్త్యా - అర్ఘ్యోయం ప్రతిగృహ్యతాం ॥
ఆచమనీయయం. శ్లో॥ మందాకినీ సమం వారి - తాప పాపహరం శుభం
దధినం కల్పితం దేవ - సమ్యకాశ ద్వుతాం త్వయా॥
స్నానం (స్నాపనము). శ్లో॥ ఓం గంగైచ యమునై చైవ - కృష్ణా గోదావరీ సరస్వతి
నర్మదా సింధు కావేరీ - జలేస్మిన్ సన్నిధిం కురు॥
సర్వే సముద్రా సరితా - తీర్ధానిచ నడ హ్రదా
`ఆయాంతు దేవ పూజార్ధం - మామ దురిత క్షయ కారక॥
నానానదీ సమానీతం - సువర్ణకలశ స్థితం
శుద్దోదకేన సుస్నానం - కర్తవ్యం హరి నందన॥
వస్త్రం . శ్లో॥ వేదసూక్తం సమాయుక్తం - యజ్ఞసామ సమన్వితం
సర్వవర్ణ ప్రదేదేవ - వాసాంసి ప్రతి గృహ్యతాం॥
యజ్ణోపవీతం. శ్లో॥ బ్రహ్మ విష్ణు మహేశైశ్చ - నిర్మితం బ్రహ్మసూత్రకం
గృహాణ సర్వ వరద - ధర్మశాస్తా నమోస్తుతే॥
గంధం (చందనం). శ్లో॥ శ్రీగంధ చందనం దివ్యం - గంధాద్యం సుమనోహరం
విలేపన సురశ్రేష్థ - చందనం ప్రతి గృహ్యతాం॥
కుంకుమ. శ్లో॥ హరిద్రా చూర్ణ సమాయుక్తం - కుంకుమం క్షేమదాయకం
నానా పరిమళం దివ్యం - గృహాణ గుణభూషణ ॥
అక్షతలు . శ్లో॥ అక్షతాన్ తండులాన్ శుబ్రాన్ - కుంకుమేన విరాజితం
హరిద్రాచూర్ణ సమ్యుక్తాం - గృహాణ మరవందిత॥
పుష్పాణి ( పుష్పములు). శ్లో॥ మల్లికాని సుగంధీని - మాలత్యాదీనివై ప్రభో
మయా హృతాని పూజార్ధం - పుష్పాణి ప్రతి గృహ్యతాం॥
పుష్పమాల . శ్లో॥ జాజీ చంపక పున్నాగ - మల్లికా మాలతీ కృతాం
పుష్పమాలా సుగందాధ్యాం - గృహత్వాలం కురుప్రభో॥
అయ్యప్పస్వామి అంగపూజ
ఓం శ్రీ పంపా బాలయ నమః - పాదౌ పూజయామి
ఓం గుహ్యాతి గుహ్య గోప్త్రే నమః - గుల్ఫం పూజయామి
ఓం అంకుశ ధరాయ నమః - ఝంగే పూజయామి
ఓం జగన్మోహనాయ నమః - జానునీ పూజయామి
ఓం ఉద్దాన వైభవాయ నమః - ఊరూ పూజయామి
ఓం ఖండేందు మౌళి తనయాయ నమః - కటిం పూజయామి
ఓం హరిహర పుత్రాయ నమః - గుహ్యం పూజయామి
ఓం దక్షిణామూర్తి రూపకాయ నమః - నాభిం పూజయామి
ఓం వరదాన కీర్తయే నమః - ఉదరం పూజయామి
ఓం త్రిలోక రక్షకాయ నమః - వక్ష స్థలం పూజయామి
ఓం మణిపూరాబ్జ నిలయాయ నమః - పార్శౌ పూజయామి
ఓం పాశహస్తాయ నమః - హస్తాన్ పూజయామి
ఓం మంత్ర రూపాయ నమః - హృదయం పూజయామి
ఓం వజ్రమాల ధరాయ నమః - కంఠం పూజయామి
ఓం సూర్యకోటి సమప్రభాయ నమః - ముఖం పూజయామి
ఓం గ్రామ పాలకాయ నమః - కపోలౌ పూజయామి
ఓం తీక్ష్ణ దంతాయ నమః - దంతాన్ పూజయామి
ఓం కారుణ్యామృత లోచనాయ నమః - నేత్రే పూజయామి
ఓం రత్నకుండల దారినే నమః - కర్ణౌ పూజయామి
ఓం లాస్య ప్రియాయ నమః - లలాటం పూజయామి
ఓం శివప్రియాయ నమః - శిరః పూజయామి
ఓం జటామకుట దారినే నమః అలాకాన్ పూజయామి
ఓం హరిహర పుత్ర స్వరూప ధర్మశాస్త్రే నమః సర్వాంగ పూజన్ సమర్పయామి
గురూపదేశ మంత్రము
(ప్రతిరోజు గురూపదేశ మంత్రమును 108 లేక కనీసం 18 సార్లైనా జపించాలి108 సార్లైతే శ్రేష్థం )
శరణు ఘోశ
ఓం స్వామియే శరణమయ్యప్ప
ఓం హరిహరసుతనే శరణమయ్యప్ప
ఓం ఆపద్భాంధవనే శరణమయ్యప్ప
ఓం అనాధ రక్షకనే శరణమయ్యప్ప
ఓం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప
ఓం అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప
ఓం అయ్యప్పనే శరణమయ్యప్ప
ఓం ఆర్యంగావు అయ్యవే శరణమయ్యప్ప
ఓం అచ్చన్ కోవెల్ అరసే శరణమయ్యప్ప
ఓం కుళుత్తుపుళ బాలకనే శరణమయ్యప్ప - 10 -
ఓం ఎరుమేలి ధర్మశాస్తావే శరణమయ్యప్ప
ఓం వావర్ స్వామియే శరణమయ్యప్ప
ఓం కన్నిమూల గణపతి భగవానే శరణమయ్యప్ప
ఓం నాగరాజావే శరణమయ్యప్ప
ఓం మాలిగాపురోత్తమ లోక మంజుమాతావే శరణమయ్యప్ప
ఓం కరుప్ప స్వామియే శరణమయ్యప్ప
ఓం సేవిప్పర్ కానందమూర్తయే శరణమయ్యప్ప
ఓం కాశీ వాసియే శరణమయ్యప్ప
ఓం హరిద్వార్ నివాసియే శరణమయ్యప్ప
ఓం శ్రీరంగపట్టణ వాసియే శరణమయ్యప్ప - 20 -
ఓం కరపత్తూర్ వాసియే శరణమయ్యప్ప
ఓం గరిడేపల్లి ధర్మశాస్తావే శరణమయ్యప్ప
ఓం సద్గురు నాధనే శరణమయ్యప్ప
ఓం విల్లాడి వీరనే శరణమయ్యప్ప
ఓం వీరమణి కంఠనే శరణమయ్యప్ప
ఓం ధర్మశాస్తావే శరణమయ్యప్ప
ఓం కాంతిమల వాసయే శరణమయ్యప్ప
ఓం పొన్నంబల వాసనే శరణమయ్యప్ప
ఓం శరణఘోష ప్రియనే శరణమయ్యప్ప
ఓం పంబాశిశువే శరణమయ్యప్ప - 30 -
ఓం పందళ రాజకుమారనే శరణమయ్యప్ప
ఓం వావరిన్ తోళునే శరణమయ్యప్ప
ఓం మోహినీ సుతనే శరణమయ్యప్ప
ఓం కళ్కండ దైవమే శరణమయ్యప్ప
ఓం కలియుగ వరదనే శరణమయ్యప్ప
ఓం సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తయే శరణమయ్యప్ప
ఓం మహిషి మర్ధననే శరణమయ్యప్ప
ఓం పూర్ణపుశ్కళ నాదనే శరణమయ్యప్ప
ఓం వన్ పులి వాహననే శరణమయ్యప్ప
ఓం భక్త వత్సలనే శరణమయ్యప్ప - 40 -
ఓం భూలోక నాధనే - శరణ మయ్యప్ప
ఓం అయిందు మలైవాసనే - శరణమయ్యప్ప
ఓం శబరి గిరీశనే - శరణమయ్యప్ప
ఓం యిరుముడి ప్రియనే - శరణమయ్యప్ప
ఓం అభిషేక ప్రియనే - శరణమయ్యప్ప
ఓం వేద ప్పొరుళే - శరణమయ్యప్ప
ఓం శుద్ధ బ్రహ్మ చారియే - శరణమయ్యప్ప
ఓం సర్వ మంగళ దాయకనే - శరణమయ్యప్ప
ఓం వీరాధి వీరనే - శరణమయ్యప్ప
ఓం ఓంకార ప్పొరుళే - శరణమయ్యప్ప - 50 -
ఓం ఆనంద రూపనే - శరణమయ్యప్ప
ఓం భక్త చిత్తాధి వాసనే - శరణమయ్యప్ప
ఓం ఆశ్రిత వత్సలనే - శరణమయ్యప్ప
ఓం భూత గణాధి పతయే - శరణమయ్యప్ప
ఓం శక్తి రూపనే - శరణమయ్యప్ప
ఓం శాంత మూర్తియే - శరణమయ్యప్ప
ఓం పదునెట్టాంబడిక్కి అధిపతియే - శరణమయ్యప్ప
ఓం ఉత్తమ పురుషనే - శరణమయ్యప్ప
ఓం రుషికుల రక్షకనే - శరణమయ్యప్ప
ఓం వేద ప్రియనే - శరణమయ్యప్ప - 60 -
ఓం ఉత్తరా నక్షత్ర జాతకనే - శరణమయ్యప్ప
ఓం తపో దాననే - శరణమయ్యప్ప
ఓం ఎంగళ్ కుల దైవమే - శరణమయ్యప్ప
ఓం జగన్మోహననే - శరణమయ్యప్ప
ఓం మోహన రూపననే - శరణమయ్యప్ప
ఓం మాధవ సుతనే - శరణమయ్యప్ప
ఓం యదుకుల వీరనే - శరణమయ్యప్ప
ఓం మామలై వాసనే - శరణమయ్యప్ప
ఓం షణ్ముఖ సోదరనే - శరణమయ్యప్ప
ఓం వేదాంత రూపనే - శరణమయ్యప్ప. - 70 -
ఓం శంకర సుతనే - శరణమయ్యప్ప
ఓం శతృ సంహారనే - శరణమయ్యప్ప
ఓం సద్గుణ మూర్తయే - శరణమయ్యప్ప
ఓం పరా శక్తియే - శరణమయ్యప్ప
ఓం పరాత్పరనే - శరణమయ్యప్ప
ఓం పరంజ్యోతియే - శరణమయ్యప్ప
ఓం హోమ ప్రియనే - శరణమయ్యప్ప
ఓం గణపతి సొదరనే - శరణమయ్యప్ప
ఓం రక్త విలోచనే - శరణమయ్యప్ప
ఓం విష్ణు సుతనే - శరణమయ్యప్ప - 80 -
ఓం సకల కళా వల్లభనే - శరణమయ్యప్ప
ఓం లోక రక్షకనే - శరణమయ్యప్ప
ఓం అమిత గుణాకరనే - శరణమయ్యప్ప
ఓం అలంకార ప్రియనే - శరణమయ్యప్ప
ఓం కన్నిమారై కార్పణ్యనే - శరణమయ్యప్ప
ఓం భువనేశ్వరనే - శరణమయ్యప్ప
ఓం మాతా పిత గురు దైవమే - శరణమయ్యప్ప
ఓం స్వామియున్ పుంగావానమే - శరణమయ్యప్ప
ఓం అళుదా నదియే - శరణమయ్యప్ప
ఓం అళుదా మేడే - శరణమయ్యప్ప - 90 -
ఓం కళ్లిడుం కుండ్రమే - శరణమయ్యప్ప
ఓం కరిమలై ఏట్రమే - శరణమయ్యప్ప
ఓం కరిమలై ఇరక్కమే - శరణమయ్యప్ప
ఓం పెరియాన వట్టమే - శరణమయ్యప్ప
ఓం సిరియాన వట్టమే - శరణమయ్యప్ప
ఓం పంబా నదియే - శరణమయ్యప్ప
ఓం పంబయిల్ విళక్కే - శరణమయ్యప్ప
ఓం నీలిమలై ఏట్రమే - శరణమయ్యప్ప
ఓం అప్పాచి మేడే - శరణమయ్యప్ప
ఓం శబరి పీఠమే - శరణమయ్యప్ప - 100 -
ఓం శరంగుత్తి ఆలే - శరణమయ్యప్ప
ఓం భస్మక్కుళమే - శరణమయ్యప్ప
ఓం పదునెట్టాం బడియే - శరణమయ్యప్ప
ఓం నెయ్యభిషేక ప్రియనే - శరణమయ్యప్ప
ఓం కర్పూర జ్యోతియే - శరణమయ్యప్ప
ఓం జ్యోతి స్వరూపనే - శరణమయ్యప్ప
ఓం మకర జ్యోతియే - శరణమయ్యప్ప
ఓం హరిహర సుతన్ ,ఆనంద చిత్తన్ , అయ్యనయ్యప్ప స్వామియే . . . . . . శరణమయ్యప్ప - 108 -
ధూపం. శ్లో॥ దశాంగం గుగ్గులోపేతం - సుగంధిం సుమనోహరం
హరిహరసుత నమస్తుభ్యం - గృహాణ వరద భవ॥
దీపం. శ్లో॥ దీపం గృహాణ దేవేశ - ఘృతవర్తి సమన్వితం
జ్ఞాన రూపాయ నిత్యాయ - నిర్మలాయ నమోస్థుతే॥
నైవేద్యం. శ్లో॥ ఓం భూర్భువః సువః - తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి - ధీయో యోన ప్రచోదయాత్॥
ఆపోజ్యోతి రసోమృతం (పదార్దములపై నీటిని చిలకరిస్తూ)దేవ సవిత ప్రసువ , (పగలైతే)సత్యన్ - త్వర్తేన పరిషించామి , (రాత్రైతే) ఋతంత్వా సత్యేన పరిషించామి , అమృతమస్తు ,అమృతోపరణమసి స్వాహాః ॥
ఓం ప్రాణాయ స్వాహాః ,ఓం అపానాయ స్వాహాః , ఓం వ్యానాయ స్వాహాః , ఓం ఉదానాయ స్వాహాః ఓం సమానాయ స్వాహాః, ఓం బ్రహ్మణే స్వాహాః , ఓం బ్రాహ్మణిమ ఆత్మామృతత్వాయ మధ్యే మధ్యే అమృత తుల్య పానీయం సమర్పయామి. ఉత్తరా పోషనం సమర్పయామి, హత్స ప్రక్ష్యాళయామి, పాద ప్రక్ష్యాళయామి , తాంబూలం సమర్పయామి .
తాంబూలం .శ్లో॥ ఓం పూగీఫల సమాయుక్తం - నాగవల్లీ దళైర్యుతం
ముక్తాచూర్ణ సమ్యుక్తాన్ - తాంబూలం ప్రతి గృహ్యతాం ॥
కర్పూర నీరాజనం. శ్లో॥ ఓం యఃజ్యోతి సర్వలోకానాం - తేజసాం తేజముత్తమం
ఆత్మజ్యోతి పరంధామ - నీరాజన మిదం ప్రభో॥
మంగళ హారతి. ( మంగళ హారతి ఎవరికి వచ్చిన లేక నచ్చిన పాట వారు పాడతారు.)
పంచాద్రీశ్వరి మంగళం - హరిహర ప్రేమాకృతే మంగళం
పించాలంకృత మంగళం - ప్రణమతాం చింతార్మణే మంగళం
పంచాస్యాధ్వజ మంగళం - త్రిజగత మాధ్యాప్రభో మంగళం
పంచాస్తోపమ మంగళం - శృతి శిరోలంకార సన్మంగళం ॥
మంత్ర పుష్పం . ( పుష్పాంజలి).
ఓం రాజాధి రాజయ ప్రసహ్య సాహినే - నమో వయం - వై - శ్రవణాయ కుర్మహే
సమే కామకామాయ మహ్యం - కామేశ్వరో -వై - శ్రవణో దదాతు
కుభేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః ॥
ఓం తత్పురుషాయ విద్మహే , వక్రతుండాయ ధీమహిః - తన్నోదంతి ప్రచోదయాత్
ఓం తత్పురుషాయ విద్మహే , మహా సేనాన్యే ధీమహిః - తన్నో షణ్ముఖ ప్రచోదయాత్
ఓం నారాయణాయ విద్మహే , వాసుదేవాయ ధీమహిః - తన్నో విష్ణు ప్రచోదయాత్
ఓం తత్పురుషాయ విద్మహే , మహాదేవాయ ధీమహిః - తన్నో రుద్ర ప్రచోదయాత్
ఓం భూతనాధయ విద్మహే , భవపుత్రాయ ధీమహిః - తన్నో శాస్తా ప్రచోదయాత్ ॥
ఆత్మ ప్రదక్షణ . ఓం యానికానిచ పాపాని , జన్మాంతర కృతానిచ
తానెతానె ప్రణశ్యంతి , ప్రదక్షణం పదేపదే
పాపోహం పాపకర్మాహం , పాపాత్మా పాప సంభవ
త్రాహిమాం కృపయాదేవ , శరణాగత వత్సల
అన్యధా శరణం నాస్తి , త్వమేవ శరణం మామ
తస్మాత్ కారుణ్య భావేన , రక్ష రక్ష మహేశ్వరా॥
క్షమాపణ . ఆవాహనం నజానామి - న జామి విసర్జనం
పూజావిధం నజానామి - క్షమస్వ పురుషోత్తమ
మంత్ర హీనం క్రియా హీనం - భక్తిహీనం శబరీశ్వర
యత్పూజితం మయా దేవం , పరిపూర్ణం తదస్తుమే ॥
ప్రార్ధన ( వేడుకొనుట )
మన్మయా భక్తి యుక్తేన - పత్రం పుష్పం ఫలం జలం
నివేదితం చ నైవేద్యం - తద్ గృహాణ మమ కంబయా ॥
రూపం దేహి , జయందేహి - యశోదేహి ద్వివోజహి
ఈప్సితం మే వరం దేహి - పరధర్మ పరాంగతిం ॥
పుత్రాన్ దేహి , ధనం దేహి - సర్వాన్ కామాంశ్చ దేహిమే
దేహి శాంతి మవిశ్చిన్నాం - సర్వ తత్వార్ధ దర్శనం ॥
గతం పాపం , గతం దుఖఃం - గతం దారిద్ర్య మేవచ
ఆగదా సుఖః ,సంపత్తి - అమోహాత్ తవ దర్శనం ॥
అనయా పూజయా శ్రీ హరిహరపుత్ర స్వరూప ధర్మశాస్తా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు.
ఓం ఏతత్సర్వం బ్రహ్మార్పణ మస్తు.
అనయా ధ్యాన ఆవాహనాది షోడషోపచార పూజయా భగవాన్ సర్వాత్మక శ్రీ అయ్యప్పస్వామి
సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు.
ఓం స్వామియే …. ....... శరణమయ్యప్ప . అయ్యప్ప నిత్య సాధారణ లఘుపూజ సంపూర్ణం.